డాక్టర్ అవ్వాలనుకున్నామె వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడింది. ఇది వినాడానికి ఆశ్చర్యంగా ఉన్నా  ఇది నిజం. హైదరాబాద్‌లోని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ స్పా సెంటర్‌పై దాడి చేశారు. అక్కడ నిర్వాహకుల బ్యాక్‌గ్రౌండ్ చెక్‌ చేస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 


గుట్టుగా కూపీ లాగారు


బంజార హిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఓ అపార్ట్మెంట్‌లో స్పా సెంటర్ పేరుతో వ్యభిచార కూపాన్ని నడుపుతున్నారు నిర్వహాకులు. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న వ్యవహారంపై పోలీసులకు ఉప్పందింది. వెంటనే మఫ్టీలో వెళ్లిన పోలీసులు అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగి ముగ్గురు నిర్వాహకులు, 18 మంది విటులను అరెస్టు చేశారు.  


శృతి బ్యాక్‌ గ్రౌండ్ విని షాక్


కేసు పూర్వపరాల్లోకి వెళ్లిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల బ్యాక్‌గ్రౌండ్ చూసి విస్తుపోయారు. పర్పుల్ నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో జరుగుతున్న వ్యవహారంలో ఓ యువతి కింగ్‌పిన్‌గా ఉన్నారని తేల్చారు పోలీసులు. ఆమె రాయల శృతి. 


శృతికి రమణ, జాహెద్‌ సహకారం


రాయల శృతికి రమణ ,జాహెద్ అనే వ్యక్తులు సహాయసహకారాలు అందిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి క్రాస్ మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారీ ముగ్గురు. వీళ్లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ కూపంలో ఇరుక్కుపోయిన యువతులను రెస్క్యూ హోంకు పంపించారు. 


డబ్బుల్లేక డాక్టర్‌ చదువుకు బై బై 


రాయల శృతిది భద్రాచలంలోని ఓ మధ్య తరగతి ఫ్యామిలీ. డాక్టర్ కావాలనే కలలతో చదువుకుంది. ఇక్కడ సీటు రాలేదు. ఉక్రెయిన్‌లో అప్లై చేస్తే సీటు వచ్చింది. అక్కడ మొదటి ఏడాది డాక్టర్ కోర్సు పూర్తి చేసి తిరిగి వచ్చేసింది శృతి. డబ్బులు చెల్లించే స్థోమత లేక ఈ నిర్ణయం తీసుకుంది. 


హెయిర్‌ హోస్టుగాను రాణించలేకపోయిన శృతి


అలా డాక్టర్ కావాలనే కలలు కల్లగా మిగిలిపోవడంతో హెయిర్‌ హోస్టర్‌గానైనా పని చేయాలనుకుంది. అందుకోసం అమీర్‌పేట్‌లో ఓ సంస్థలో శిక్షణ కూడా తీసుకుంది. తర్వాత ఆ కలను కూడా వదిలేసుకొని ఓ రిసెప్షనిస్ట్‌గా జాయిన్ అయింది. ఓ స్టార్ హోటల్‌లో పని చేసింది. 


అలా కన్న కలలు నిజం కాకపోవడంతో డబ్బు సంపాదనకు తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది. అప్పటికే పరిచయం ఉన్న రమణ ,జాహెద్‌తో కలిసి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్ పరిధిలో మసాజ్ సెంటర్‌ను స్టార్ట్ చేసింది. అక్కడ మసాజ్‌ పేరుతో వ్యభిచారం చేయించింది. రమణ, జాహెద్‌ వేర్వేరు ప్రాంతాల్లో అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ పనిలో పెట్టించేవాళ్లు. వారిని ఒప్పించి వారితో పాడు పని చేయించేది శృతి.


మొదటి సారి పంజాగుట్టలో అరెస్టు 


దీన్ని పసిగట్టిన పోలీసులు మొదటిసారి శృతిని గతంలో అరెస్టు చేశారు. ఇలా వ్యభిచార కూపం నడుపుతున్నారని ఆమెను జైలుకు కూడా పంపించారు. జైలుకు వెళ్లినా శృతి ప్రవర్తన, ఆలోచనల్లో మార్పు  రాలేదు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా అదే పనిని స్టార్ట్ చేశారు. ఈసారి ప్లేస్‌ మార్చి కొత్త స్టైల్‌లో వ్యాపారం స్టార్ట్ చేసింది. కానీ ఈసారి కూడా పోలీసులకు చిక్కింది. మళ్లీ జైలు బాట పట్టింది.