Karthika Deepam 2: ‘కార్తీకదీపం’ సీరియల్ ముగిసి కొన్ని నెలలు అయినప్పటికీ కూడా ప్రేక్షకులు ఈ సీరియల్ పై ఉన్న అభిమానాన్ని చంపుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అందులో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలను అస్సలు మర్చిపోలేకపోతున్నారు. అయితే ఈ కాంబినేషన్ మళ్ళీ త్వరలో రావడానికి సిద్ధంగా ఉందని తాజాగా డాక్టర్ బాబు ఒక చిన్న హింట్ ఇచ్చాడు. 


ఐదు సంవత్సరాల కిందట స్టార్ మాలో ప్రారంభమైన ఈ సీరియల్ తమ కంటెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సాగిన ఈ కథకు ప్రేక్షకులు బాగా ఫిదా అయ్యారు. చాలావరకు ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో చాలా సీరియల్స్ వస్తూ ఉంటాయి. కానీ ఏ సీరియల్ కు కనెక్ట్ కానీ ప్రేక్షకులు ‘కార్తీకదీపం’కు కనెక్ట్ అయ్యారు. అంతలా ఈ సీరియల్ వారికి అభిమాన సీరియల్ గా మారిపోయింది. కేవలం ఆడవాళ్లే కాదు మగవాళ్ళు సైతం ఈ సీరియల్స్ కు వాలిపోయారు.


అంతే కాదండోయ్ కొంతమంది స్టార్ సెలబ్రెటీలు కూడా ఈ సీరియల్ ను చూసేవారు. అలా ప్రతి ఒక్కరికి ఈ సీరియల్ కథ కనెక్ట్ అవ్వడమే కాదు ఈ సీరియల్ లో నటించిన పాత్రలు కూడా బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా వంటలక్క, డాక్టర్ బాబు పాత్ర. ఈ సీరియల్ లో వీరిద్దరూ భార్యాభర్తలుగా నటించగా వీరి మధ్య వచ్చిన ఆటుపోట్లే ఈ సీరియల్ కథ. చాలా వరకు అందరికీ ఈ సీరియల్ స్టోరీ తెలిసిందే. ప్రేమించిన వ్యక్తికి పెళ్లయి, పిల్లలు పుట్టినప్పటికీ కూడా ప్రేమ తగ్గించుకోకుండా చివరి వరకు అంతే ప్రేమతో తుది శ్వాస విడిచి గొప్ప ప్రేమికురాలుగా నిరూపించింది మోనిత పాత్ర.


అంతేకాకుండా ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా చివరికి భర్త తనను కాదని గెంటేసిన కూడా తిరిగి తన భర్త ప్రేమను పొంది మంచి భార్యగా అనిపించుకుంది దీప. అలా కొనసాగిన ఈ సీరియల్ రొటీన్ స్టోరీ అయినప్పటికీ కూడా డైరెక్టర్ బోర్ కొట్టకుండా ప్రేక్షకులకు సీరియల్ కు వాలేలా చేశాడు. అయితే చివరికి ఏం చేయాలో తెలియక సీరియల్ ను మొత్తానికి ఆ విధంగా ముగించేశాడు. అయితే ఈ సీరియల్ అభిమానులు మాత్రం ఈ సీరియల్ శుభం కార్డు పలకటంతో అసలు తట్టుకోలేకపోయారు.


కానీ ఆ సమయంలో డైరెక్టర్ సీజన్ 2 ఉంటుంది అన్నట్లుగా ఒక హింట్ అయితే ఇచ్చాడు. అప్పటినుంచి ప్రేక్షకులు ‘కార్తీకదీపం’ 2 కోసం తెగ ఎదురు చూస్తున్నారు. అయితే పార్ట్ 2 గురించి ఇప్పటివరకు డైరెక్టర్ కానీ, ‘కార్తీకదీపం’ టీం కానీ హింట్ ఇచ్చినట్లు అనిపించలేదు. కానీ తాజాగా డాక్టర్ బాబు పాత్రల్లో నటించిన నిరూపమ్ పరిటాల పార్ట్ 2 గురించి స్పందించాడు. తాజాగా నిరూపమ్ ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఇక ఇప్పటికీ తాను ఎక్కడికి వెళ్లినా కూడా ‘కార్తీకదీపం’, వంటలక్క గురించి అడుగుతుంటారు అని అన్నాడు.


ఇక తన పేరు మర్చిపోయి అందరు డాక్టర్ బాబు అని పిలుస్తుంటారు అని.. తన విశ్లేషణ ప్రకారం ప్రతి ఒక్కరి జీవితాల్లో గొడవలు ఉంటాయని.. అందుకే ప్రతి ఒక్కరికి ‘కార్తీకదీపం’ సీరియల్ కనెక్ట్ అయ్యింది అని అన్నాడు. ఇక తన భార్య మంజులతో బయటికి వెళ్లినా కూడా వంటలక్క గురించి అడుగుతుంటారు అని.. ఇక ఆమెకు పరిస్థితి తెలుసు కాబట్టి నవ్వి ఊరుకుంటుందని అన్నాడు. ఇక ‘కార్తీకదీపం’ 2 ఉంటుందా అని ప్రశ్న ఎదురవటంతో.. తనకు తెలిసి ఉండకపోవచ్చు అంటూ.. ఎందుకంటే ఆ రేంజ్ కథ దొరకాలి. అన్ని కుదిరితే సీజన్ టు చేయాలి.. లేకపోతే టచ్ చేయకపోతేనే బెటర్ ఏమో.. కానీ తమ ఇద్దరి కాంబోలో మరో సీరియల్ చేయొచ్చు అని అన్నాడు. అంటే ‘కార్తీకదీపం’ 2 ఉన్నా లేకపోయినా.. డాక్టర్ బాబు, వంటలక్క కాంబినేషన్లో మరో సీరియల్ ఉండబోతుందని తెలుస్తుంది.


Read Also: ‘స్పై’ to ‘సామజవరగమన’- జూన్‌ చివరి వారంలో థియేటర్లలో సందడి చేసే సినిమాలివే!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial