గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా 'భగవంత్ కేసరి'. ఇందులో ఆయనకు జోడీగా చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. యువ కథానాయిక శ్రీ లీల కథలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీళ్ళిద్దరూ కాకుండా మరో అందాల భామ కూడా సినిమాలో ఉన్నారని తెలిసింది. 


'భగవంత్ కేసరి'లో పాలక్ లల్వానీ
Palak Lalwani In Bhagavath Kesari : 'అబ్బాయితో అమ్మాయి' సినిమాలో నాగశౌర్య జోడీగా నటించిన అమ్మాయి గుర్తు ఉన్నారా? ఆ తర్వాత 'జువ్వ' సినిమాలో కూడా కథానాయికగా నటించారు. ఆమె పేరు పాలక్ లల్వానీ! 'భగవంత్ కేసరి'లో ఈ నార్త్ ఇండియన్ అమ్మాయి కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతానికి ఆమె పాత్ర ఏమిటి? తెరపై ఎంత సేపు కనపడతారు? అనేది సస్పెన్స్!


అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న 'భగవంత్ కేసరి' సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ నందమూరి అభిమానులను, ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇక, 'నరసింహ నాయుడు' సినిమాలోని 'చిలకపచ్చ కొక...' పాటకు కాజల్ అగర్వాల్, శ్రీ లీల వేసిన స్టెప్పులు సినిమాలో సాంగ్ మీద అంచనాలు మరింత పెంచాయి. 


నెలకొండ భగవంత్ కేసరిగా ఎన్‌బికె!
ఎన్‌బికె (NBK)... నందమూరి బాలకృష్ణ... ఇదీ నటసింహం పేరు. సినిమాలో కూడా ఆయన పేరు ఎన్‌బికె. అంటే... నెలకొండ భగవంత్ కేసరి. టీజర్ చూస్తే ఎన్‌బికె ఊచకోత ఎలా ఉంటుందో ఈజీగా అర్థం అవుతుంది. బియాండ్ యువర్ ఇమాజినేషన్... ప్రేక్షకుల ఊహలకు అందని రీతిలో 'భగవంత్ కేసరి' సినిమా ఉండబోతుందని టీజర్ ద్వారా అనిల్ రావిపూడి చెప్పారు.


Also Read : ఫోన్ నంబర్ మార్చేసిన అషు రెడ్డి... న్యూస్ ఛానళ్ళపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక



'రాజు ఆని వెనుక ఉన్న వందల మందను చూపిస్తాడు. మొండోడు ఆనికి ఉన్న ఒకే ఒక్క గుండెను చూపిస్తాడు' అని బాలకృష్ణ చెప్పే డైలాగుతో టీజర్ మొదలైంది. ఆ తర్వాత బాలకృష్ణ మార్క్ ఫైట్, గ్రాండ్ సింగ్ విజువల్స్ కూడా చూపించారు. అడవి బిడ్డగా బాలకృష్ణ కనిపించనున్నారు. 'ఈ పేరు చానా ఏళ్ళు యాది ఉంటాది' అని చివర్లో వచ్చే డైలాగ్, ఆ తర్వాత బ్యాట్ పట్టుకుని బాలకృష్ణ గిటార్ కింద వాయిస్తూ సరదాగా పిల్లలతో బస్సులో వెళ్లడం హైలైట్!


Also Read : 'సామజవరగమన' సెన్సార్ రిపోర్ట్ - కట్ చేసిన ఆ నాలుగు పదాలు ఏమిటంటే?


ఈ సినిమాలో  బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ (Arjun Rampal) విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనను సైతం టీజర్‌లో చూపించారు. స్టార్టింగ్ విజువల్స్ చూస్తే... ఆయన ఓ స్టిక్ సాయంతో నడుస్తూ కనిపించారు. ఆ మంది మార్బలం చూస్తే సంపన్నుడు అని అర్థం అవుతోంది. తమన్ నేపథ్య సంగీతం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. హీరోయిన్ కాజల్ & లేటెస్ట్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీ లీలను చూపించలేదు. ప్రస్తుతానికి సస్పెన్సులో ఉంచారు. బాలకృష్ణ మాస్ మేనరిజమ్స్ తో అనిల్ రావిపూడి సినిమా తీసినట్టు ఉన్నారు. ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.