KCR  :   తెలంంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తూంటే.. మహారాష్ట్రలో మాత్రం ఆ పరిస్థితి లేదని  కేసీఆర్ అన్నారు. తెలంగాణలా మహారాష్ట్ర కూడా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. అన్ని వనరులు ఉన్న మహారాష్ట్ర ఇంకా ఎక్కువ ఎందుకు అభివృద్ధి చెందకూడదని ప్రశ్నించారు.  సోలాపూర్‌ జిల్లాలోని సర్కోలీ గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీ   బహరింగసభను నిర్వహించింది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ బహిరంగసభకు హాజరై ప్రసంగించారు. 


బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ అని కొత్త అర్థం చెప్పారు కేసీఆర్. భారత్ కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయాయన్నారు. దేశాన్ని కాంగ్రెస్ దాదాపుగా యాభై ఏళ్లు పరిపాలించిందన్నారు. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, శివసేన, బీజేపీకి పలుమార్లు అవకాశం ఇచ్చారని కానీ అనుకున్న విధంగా అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమైనప్పుడు అన్ని  వనరులు ఉన్న మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు.  బీఆర్ఎస్ విషయంలో అన్ని పార్టీలు ఆందోళన చెందుతున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి బీ టీమ్ అని ఒకరు...  కాంగ్రెస్ కు ఏ టీమ్ అని మరొకరు విమర్శిస్తున్నారని.. కానీ తాము రైతుల పక్షాన మాత్రమే ఉన్నామన్నారు. ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదందో ముందుకు వెళ్తున్నామని ప్రకటించారు. 


, కొత్త ఉద‌యం దిశ‌గా.. క్రాంతి మార్గంలో దేశం న‌డ‌వాల‌న్నారు. సౌత్ కొరియా, జ‌పాన్, సింగ‌పూర్ మ‌లేషియా, లాంటి చిన్న దేశాలు ఎంతో ప్ర‌గ‌తి సాధించిన‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.  చైనా.. ఓ ద‌శ‌లో పేద దేశమ‌ని, కానీ ఇప్పుడు చైనా ఎలా ఉందా తెలుసా అని ప్ర‌శ్నించారు. మ‌నం ఎక్క‌డ ఉన్నామ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీనిపై ఆలోచించాల్సి అవ‌స‌రం ఉంద‌న్నారు. మ‌హారాష్ట్ర‌లో ఏ పార్టీకి అధికారం రాలేదో చెప్పండి.. కాంగ్రెస్‌, శివ‌సేన‌, బీ జేపీల‌కు ప్ర‌జ‌లు అధికారం ఇచ్చారని, చేయాల‌నుకుంటే ఎవ‌రైనా చేస్తారని, కానీ ఆ పార్టీలు ఏమీ చేయ‌లేక‌పోయిన‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రైతుల మంచి కోసం ఏదైనా చేయ‌వ‌చ్చు అన్నారు. త‌న‌కు మ‌రాఠీ రాదు అని, కానీ అన్నీ అర్థం చేసుకోగ‌ల‌న‌న్నారు. మ‌హారాష్ట్ర పెద్ద రాష్ట్రం.. ధ‌న‌వంత‌మైన రాష్ట్రం అన్నారు. మ‌హా నేత‌లు దివాళా తీస్తారని.. కిసాన్ల‌కు దివాళీ వ‌స్తుందన్నారు. భార‌త్ ప‌రివ‌ర్త‌న్ మిస‌న్ న‌డుస్తోంద‌న్నారు. పండ‌రీ ద‌ర్శ‌నం కోసం వ‌స్తే.. ద‌ర్శ‌నం చేసుకోండి.. కానీ రాజ‌కీయం చేయ‌కండి అన్నారని కొంద‌రు నేత‌లు అన్న‌ట్లు సీఎం తెలిపారు.  పండ‌రీ పుణ్య స్థ‌లం అని.. అక్క‌డ ఏమీ చెప్ప‌లేదు.. కానీ ఇక్క‌డ అన‌కుండా ఉండ‌లేన‌న్నారు.


అమెరికాలో న‌ల్ల‌జాతి వారిని ఎంతో వేధించార‌ని, కానీ బ‌రాక్ ఒబామాను గెలిపించి అక్క‌డి ప్ర‌జ‌లు ఆ రుణం తీర్చుకున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు. భార‌త్‌లో కూడా ఇలాంటి మార్పు రావాల‌ని, రైతు ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోవాల‌న్నారు. తెలంగాణ‌లో ధ‌ర‌ణి పోర్ట‌ల్‌తో భూముల్ని డిజిట‌లైజ్ చేసిన‌ట్లు సీఎం తెలిపారు. తెలంగాణ‌లో జ‌రుగుతున్న ప‌థ‌కాల అమ‌లు .. మ‌హారాష్ట్ర‌లో ఎందుకు జ‌ర‌గ‌వ‌ని ఆయ‌న నిలదీశారు. బీఆర్ఎస్‌లో చేరిన మ‌రాఠీ నేత భ‌గీర‌థ్ బాల్కేకు పూర్తి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు.








Join Us on Telegram: https://t.me/abpdesamofficial