వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని ఇరికించేలా సాక్ష్యం చెబితే సీబీఐ అధికారులు రూ. పది కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారంటూ కల్లూరు గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. కల్లూరు గంగాధర్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా పులివెందుల. అయితే తాను కొన్నాళ్లుగా అనంతపురం జిల్లా యాడికిలో నివాసం ఉంటున్నానని అంటున్నారు. అందుకే అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు  చేశానని చెబుతున్నారు. కల్లూరు గంగాధర్ రెడ్డి ఓ సమగ్రమైన ఫిర్యాదును టైప్ చేసుకుని ఎస్పీ ఫక్కీరప్పను కలిశారు. వైఎస్ అవినాష్ రెడ్డిని ఇరికించేందుకు తనపై ఒత్తిడి తెస్తున్నారని గంగాధర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.


Also Read : పంచాయతీ ఖాతాలను ప్రభుత్వం ఎందుకు ఖాళీ చేసింది ? సొంత క్యాడర్‌ను వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ఎందుకు ఇబ్బంది పెడుతోంది ?


వైఎస్ వివేకా హత్య తర్వాత గంగాధర్ రెడ్డిని అప్పట్లో సిట్ అధికారిగా ఉన్న సీఐ శ్రీరామ్ ... దేవిరెడ్డి శంకర్ రెడ్డి హత్య చేయించినట్లు ఒప్పుకోమని తీవ్ర ఒత్తిడి తెచ్చారని డబ్బులు కూడా పెద్ద ఎత్తున ఆశ చూపారని గంగాధర్ రెడ్డి ఫిర్యాదులో తెలిపారు. అయినప్పటికీ తాను లొంగకపోతే చిత్రహింసలకు గురిచేశారని గంగాధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వైఎస్ వివేకా కూతురు సునీత తో పాటు మరికొందరు తనను తీవ్రంగా బెదిరిస్తున్నారని గంగాధర్ రెడ్డి అంటున్నారు. వివేకా అనుచరులు, సీబీఐ అధికారులు, సీఐ శ్రీరామ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఎస్పీ ఫక్కీరప్పను కోరారు.


Also Read : పరిస్థితులు చక్కబడగానే ఉద్యోగుల సంక్షేమం .. ఉద్యమబాట పట్టిన యూనియన్లకు ప్రభుత్వం సందేశం !


తనతో పాటు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు.  వైఎస్ అవినాష్ రెడ్డి ని ఇరికించేందుకు సునీతతో పాటు కొందరు ప్రయత్నిస్తున్నారని గంగాధర్ రెడ్డి ఎస్పీ ఆఫీసు బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆరోపించారు.  గంగాధర్ రెడ్డి ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప స్పందించారు. గంగాధర్ కు రక్షణ కల్పిస్తున్నట్లు ప్రకటించారు.  తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు గంగాధర్  చెబుతున్నారని.. గంగాధర్ రెడ్డి ఫిర్యాదు లోని అన్ని అంశాలపై విచారణ చేస్తామన్నారు. విచారణకు డీఎస్పీ నియమించామని వారం రోజుల్లోగా పూర్తి చేస్తామని ఎస్పీ తెలిపారు.


Also Read : అభివృద్ధికి ప్రతిబంధకంగా ఉన్న మధ్యంతర ఉత్తర్వుల తొలగింపు - అమరావతి కేసుల విచారణ డిసెంబర్ 27కి వాయిదా !


కొద్ది రోజులుగా వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్ వివేకా కుమార్తె, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ కొంత మంది లేఖలు రాస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేస్తున్నారు. అరెస్టయిన దేవిరెడ్డి శంకర్ రెడ్డి వైఎస్ వివేకా కుమార్తె, అల్లుడుపైనే ఆరోపణలు చేశారు. తర్వాత భరత్ యాదవ్ అనే వ్యక్తి కూడా అదే చేశారు. ఇప్పుడు వారితో పాటు సీబీఐ అధికారులపైనా ఆరోపణలు చేస్తూ కల్లూరు గంగాధర్ రెడ్డి తెరపైకి వచ్చారు. దీంతో కేసులో ఏం జరుగుతుందో అన్న  అయోమయం ప్రారంభమయింది. 


Also Read: Omicron Scare: కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. విమాన సేవల పునరుద్ధరణపై కేంద్రం సమీక్ష


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి