షూటింగ్‌‌లో గాయపడ్డ పృథ్వీరాజ్ సుకుమారన్ - ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్


మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ చిత్రం 'విలయత్ బుద్ధ' షూటింగ్‌లో చిన్న ప్రమాదానికి గురయ్యాడు. ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పృథ్వీరాజ్ గాయాలు కావడంతో సోమవారం ఉదయం కొచ్చిన్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కాలికి కీహోల్ శస్త్రచికిత్స చేయనున్నట్టు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆయన కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండనున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాలంటే పృథ్వీరాజ్ కుటుంబసభ్యులు లేదా సన్నిహితులు గానీ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా పృథ్వీరాజ్‌కు గాయమైందన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


మాట తప్పిన విజయ్ దళపతి, నార్కోటిక్స్ నియంత్రణ చట్టం కింద కేసు నమోదు


ప్రముఖ తమిళ నటుడు విజయ్ దళపతి ప్రస్తుతం ‘లియో’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ‘విక్రమ్’ సినిమాతో ఒక కొత్త యూనివర్స్ ను క్రియేట్ చేసిన లోకేష్, ‘లియో’ తో మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్దం అవుతున్నాయి. అందులోనూ ‘లియో’ మూవీ లోకేష్ యూనివర్స్ లో భాగం అని కూడా అంటున్నారు. ఈ మూవీపై దేశవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పిటికే సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ రివీల్ వీడియో, ఫస్ట్ లుక్ కు మంచి క్రేజ్ వస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


కేసీఆర్‌కు తెలంగాణ అంటే ఎంత ఇష్టమో, నువ్వు నాకు అంత ఇష్టం - ఫన్నీగా ఫన్నీగా ‘భాగ్ సాలే’ ట్రైలర్!


ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్  ఎం.ఎం. కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహ కోడూరి హీరోగా నటిస్తున్న సినిమా 'భాగ్ సాలే'. ప్రణీత్ సాయి దర్శకత్వంలో వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా పతాకాలపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో  విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఫుల్ ఫన్, యాక్షన్ సన్నివేశాలతో అలరిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


సింగర్ మంగ్లీకి గాయాలు - అసలు విషయం ఇదీ!


జానపద పాటలతో ప్రారంభమై.. నేడు సినీ ప్రేక్షకులను సైతం తన గాత్రంతో ఉర్రూతలూగిస్తోన్న సింగర్ మంగ్లీకి గాయాలైనట్టు సోమవారం పలు వార్తలు వచ్చాయి. ఓ పాట కోసం మంగ్లీ కొన్ని రోజులుగా షూటింగ్స్‌లో పాల్గొంటోందని, అప్పుడే ఆమెకు ప్రమాదం జరిగినట్లుగా సమాచారం బయటకు వచ్చింది. ఈ ఘటనలో ఆమె కాలికి స్వల్పంగా గాయాలయ్యాయని, ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగ్లీనే స్వయంగా దీనిపై స్పందించింది. ఈ తరహా వార్తలు నిజం కాదని ఆమె క్లారిటీ ఇచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


దిల్ రాజు, దర్శకుడు శంకర్‌పై మండిపడుతోన్న మెగా అభిమానులు - కారణం ఇదే


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత ఆలస్యం అయిన ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమా షూటింగ్ దాదాపు 2 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. కానీ ఇండియన్ 2 సినిమా రాబోతుండడంతో ఆ మూవీ షూటింగ్ కాస్త ఆలస్యమై ప్రస్తుతం చాలా స్లోగా సాగిపోవడం రామ్ చరణ్ అభిమానులకు నిరాశ కలిగించే అంశంగా మారింది. ఆ నిరుత్సాహం వారిని ఎంతగానో ఆగ్రహానికి గురి చేస్తోంది. దీంతో ఆ చిత్ర దర్శకనిర్మాతలపై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)