Telangana Assembly Election 2023: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ సందడి కొనసాగుతోంది.  119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రెండు గంటల్లో పోలింగ్ నెమ్మదిగా ఉంది. కొన్నిచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అయితే, పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు అసహనానికి గురవుతున్నారు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులూ, ఇతర అధికారులు కూడా ఓట్లు వేయడానికి తరలివస్తున్నారు. 

11 గంటలకు రాష్ట్ర వ‌్యాప్తంగా  20.64% పోలింగ్

అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు మినమా తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ మొత్తం 20.63 శాతం పోలింగ్ జరిగింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30.65 శాతం.. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 12.39 శాతం ఓటింగ్ నమోదయినట్టు ఈసీ తెలిపింది.అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు సైతం పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Also Read: నా ఓటు వాళ్లకే వేశా - కేటీఆర్, అందరూ తరలిరావాలని పిలుపు

అత్యధికంగా ఆదిలాబాద్‌లో 31% పోలింగ్

ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యధికంగా 31 శాతం ఓటింగ్ నమోదయ్యింది. తర్వాత సిద్ధిపేట 28 శాతం, ములుగు 26 శాతం, పెద్దపల్లి 26 శాతం, నిర్మల్ 25 శాతం, నల్లగొండ 23 శాతం, సిరిసిల్ల 22 శాతం, మెదక్ 21 శాతం, భద్రాద్రి కొత్తగూడెం 22 శాతం పోలింగ్ నమోదయ్యింది.

హైదరాబాద్ లోనే తక్కువ

ప్రతి ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా హైదరాబాద్ నగరవాసులు ఓటేయడానికి ఆసక్తి చూపడం లేదు. పోలింగ్ మొదలైనప్పటి నుంచీ అత్యల్ప ఓటింగ్ హైదరాబాద్ లోనే నమోదవుతోంది.ఉదయం 9 గంటల వరకూ హైదరాబాద్ లో 4.57 శాతం మాత్రమే ఓటింగ్ నమోదవగా..ఈ శాతం 11 గంటలకు 12.39 శాతానికి పెరిగింది..

11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం..20.64

పోలింగ్ శాతాల్లోఅదిలాబాద్30.6భద్రాద్రి22హనుమకొండ21.43హైద్రాబాద్ 12.39జగిత్యాల22.5జనగాం 23.25భూపాలపల్లి27.80గద్వాల్ 29.54కామరెడ్డి24.70కరీంనగర్20.09ఖమ్మం26.03ఆసిఫాబాద్23.68మహబూబాబాద్28.05మహబూబ్నగర్23.10మంచిర్యాల24.38మెదక్30.27మేడ్చల్14.74ములుగు25.36నగర కర్నూల్22.19నల్గొండ22.74నారాయణపేట23.11నిర్మల్25.10నిజామాబాద్21.25పెద్దపల్లి26.41సిరిసిల్ల22.02రంగారెడ్డి16.84సంగారెడ్డి21.99సిద్దిపేట28.08సూర్యాపేట22.58వికారాబాద్23.16వనపర్తి24.10వరంగల్18.73యాదద్రి24.29

అర్బన్ ఓటింగ్ చాలా దారుణంగా ఉంటోందని కల్వకుంట్ల కవిత అన్నారు. పట్టణ ఓటర్లు కచ్చితంగా పోలింగ్ బూత్ కు రావాలని పిలుపు ఇచ్చారు. గత ఎన్నికల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ మెరుగ్గా ఉన్నప్పటికీ అర్బన్ ఏరియాల్లో చాలా దారుణంగా ఉందని అన్నారు.

Also Read: హైదరాబాద్ బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారిందా - 11 అయినా 12 శాతమే పోలింగ్!

ఓటేయకపోతే ప్రశ్నించే హక్కు లేదు - అల్లు అరవింద్

జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్‌లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని.. వేయకపోతే ప్రశ్నించే హక్కు లేదని తెలిపారు.

Also Read: ఎమ్మెల్సీ కవిత ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన, పోలింగ్ బూత్ బయటే - ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply