తెలుగు చిత్రసీమను నాలుగైదు రోజులుగా డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. జూన్ 13న నిర్మాత కేపీ చౌదరి (KP Chowdary) అలియాస్ కృష్ణప్రసాద్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో 'బిగ్ బాస్' అషు రెడ్డి (Ashu Reddy), నటి జ్యోతి, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి (Surekha Vani) వందల ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు కొన్ని న్యూస్ ఛానళ్లు పేర్కొన్నాయి. 


మీడియాలో అషు రెడ్డి ఫోన్ నంబర్!
ముఖ్యంగా న్యూస్ ఛానళ్లు అషు రెడ్డి ఫోన్ నంబర్ బయట పెట్టింది. దాంతో తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ నంబర్ బయటపెట్టిన ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్నారు. 


ఛానళ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడాయి!
''రెండు మూడు రోజులుగా ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. అందులో నా పేరు బయటకు వచ్చింది. అది పట్టుకుని చాలా న్యూస్ ఛానళ్లు ఓపెన్ గా నా నంబర్ వేశారు. నా పరువుకు భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేయడం జరిగింది. ఆ కేసుకు, నాకు ఎంత సంబంధం ఉంది? అనేది నేనూ చెప్పగలను. నా దగ్గర కూడా కాల్ లిస్ట్, ప్రూఫ్స్ ఉన్నాయి. ఏది అయితే... వందల కొద్దీ ఫోన్ కాల్స్, గంటల కొద్దీ సంభాషణలు అని చెబుతున్నారో? అందులో నిజం లేదు. అది తప్పు అని ప్రూవ్ చేయడానికి నాకూ హక్కు ఉంది. ఇటువంటి సమయంలో నేను మౌనంగా ఉంటే మీ ఆరోపణలు ఒప్పుకొన్నట్టు ఉంది. ఎంత మౌనంగా ఉందామని అనుకున్నా... ఈ రెండు రోజులు నేను తీవ్రమైన మానసిక వేదన అనుభవించా. నిజనిజాలు ఏమిటో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు కొన్ని ఛానళ్లు వార్తలు ప్రసారం చేశాయి. నోటికి వచ్చినట్లు మాట్లాడాయి. తప్పకుండా వాళ్ళ మీద పరువు నష్టం దావా కేసు వేస్తా'' అని అషు రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. 


నంబర్ బయట పెట్టడంతో...
తన ఫోన్ నంబర్ బయట పెట్టడంతో ప్రతి సెకన్ ఓ కాల్ వస్తుందని అషు రెడ్డి చెప్పారు. అంతే కాదు... ఫోన్ తీసి మిస్ కాల్స్ చూపించారు. గత రెండు మూడు రోజులుగా అదే జరుగుతోందని ఆమె వాయిపోయారు. ఇక నుంచి ఆ నంబర్ ఉపయోగించానని పేర్కొన్నారు. కేపీ చౌదరి డ్రగ్స్ కేసు జరిగినప్పుడు తాను వేరే దేశంలో ఉన్నానని, తనకు కేసుకు ఎటువంటి సంబంధం లేదని అషు రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కేసుతో ఆమెకు సంబంధం ఉందంటూ వార్తలు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా చేశారు.  






దయచేసి అర్థం చేసుకోండి,
ఆరోపణలు ఆపేయండి! - సురేఖా వాణి
కేపీ చౌదరి డ్రగ్స్ కేసుకు, ఆ కేసు నేపథ్యంలో తమపై వస్తున్న ఆరోపణలకు, తనకు ఎటువంటి సంబంధం లేదని నటి సురేఖా వాణి సైతం ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. దయచేసి ఆరోపణలు చేయడం ఆపేయమని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆరోపణల వల్ల పిల్లల భవిష్యత్తుతో పాటు తన కెరీర్, ఆరోగ్యంపై ఎంతో ప్రభావం పడుతోందని ఆమె వివరించారు. t


Also Read : రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే


కేపీ స్నేహితుడే కానీ కేసుతో సంబంధం లేదు! - జ్యోతి
కేపీ చౌదరి తనకు స్నేహితుడు అని నటి జ్యోతి అంగీకరించారు. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ వాళ్ళ అబ్బాయిని తమ ఇంట్లో డ్రాప్ చేస్తారని, పిల్లలు వీడియో గేమ్స్ ఆడతారని, అంతకు మించి కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని జ్యోతి పేర్కొన్నారు. ఈ కేసులో అమ్మాయిల ఫోటోలు మాత్రమే ఎందుకు పబ్లిష్ చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. అబ్బాయిల ఫోటోలు ఎందుకు వేయడం లేదు? అని జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం అయితే నార్కోటిక్ టెస్టుకు రెడీ అని, విచారణలో పోలీసులకు సహకరించడానికి సిద్ధమని ఆమె స్పష్టం చేశారు.


Also Read : ఐదేళ్ళ పాటు 'దిల్' రాజును ఆదుకున్న పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ'


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial