తెలుగు చిత్రసీమకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్. ఈ సిటీ తెలంగాణకు మాత్రమే రాజధాని కాదు... తెలుగు సినిమా పరిశ్రమకు అడ్డా కూడా! చిత్రసీమ ప్రముఖులు చాలా మంది నివసించే నగరం ఇది! వాళ్ళకు ఇక్కడ ఓటు హక్కు ఉంది. ఈ రోజు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వాళ్ళందరూ ఉదయాన్ని తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


కుటుంబంలో కలిసి వచ్చిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు ఇవాళ ఉదయం ఎనిమిది గంటలకు జూబ్లీ హిల్స్ క్లబ్బులో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబంతో కలిసి ఆయన వచ్చారు. చిరు వెంట కుమార్తె శ్రీజ కూడా ఉన్నారు. చిరంజీవి తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఓటు హక్కు వినియోగించుకుంటారని సమాచారం ఇచ్చారు. ఓటు వేయడం కోసం మైసూరులో జరుగుతున్న 'గేమ్ ఛేంజర్' చిత్రీకరణకు చిన్న విరామం ఇచ్చి మరీ ఆయన హైదరాబాద్ వచ్చారు.



Also Read: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్


సగం మంది ఓటు వేయరా? - ఎన్టీఆర్ ప్రశ్న
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఉదయాన్ని ఓటు వేశారు. భార్య ప్రణీత, తల్లి శాలినితో కలిసి  పోలింగ్ బూట్ వద్దకు వచ్చారు. క్యూ లైనులో నిలబడిన ఎన్టీఆర్... అక్కడకు వచ్చిన మీడియా, అభిమానులతో సరదాగా ముచ్చటించారు. 'సగం మంది ఓటు వేయరా?' అని ప్రశ్నించారు.


Also Readయానిమల్ వయలెన్స్... సలార్ యాక్షన్... డిసెంబర్‌లో ధూమ్ ధామ్ థియేటర్లలోకి భారీ అండ్ క్రేజీ సినిమాలు   



ఓటు వేయండి - ప్రజలకు అల్లు అర్జున్ విజ్ఞప్తి
సినిమా ప్రముఖులలో అందరి కంటే ముందు పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఉదయం ఏడు గంటలకు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆయన వచ్చారు. సుమారు 20 నిమిషాల పాటు క్యూ లైనులో నిలబడ్డారు. ఓటు వేసిన తర్వాత వేలిపై ఉన్న సిరా గుర్తును ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాధ్యతగా ఓటు వేయమని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply






ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, హీరో సుమంత్ తదితరులు సైతం ఉదయాన్ని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి ఊహ, కుమారుడు రోషన్ మేకతో కలిసి శ్రీకాంత్ పోలింగ్ బూత్ వద్దకు విచ్చేశారు. ఉదయం ఓటు వేశారు. లక్ష్మీ మంచు మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల మధ్యలో ఓటు వేయనున్నట్లు సమాచారం అందించారు. మరికొంత మంది ప్రముఖులు ఈ రోజు ఓటు వేయడానికి రెడీ అవుతున్నారు. సినిమా తారలు అందరూ క్యూ లైనులో నిలబడి మరీ ఓటు వేస్తున్నారు. మరి, మీ సంగతి ఏంటి? ప్రజలు అందరూ ఓటు వేసి తమ బాధ్యతను నిర్వర్తించాలని సినీ ప్రముఖులు పరోక్షంగా సందేశం ఇస్తున్నారు.