దిష్టి తగలడం లేదా చెడు దృష్టి వల్ల కలిగే ప్రతికూలతలను తొలగించేందుకు చాలా రకాల పరిహారాలు, ఉపాయాలు ప్రాచూర్యంలో ఉన్నాయి. దిష్టి నుంచి రక్షించుకునేందుకు ఒకొక్కరికి ఒక్కో మార్గం ఉంటుంది. కొంతమంది చిన్న పిల్లలకు నల్లని కాటుక చుక్క పెడతారు. కొందరు దుకాణాలు, వాహనాలకు నిమ్మకాయలు వేలాడదీస్తారు. ఇంకొందరు తాయత్తులు కట్టించుకుంటారు. కొంత మంది ఎర్ర మిరపకాయలు తీప్పేస్తుంటారు. ఈ రోజుల్లో ఇలా దిష్టి తగలకుండా నివారించేందుకు ఫెంగ్ షూయిలో ఈవిల్ ఐ (Evil eye) చాలా ప్రాచూర్యంలో ఉంది. అసలు ఈవిల్ ఐ అంటే ఏమిటి? దాని పూర్వాపరాల గురించి తెలుసుకుందాం.


మన భారతీయ వాస్తు శాస్త్రం మాదిరిగానే.. చైనీయుల ఫెంగ్ షూయి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచూర్యంలో ఉన్నవాస్తు విధానం. ఇందులో కూడా పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకునే అనేకానేక విషయాలు చర్చించారు. ఇది అతి పురాత చైనీస్ శాస్త్రం అని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మతాల వారు ధర్మాల వారు ఫెంగ్ షూయిలోని ఈవిల్ ఐ ని నమ్ముతున్నారు. జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు ఫెంగ్ షూయి పరిహారాలు చూపుతుంది. అలాంటి పరిహారాల్లో ఈవిల్ ఐ కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో ఈవిల్ ఐ ప్రాబల్యం చాలా పెరిగింది. చాలా మంది ఈవిల్ ఐ ఏదో ఒక విధంగా ధరించడం చూస్తున్నాం.


ఈవిల్ ఐ (Evil eye) అంటే ఏమిటి?


ఈవిల్ ఐ గుండ్రని వృత్తాకారంలో ఉండే కనుపాప వంటి ఒక నమూనా. దీనిని నీలం రంగులో గాజుతో చేస్తారు. ఇది సంప్రదాయ ఫెంగ్ షూయి లో దిష్టి నివారణకు ఉపయోగించే సాధనం. గుండ్రని ఆకారం, నీలం రంగు విశ్వాసానికి ప్రతీకలు, మధ్యలో ఉండే తెల్లని, నలుపు రంగులు కంటికి, కంటి చూపులోని స్వచ్ఛతకు, చుకుకు దనానికి చిహ్నం. దీనిని మొక్కుల, జంతువులు, చిన్న పిల్లలు, ఇళ్ళు, వాహనాలు ఇలా దేనికైనా రక్షగా కట్టవచ్చు.


ఈవిల్ ఐ ఉపయోగాలు


చైనీస్ ఈవిల్ ఐ.. ముఖ్యంగా పాజిటివిటిని ఆకర్షించి, నెగెటివిటిని తొలగిస్తుంది. దీనిని తాయత్తులా ధరించవచ్చు. పనిచేసుకునే చోట శత్రువులను నిరోధించేందుకు ఆఫీస్ డెస్క్ మీద కూడా అలంకరించవచ్చు. వ్యక్తి గత రక్షణ, కొత్త కారు దిష్టి కోసం, మోబైల్ రక్షణకు, ఇంటి బయట, పర్సులో ఇలా అన్నింటికి ఈవిల్ ఐని అలంకరించి దిష్టి తగలకుండా నివారించడం సాధ్యం అవుతుంది. ఇంట్లో వాల్ హ్యాంగింగ్ గా కూడా అలంకరించవచ్చు.


Also read: Laughing Buddha: లాఫింగ్ బుద్ధ ఎవరు? ఆ విగ్రహం ఇంట్లో ఉండటం మంచిదేనా? ఎక్కడ పెడితే శ్రేయస్కరం?


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.