బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ - మహారాష్ట్ర కూడా తెలంగాణలా అభివృద్ధి చెందాలన్న కేసీఆర్ !
తెలంంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తూంటే.. మహారాష్ట్రలో మాత్రం ఆ పరిస్థితి లేదని కేసీఆర్ అన్నారు. తెలంగాణలా మహారాష్ట్ర కూడా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. అన్ని వనరులు ఉన్న మహారాష్ట్ర ఇంకా ఎక్కువ ఎందుకు అభివృద్ధి చెందకూడదని ప్రశ్నించారు. సోలాపూర్ జిల్లాలోని సర్కోలీ గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ బహరింగసభను నిర్వహించింది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బహిరంగసభకు హాజరై ప్రసంగించారు. బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ అని కొత్త అర్థం చెప్పారు కేసీఆర్. భారత్ కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయాయన్నారు. దేశాన్ని కాంగ్రెస్ దాదాపుగా యాభై ఏళ్లు పరిపాలించిందన్నారు. పూర్తి వివరాలు
కాంగ్రెస్ లోనే ఆ దరిద్రం - ఢిల్లీలో జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు !
కాంగ్రెస్ లో సొంత పార్టీ నేతలపైనే దుష్ప్రచారం చేస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో నేతలపైనే దుష్ప్రచారాలు చేసే దరిద్రం దాపురించిందన్నారు. ఇంత బతుకు బ్రతికి పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూస్తా అనుకోలేదన్నారు. పార్టీలో నాలుగేళ్ళ నుంచి తనపై ప్రచారం జరుగుతోందని... పార్టీ కోసం ఎంత చేసినా తనను ప్రశ్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో ఎందుకు ఈ పరిస్థితి ఉందో అర్థం కావడం లేదన్నారు. మీడియా అడిగేదాంట్లో తప్పు లేదని తెలిపారు. రాహుల్ గాంధీకి అన్ని విషయాలు నిశితంగా వివరిస్తానని చెప్పుకొచ్చారు. పూర్తి వివరాలు
పవన్ కల్యాణ్ కు స్వల్ప అనారోగ్యం - కార్యక్రమాలన్నీ రీషెడ్యూల్!
జనసేన అధినేత పవణ్ కల్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు పవన్ కల్యాణ్. ఉపవాస దీక్ష కూడా చేస్తున్నారు. పెదఅమిరంలోని నిర్మలా దేవి ఫంక్షన్ హాల్లో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. జనసేనాని అస్వస్థతకు గురి కావడంతో ఉదయం 11 గంటలకు జరగాల్సిన భీమవరం నియోజకవర్గ నేతలతో సమావేశాన్ని రీ షెడ్యూల్ చేశారు. ఈ సమావేశం మధ్యాహ్నం తర్వాత ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇత పార్టీలకు చెందిన నేతలు పవన్ సమక్షంలో ఈరోజు జనసేనలో చేరనున్నారు. పూర్తి వివరాలు
అమరావతి ఆర్5 జోన్‌లో ఇళ్ల పట్టదారులకు కేంద్రం గుడ్ న్యూస్- 47 వేలకుపైగా గృహాలు మంజూరు
అమరావతిలోని ఆర్5 జోన్‌లో ఇళ్ల పట్టాలు అందుకున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కొట్టిపారేసిన కేంద్రం వారికి ఇళ్లు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జులై 8న ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడానికి మార్గం ఈజీ అయ్యింది. మే 26న అట్టహాసంగా అమరావతి ప్రాంతంలో భారీ ఎత్తున ఇళ్ళ పట్టాల పంపిణిని జగన్ సర్కారు ప్రారంభించింది. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. పూర్తి వివరాలు
అభిమాని మృతి పట్ల ఎన్టీఆర్ సంతాపం- సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్యామ్ మర్డర్ మిస్టరీ
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) వీరాభిమాని శ్యామ్ (NTR Fan Shyam) రెండు రోజుల క్రితం మరణించారు. అతడి మృతి వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని వినబడుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాను శ్యామ్ మర్డర్ మిస్టరీ షేక్ చేస్తోంది. అభిమాని మృతి విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని జూనియర్ ఎన్టీఆర్ ఓ లేఖ విడుదల చేశారు. అభిమాని కుటుంబానికి ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు