చోరీ చేయడమంటే మాటలు కాదు.. అన్నీ సరిగా పని చేయాలంటారు. స్కెచ్ వేస్తే.. ఎవరికీ తెలియకుండా చేస్తారు. రెక్కీ నిర్వహిస్తుంటారు. ఇంత చేసినా ఒక్కొసారి దొరికిపోతారు. అయితే చాలామంది.. క్రైమ్ చేశాక దొరికిపోతే.. ఈ వ్యక్తి మాత్రం చేస్తున్న టైమ్ లో దొరికిపోయాడు. అతడు దొంగతనం చేస్తున్నాడని అందరికీ తెలిసింది. కానీ అందరికి తెలిసేలా చేస్తున్నాడని అతడికి తెలియదు. ఇక అసలు విషయంలోకి వెళ్తే..


అవయవాలు సరిగా ఉన్నవాళ్లే.. ఒక్కోసారి దొంగతనం చేసేందుకు భయపడతారు. ఎక్కడ దొరికిపోతామో.. పోలీసులు ఏం అంటారోనని. ఓ వ్యక్తి మాత్రం వినికిడి సమస్య ఉన్నా కూడా చోరీ చేసేందుకు వెళ్లాడు. అలారం మోగుతుందని తెలియక బుక్కైపోయాడు.


నిజామాబాద్‌ నగర పాలక సంస్థ, పారిశుద్ధ్య విభాగంలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా డిలోడ్‌ సునీల్‌ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. అతడికి మాటలు రావు.. చెవులు వినిపించవు. పద్మానగర్ ఏటీఎంపై అతడి కన్నుపడింది. ఎలాగైనా చోరీ చేయాలనుకున్నాడు. ప్లాన్ ప్రకారం.. శనివారం అర్ధరాత్రి ఏటీఎం దగ్గరకు వెళ్లాడు. పక్కన అటు ఇటు చూశాడు. ఎవరూ లేరని నిర్ధారించుకుని.. ఏటీఎంలోకి వెళ్లాడు.  వెంట తెచ్చుకున్న రాడ్డుతో ఏటీఎం మిషన్ ను కొట్టాడు. ఇంకేం వెంటనే కూయ్.. కూయ్ అంటూ అలారం మోగింది. 


అయితే అతడికి వినికిడి సమస్య కారణంగా ఆ శబ్దం వినిపించలేదు. ఏటీఎంలో ఉన్న డబ్బు చూసి.. ఇక సెట్ అంతా అనుకున్నాడు. డబ్బు తీసుకునే పనిలో పడిపోయాడు. అలారం శబ్దం విన్న స్థానికులు లేచారు. చోరీ జరుగుతుందేమోననుకుని పోలీసులుకు వెంటనే సమాచారం ఇచ్చారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. పోలీసులు వచ్చేసరికి కూడా చోరీ పనిలోనే ఉన్నాడు సునీల్. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.


Also Read: Crime News: చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లిన బాలుడు.. బిడ్డ కోసం వెతుక్కుంటూ వెళ్లిన తల్లి.. అక్కడ జరిగింది చూసి.. 


Also Read: Warangal Crime: హైదరాబాద్ లో బట్టల వ్యాపారం హన్మకొండలో ఆన్లైన్ బెట్టింగ్... ఈ బుకీ ఎలా బుక్కైయ్యాడంటే...!


Also Read: Viveka Murder Case : అవినాష్ రెడ్డిని ఇరికించడానికి సీబీఐ కుట్ర.. రూ. 10 కోట్లు ఆఫర్ చేశారని అనంతపురం ఎస్పీకి వ్యక్తి ఫిర్యాదు !


Also Read: Peddapalli: ఆ సినిమా చూసి శవం ముక్కలు చేసి.. వాటిని వేర్వేరు ప్రాంతాల్లో.. వ్యక్తి హత్య కేసులో సంచలన విషయాలు