Telangana Elections 2023 News: శభాష్! ఆక్సీజన్ సిలిండర్‌తో పోలింగ్ బూత్‌కు, అలాంటి ఓటర్లు సిగ్గుపడాల్సిందే!
తెలంగాణలో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం దాటినప్పటికీ ఇంకా ఆశించినంతగా పోలింగ్ శాతం నమోదు కాలేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ మందకోడిగా సాగుతోంది. ఓటింగ్ శాతం పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సెలవులు కూడా ఇచ్చింది. కానీ, కొంత మంది ఓటు వేయకుండా ఈ సెలవు రోజును ఇతర పనులకు వాడుకుంటున్నారు. ఇలాంటి వారికి కనువిప్పు కలిగేలా, వాళ్ల బాధ్యతను గుర్తు చేసేలా కొంత మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన తీరు ఎంతో స్ఫూర్తిని కలిగిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సాగర్ వద్ద తెలంగాణ వాహనాలకు నో ఎంట్రీ - బోర్డర్ వద్ద ఫుల్ సెక్యూరిటీ
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇష్యూతో ఒక్కసారిగా ఏపీ, తెలంగాణల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బుధవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ పోలీసులు, ఏపీ పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఓ వైపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా ఏపీ అధికారులు సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేసేందుకు సిద్ధం కావడం కలకలం రేపింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ బోర్డర్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. నాగార్జున సాగర్, మాచర్ల దారిలో తెలంగాణ నుంచి ఏపీ వైపు వచ్చే వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. ఏపీ అడ్రస్ ఆధార్ కార్డు కలిగి ఉన్న వారిని మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. మిగిలిన వారిని ఏపీ పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కవిత, రేవంత్‌లపై ఫిర్యాదులు - డీఈవో రిపోర్ట్ ఆధారంగా కేసులు పెడతామన్న వికాస్ రాజ్ !
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, రేవంత్ రెడ్డిలపై  కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులు అందాయని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.   ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని కాంగ్రెస్‌ పార్టీ ముందుగా ఫిర్యాదు చసింది.  బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌ పోలింగ్‌ స్టేషన్‌లో కవిత ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత  ఆమె మీడియాతో మాట్లాడుతూ భారాసకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.  ఇది  ఎన్నికల ప్రచారం చేయడమేనని చఎన్నికల కోడ్‌ ఉల్లంఘనగా పేర్కొంటూ కాంగ్రెస్‌ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ) వికాస్‌రాజ్‌ దృష్టికి తీసుకెళ్లి నిబంధనల ప్రకారం కవితపై చర్యలు తీసుకోవాలని  కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి



ఎస్‌ఐ ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు - 'ఎత్తు' విషయంలో ఏమందంటే?
ఏపీలో ఎస్‌ఐ పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎత్తు విషయంలో తమకు అన్యాయం జరిగిందని 22 మంది అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు (AP High Court) నవంబరు 29న కీలక తీర్పు వెలువరించింది. డిసెంబరు 4న హైకోర్టుల పర్యవేక్షణలో వారి ఎత్తు కొలవాలని కోర్టు ఆదేశించింది. పిటిషన్ వేసిన వారందరూ ఆరోజు కోర్టు ఎదుట హాజరుకావాలని తెలిపింది. 'ఎత్తు' కొలతల  విషయంలో 2018లో అర్హత సాధించిన తమను 2023 నోటిఫికేషన్‌లో అనర్హులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ వ్యాజ్యం దాఖలు చేసిన 24 మందికి హైకోర్టు పర్యవేక్షణలో, న్యాయస్థానం ప్రాంగణంలోనే ఎత్తు కొలతలు తీసేందుకు గత విచారణలో నిర్ణయించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సాయంత్రం 5.30 నుంచే ABP CVoter ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు
5 రాష్ట్రాల ఎన్నికల్లో అందరి ఫోకస్ తెలంగాణపైనే. దక్షిణాది రాష్ట్రం కావడం, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టగ్‌ ఆఫ్ వార్ ఉందన్న అంచనాలు ఇక్కడి ఎన్నికలపై ఇంట్రెస్ట్ పెంచాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. "ప్రజలు మార్పు కోరుకుంటున్నారు" అని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంది. అటు అధికార BRS పార్టీ మాత్రం "కాంగ్రెస్‌ని నమ్మితే రాష్ట్రాన్ని మునిగిపోతుంది" అని కౌంటర్‌లు ఇస్తూ ప్రచారం సాగించింది. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, రికార్డు సృష్టిస్తారని చాలా ధీమా వ్యక్తం చేసింది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి