Minister KTR Comments: భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌ నందినగర్‌ ప్రాంతంలో ఓ పోలింగ్‌ బూత్‌లో తన భార్యతో కలిసి ఓటు వేశారు. పోలింగ్ బూత్ బయట మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పౌరుడిగా తన ఓటు హక్కు వినియోగించుకున్నానని అన్నారు. దీంతో తన బాధ్యత తాను నెరవేర్చుకున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేవాళ్లకే తాను ఓటు వేసినట్లుగా కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి కోసం పాటు పడే పార్టీకి, ఒక మంచి నాయకుడికి ఓటు వేశానని చెప్పారు. తెలంగాణలో ఓటు ఉన్న వారు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు ఇచ్చారు. పట్టణ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని కేటీఆర్ అన్నారు.