హైదరాబాద్ నగరంలో స్విగ్గీ డెలివరీ ఉద్యోగులంతా సమ్మెకు సిద్ధమయ్యారు. ఇందుకోసం అంతా ఏకతాటిపైకి వచ్చి నిరసన గళం వినిపించారు. సంబంధిత యూనియన్‌తో కలిసి వారి ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయిన కారణంగా.. ఫుడ్ ఆర్డర్‌పై కనీస డెలివరీ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోవడంతో తాజాగా స్విగ్గీ యాజమాన్యానికి తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్ యూనియన్ నోటీసులు ఇచ్చింది. సమస్యలపై తమతో చర్చించేందుకు స్విగ్గీ యాజమాన్యానికి వారం రోజుల పాటు యూనియన్ గడువు విధించింది. ఒకవేళ స్విగ్గీ యాజమాన్యం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే డిసెంబర్ 5 నుంచి నిరవధిక సమ్మె ఉంటుందని హెచ్చరించారు.
డిమాండ్లు ఇవీ..
* ప్రతి ఫుడ్ ఆర్డర్‌పై డెలివరీ కనీస చార్జీని రూ.35కు పెంచాలని కార్మికులు కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగడంతో ఈ డిమాండ్ మరింతగా ఊపందుకుంది.
* కొద్ది కాలంగా పెంచకుండా ఉన్న ప్రతి కిలోమీటర్‌కు చెల్లించే మొత్తాన్ని రూ.6 నుంచి రూ.12కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
* నెలా నెలా రేటింగ్స్‌కి ఇచ్చే బోనస్ సొమ్మును రూ.4 వేలు ఇవ్వాలని అడుగుతున్నారు.
* కస్టమర్ డోర్ స్టెప్ డెలివరీ చార్జీ రూ.5ను తిరిగి అమలు చేయాలని కోరుతున్నారు. డెలివరీ పరిధిని తగ్గించడానికి సూపర్ జోన్స్ అనే వ్యవస్థను తీసేయాలని స్విగ్గీ డెలివరీ బాయ్స్ డిమాండ్ చేస్తున్నారు.
స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఉద్యోగులు నిరసనలు చేస్తుండడంతో కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ డెలివరీ నిలిచిపోయింది. తొలుత కొద్ది ప్రాంతాల ఉద్యోగులు మాత్రమే సమ్మెలోకి దిగగా.. తర్వాత మెల్లమెల్లగా అన్ని ప్రాంతాల వారు ఈ సమ్మెలో జాయిన్ అవుతారని చెబుతున్నారు. తమ నెలవారీ ఆదాయం బాగా పడిపోవడంతోనే తాము మార్పులు చేయమని సంస్థను కోరుతున్నామని స్విగ్గీ డెలివరీ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
Also Read: Nizamabad: బోధన్ రైల్వే స్టేషన్‌కు రైళ్లు ఇక రావా?
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?
Also Read: తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత
Also Read: YV Subba Reddy: డాలర్ శేషాద్రి మరణం తీరని లోటు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి