ప్రపంచవ్యాప్తంగా మైనర్లపై లైంగిక వేధింపుల కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా.. ఇలాంటి ఘటనలు తగ్గడం లేదు. వెంటనే శిక్షించాలని ఎన్ని డిమాండ్లు వచ్చినా.. కామాంధులు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతూనే ఉన్నారు. పుణేలోనూ.. నాలుగేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి.. 12 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు.


మహారాష్ట్రలోని పూణే పక్కనే ఉన్న పింప్రి-చించ్‌వాడ్‌లో 4 ఏళ్ల చిన్నారిపై కిందటి శనివారం 12 ఏళ్ల బాలుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరక పోలీసులు కేసు నమోదు చేశారు. 


నవంబర్ 15, సాయంత్రం 4:30 గంటలకు 12 ఏళ్ల బాలుడు.. 4 ఏళ్ల బాలికకు చాక్లెట్ కొనిస్తానని ఆశ చూపి తీసుకెళ్లాడు. ఇంటి సమీపంలోని వ్యక్తే అయ్యేసరికి ఎవరికీ అనుమానం రాలేదు. అయితే ఎవరూ చూడట్లేదని గమనించిన పిల్లాడు బాలికను ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన బిడ్డ కనిపించడం లేదని వెతుక్కుంటూ వచ్చిన తల్లికి.. 12 ఏళ్ల బాలుడు చేస్తున్న అసభ్యకరమైన పని చూసి షాక్ అయింది. వెంటనే అక్కడకు వెళ్లింది. చిన్నారి తల్లిని చూసి బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. 


చిన్నారిని రక్షించిన తల్లి అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చింది. తమ ఇంటి దగ్గరి బాలుడు చేసిన దారుణాన్ని భర్తకు వివరించింది. అయితే ఈ విషయంపై ఆలస్యంగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 12 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికతోపాటు బాలుడిని కూడా వైద్య పరీక్షల నిమిత్తం పంపారు. చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్టు వెల్లడైంది. 


12 ఏళ్ల బాలుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 376 (i) (j) మరియు లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే చట్టం(పొక్సో) లోని సెక్షన్లు 4, 5 (m), మరియు 6 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


Also Read: Warangal Crime: హైదరాబాద్ లో బట్టల వ్యాపారం హన్మకొండలో ఆన్లైన్ బెట్టింగ్... ఈ బుకీ ఎలా బుక్కైయ్యాడంటే...!


Also Read: Viveka Murder Case : అవినాష్ రెడ్డిని ఇరికించడానికి సీబీఐ కుట్ర.. రూ. 10 కోట్లు ఆఫర్ చేశారని అనంతపురం ఎస్పీకి వ్యక్తి ఫిర్యాదు !


Also Read: Peddapalli: ఆ సినిమా చూసి శవం ముక్కలు చేసి.. వాటిని వేర్వేరు ప్రాంతాల్లో.. వ్యక్తి హత్య కేసులో సంచలన విషయాలు