Krishnamma kalipindi iddarini June 26th: పార్టీ ముగిసిన తర్వాత ఆదిత్య అమృతను తలుచుకొని బాధపడుతూ ఉండగా అక్కడికి ఈశ్వర్ వచ్చి ఎందుకు అమ్మకి నీ ప్రేమ విషయం చెప్పలేదు అని అంటాడు. దాంతో ఆదిత్య తన అన్నయ్యకి నిజం చెప్పడం ఇష్టం లేక నేను ప్రేమించింది అఖిలనే అని చెబుతాడు. ఆ మాట విని ఈశ్వర్ నమ్మలేక పోతాడు.


ఇది నమ్మకం గా లేదు అని ఎందుకంటే మీ మధ్య అంత పరిచయం కూడా లేదు కదా అని అనడంతో.. వెంటనే ఆదిత్య గతంలో ఒక చోట తనను చూశాను అని అప్పుడే తనని ఇష్టపడ్డాను అని అంటాడు. మరి మొన్న అడిగినప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని ఈశ్వర్ అనడంతో.. నేను ప్రేమిస్తున్నది గౌరీ గారి వాళ్ళ చెల్లెలు కాబట్టి నిన్ను సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు అని అంటాడు.


కానీ ఈశ్వర్ కి మాత్రం అది నిజం అన్నట్లుగా అనిపించదు. కానీ ఆదిత్య కథను అల్లి నమ్మించడంతో అప్పుడు ఈశ్వర్ ఒప్పుకుంటాడు. ఇద్దరు అక్క చెల్లెలు మన ఇంటికి వస్తే మన మధ్య బంధం కూడా ఎప్పటికీ దూరం కాదు అని సంతోషపడతాడు. మరోవైపు ఆనందయ్య భార్య, పిల్లలు లేకపోయేసరికి ఎక్కడికి వెళ్లారు అని కంగారు పడతాడు.


అప్పుడే దుర్గ భవాని ఇద్దరు పిల్లలతో రావడంతో ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు ఆనందయ్య. ఇక భవాని సునంద వాళ్ళ ఇంటికి వెళ్ళాము అని.. తన ఇద్దరు కొడుకులతో ఇద్దరు కూతుర్ల పెళ్లి కుదిరిందని చెబుతుంది. దాంతో జరిగిన విషయాల గురించి ఆనందయ్య మాట్లాడుతూ అలా ఎలా ఒప్పుకున్నావు నువ్వు అని.. అయినా నువ్వే కదా గౌరీని పెళ్లి చేసుకోదని చెప్పింది.. మళ్లీ నువ్వే ఎలా ఒప్పుకున్నావు అని అంటాడు.


అంతేకాకుండా అఖిల గురించి మాట్లాడుతూ గౌరీ విషయంలో అఖిలను తన చిన్న కొడుకుతో పెళ్లి చేయమని కండిషన్ పెట్టావేమో అని అందుకే వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారేమో అనటంతో దెబ్బకు దుర్గాభవాని షాక్ అవుతుంది. మళ్లీ తనే అలా ఏమి కాదు అని సునందనే అఖిల ని చూసి ఒప్పుకున్నారు అని చెబుతుంది. ఇక ఆనందయ్య అనుమానంతో ఉండగా దూరగా భవాని అక్కడి నుంచి కోపంతో వెళుతుంది.


ఆ తర్వాత ఆనందయ్య తన కూతురు గౌరీకి ఇష్టం ఉంటేనే చేసుకోమని లేదంటే ఒత్తిడి లేదని చెబుతాడు. మరోవైపు అమృత ఆదిత్య విషయంలో బాధపడుతూ కనిపిస్తుంది. అప్పుడే ఆదిత్య రావటంతో మన పెళ్లి విషయం ఇంట్లో చెప్పవా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఎమోషనల్ అవుతుంది. దాంతో ఆదిత్య జరిగిన విషయం చెప్పటంతో బాగా కుళ్లిపోతుంది. ఆదిత్య కూడా కన్నీటిలో మునిగిపోతాడు. ఇక గౌరీ, ఈశ్వర్ కృష్ణమ్మ నది దగ్గరకు వచ్చి సంతోషంగా మాట్లాడుతూ కనిపిస్తారు. కృష్ణమ్మ కలిపినందుకు జీవితాంతం కలిసిపోతున్నాము అని సంతోషపడతారు.


Also Read: Trinayani June 26th: గాయత్రిని తాకటంతో తిలోత్తమాకు కొట్టిన షాక్, అత్త నిర్ణయంపై అవాక్కైన నయని దంపతులు?