గుప్పెడంతమనసు జూన్ 27 ఎపిసోడ్
వసుధారని కలిసేందుకు వెళ్లిన మహేంద్రకి ఆమె కాలేజీకి రాలేదని తెలుసుకుని వెనుతిరుగుతాడు. రోడ్డుపక్కన నిల్చుని ఆలోచిస్తుండగా చక్రపాణి ఎదురవుతాడు. మీరిక్కడే ఉంటే వసుధార ఎక్కడికి వెళ్లింది, కాలేజీకి వెళితే సెలవు పెట్టిందన్నారని అంటాడు. మా ఇంటికి రండి అన్ని విషయాలూ మాట్లాడుకుందాం అని చక్రపాణి పిలుస్తాడు. మెకానిక్ కి కాల్ చేశాను కారు పాడైందని చెబుతాడు మహేంద్ర. కారు బాగవడానికి సమయం పడుతుందని మెకానిక్ చెప్పడంతో చక్రపాణి మరోసారి రిక్వెస్ట్ చేసి మహేంద్రని ఇంటికి తీసుకెళతాడు.
కాలేజీలో రిషి క్లాస్ చెబుతుంటాడు. కేజీ బ్యాచ్ ఫస్ట్ బెంచ్ లో కూర్చుని క్లాస్ వింటుంటారు. స్టూడెంట్స్ అంతా కేడీ బ్యాగ్ గురించి మంచిగా మాట్లాడుకుంటారు. మరోవైపు రిషి క్లాసు చెబుతుంటే క్లాసుకి కొంచెం దూరంలో కూర్చుని రిషిని చూస్తుంటుంది వసుధార. అటు వసుధారని చూసి ఏం చెబుతున్నాడో మరిచిపోయి ఏదేదో మాట్లాడుతుంటాడు. రిషి ఇబ్బందిని స్టూడెంట్స్ గమనిస్తారు. కేడీ బ్యాచ్ లీడర్ పాండ్యన్ వసుధారని గమనిస్తాడు. విండో క్లోజ్ చేద్దామని రిషి వెళ్లగానే వసుధార అక్కడినుంచి వెళ్లిపోతుంది. నా చూపులు, నా ఆశలు మీకు ఆనందం ఇచ్చే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ అనుకుంటుంది వసుధార.
Also Read: తప్పు తెలుసుకుని రిషి కాళ్ళ మీద పడిన కేడీ బ్యాచ్- కాలేజ్ లో మహేంద్రని చూసి దాక్కున్న వసు
మహేంద్ర - చక్రపాణి
ఇంటికి వెళ్లిన మహేంద్రతో చక్రపాణి ఏదో చెబుతాడు. ఎందుకు వసుధార అలా చెప్పించింది, రిషి ఎక్కడున్నాడో వసుధారకి తెలిసే ఉంటుందా, అసలు జగతి వసుధార ఆరోజు ఎందుకలా చేశారని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు మహేంద్ర. ఏం చెప్పాలో అర్థంకాని చక్రపాణి కాఫీ తీసుకొస్తానని వెళ్లిపోతాడు. అంతలో మహేంద్ర వసుధార తల్లి ఫొటోకి దండ వేసి ఉండడం చూసి ప్రశ్నిస్తాడు. సుమిత్ర చనిపోయిన విషయం తెలుసుకుని మహేంద్ర బాధపడతాడు. మీ కొడుకు మీకు దూరమైన మరుక్షణమే తను గుండెపోటుతో చనిపోయిందని చెబుతాడు. వసుధార -జగతి చేసిన పనికి ఇంతమంది బలైపోయారు,ఎందుకలా చేశారో తెలియడం లేదు ఇద్దరూ మాట దాటేస్తున్నారు కానీ నిజం చెప్పడం లేదని బాధపడతాడు మహేంద్ర. నాక్కూడా కారణం తెలియదు కానీ ఏదో పెద్ద కారణం ఉంటేకానీ వాళ్లు అలా చేయరు కదా అంటాడు చక్రపాణి. నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నా నేను నా కొడుకుని కళ్లారా చూడకుండానే చనిపోతానేమో అనిపిస్తోందని మహేంద్ర బాధగా మాట్లాడడం చూసి చక్రపాణి ఆగలేక తను క్షేమంగానే ఉన్నారండీ అనేస్తాడు. మహేంద్రకి డౌట్ వచ్చి చక్రపాణిని నిలదీస్తాడు. రిషి కాలేజీలో పనిచేస్తున్న విషయం, ఎవ్వరికీ చెప్పొద్దన్న విషయం మొత్తం చెప్పేస్తాడు. చక్రపాణికి థ్యాంక్స్ చెప్పేసి మహేంద్ర వెళ్లేందుకు బయలుదేరుతాడు. కానీ చక్రపాణి ఆపేస్తాడు. తన మనసులో బాధ, కోపం పోలేదని గతంలో తాను కలసిన విషయం చెబుతాడు చక్రపాణి. మీరిప్పుడు తన దగ్గరకు వెళ్లి తను సరిగా మాట్లాడకపోతే మీరు నొచ్చుకుంటారు ఇంకొన్నాళ్లు పోతే అల్లుడిగారి కోపం తగ్గే అవకాశం ఉంది అప్పుడు కలిస్తే బావుంటుందనగానే మహేంద్ర రియలైజ్ అవుతాడు. పరిస్థితులన్నీ చక్కబడి మళ్లీ అందరూ ఆనందంగా ఉండాలని కన్నీళ్లతో కోరుకుంటాడు చక్రపాణి.
Also Read: తొలి ఏకాదశి(జూన్ 29 ) ప్రత్యేకత ఏంటి, ఈ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి!
రిషి-వసుధార
కాలేజీలో రిషి వెనుకే నడుస్తుంటుంది వసుధార...తను నా వెనుకే వస్తుంటే నా గతం నన్ను వెంటాడుతున్నట్టుందని అనుకుంటాడు రిషి. కారు వరకూ వెళ్లి ఆగిపోతాడు. సార్ ఎందుకు ఆగిపోయారు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తను నా కంటికి కనిపించనంత దూరం వెళ్లాక నేను వెళ్లాలి అనుకుంటాడు. ఇంతలో వసుధార మేడంకి యాక్సిడెంట్ అయిందని స్టూడెంట్స్ పరిగెడుతుంటే రిషి కూడా కంగారుగా వెళతాడు కానీ కొద్దిసేపు దూరంగానే ఆగిపోతాడు. మళ్లీ ఏదో ఆలోచించుకుని వసుని హాస్పిటల్ కి తీసుకెళతూ వసుధార వసుధార అని టెన్షన్ పడుతుంటాడు.
మహేంద్ర-పాండ్యన్
రిషి అలా వెళ్లగానే కాలేజీలోకి అడుగుపెడతాడు మహేంద్ర. పాండ్యన్ ని పిలిచి రిషి సార్ ఉన్నారా అని అడుగుతాడు. తను మీకు ఏమవుతారని అడిగిన పాండ్యన్ కి నాకు బాగా కావాల్సిన వ్యక్తి అని అబద్ధం చెబుతాడు. పాండ్యన్ దగ్గర నంబర్ తీసుకుని మహేంద్ర వెళ్లిపోతాడు. అదేంటి ఇంత ఫాలోయింగ్ ఈయన లెక్చరరేనా, ఇంకేమైనానా అనే డౌట్ పాండ్యన్ కి వస్తుంది. మహేంద్ర మాత్రం రిషి నంబర్ తీసుకుని మురిసిపోతుంటాడు.