భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ కుటుంబం సూసైడ్ పై మంత్రి కేటీఆర్ స్పందించలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ బయట జరిగే ప్రతీ విషయానికి స్పందించే ట్విట్టర్ మంత్రి కేటీఆర్.... పాల్వంచ కుటుంబం ఆత్మహత్యపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. '13 ఏళ్ల ఇద్దరు బాలికలతో సహా మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే మీ మనసు చలించలేదా?  నిందితుడు ఎమ్మెల్యే కొడుకు కాబట్టి కాపాడుతున్నారు. మీ అమానుషానికి హద్దే లేదా?' అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.  






Also Read: టీఆర్ఎస్ నుంచి వనమా రాఘవ సస్పెషన్... నాడే శిక్ష వేసి ఉంటే నేడు నాలుగు ప్రాణాలు దక్కేవి... రాఘవ వేధింపులపై మరో బాధిత కుటుంబం


హోంమంత్రికి ఫిర్యాదు


పాల్వంచ ఘటనపై కాంగ్రెస్ నాయకులు హోంమంత్రి మహమూద్ అలీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెసు నాయకులు కట్ల శ్రీనివాస్, రాంశెట్టి నరేందర్, సంజయ్ యాదవ్, శ్రీధర్ గౌడ్ హోంమంత్రిని కలిశారు. 


Also Read: పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్... వనమా రాఘవను అరెస్టు చేయలేదని ఏఎస్పీ ప్రకటన


ప్రభుత్వమే వనమాను రక్షిస్తుంది


పాల్వంచ ఘటన అత్యంత అవమానకరమని టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీతా రావ్  అన్నారు. సీఎం కేసీఆర్ కు మహిళా సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. రాష్ట్ర మహిళ మంత్రులకు ఈ ఘటన పై మాట్లాడే తీరిక లేదా అన్నారు. నిందితుడిని కావాలనే అరెస్టు చేయడం లేదన్న అనుమానం కలుగుతోందన్నారు. వనమా రాఘవను ప్రభుత్వమే కాపాడుతుందన్నారు. ప్రతిపక్ష నేతలను హౌస్ అరెస్టు చేయడంలో ఉన్న చిత్త శుద్ధి నేరాలు చేసిన అధికార పార్టీ నేతలను అరెస్టు చేయడంలో ఎందుకు లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. 24 గంటల్లో వనమా రాఘవని అరెస్టు చేయకపోతే సీఎం కేసీఆర్, కేటీఆర్ కు గాజులు పంపుతామని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మనువడిని ఒక మాట అంటే గగ్గోలు పెట్టిన సీఎం కేసీఆర్... ఒక మహిళతో పాటు కుటుంబం మొత్తానికి అన్యాయం జరిగితే కనపడడం లేదా అని సునీతా రావ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు  తక్షణమే రాజీనామా చేయాలని, పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 


Also Read: కొత్తగూడెం ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో మరో ట్విస్టు.. తన భార్యను ఎమ్మెల్యే కుమారుడు రమ్మన్నాడని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి