మొగుడ్ని దివ్య బాగానే బుట్టలో వేసుకుంటుంది. పెళ్ళాం అందం చూసి విక్రమ్ మనసు కరిగిపోతుంది. లాస్యతో విడాకులు వచ్చాయని దివ్య సంతోషంగా చెప్తుంది. ఇద్దరూ ఒక కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు వేసుకుని తాగేస్తారు. రాజ్యలక్ష్మి హాస్పిటల్ మేనేజర్ ని తిడుతుంది. మోసం చేశావు మా హాస్పిటల్ లో పని చేస్తూ శత్రువులకి ఇన్ఫర్మేషన్ ఇస్తావా అని కొప్పడుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అంటే వద్దులో ఉద్యోగంలో నుంచి తీసేయమని విక్రమ్ అంటాడు. అది కష్టమని ఇప్పటికిప్పుడు ఎక్స్ పీరియన్స్ వ్యక్తి దొరకరని సంజయ్ అంటాడు. మోసం చేసిన వ్యక్తి ఉండటానికి వీల్లేదని విక్రమ్ ఖరాఖండీగా చెప్తాడు. లాస్య ఉంది కదా తనకి ఎక్స్ పిరియన్స్ ఉందని తను ఖాళీగా కూడా ఉందని రాజ్యలక్ష్మి రికమండ్ చేస్తుంది. పైగా మీ ఇద్దరి పెళ్లి కూడా చేసింది కదా రుణం తీర్చుకోవాలని అంటాడు. ఆవిడ వల్ల ఇక్కడ కూడా లేనిపోని సమస్యలు రావచ్చు. లాస్య మీద నమ్మకం లేదు. ఆమెని అపాయింట్ చేయడం దివ్యకి కూడా ఇష్టం లేదని విక్రమ్ చెప్తాడు.
Also Read: కీలక మలుపు, కృష్ణని మురారీ జీవితంలో నుంచి వెళ్లిపొమ్మన్న ముకుంద
లాస్య కాకుండా వేరే ఎవరినైనా చూడమని చెప్తాడు. నా కొడుకు నా మాట కాదనడు అని రోజూ చెప్తారు కదా ఇప్పుడు ఏమంటారు. మీ మాట కాదనడం కాదు దివ్యకి ఇష్టం లేదు కాబట్టి వద్దు అన్నాడు. ఎంత అవమానం జరిగిపోయింది. లాస్యని ఉద్యోగంలోకి తీసుకోవడం కోసం ఉన్న మేనేజర్ ని పీకేశారు. మీరు అనుకున్నట్టు జరగదు. కోర్టులో మానాన్న గెలిచాడు. ఇక్కడ నేను గెలిచాను నాకు మంచి రోజులు మొదలయ్యాయి. ఇక నుంచి మీ అబ్బాయి నా చంకలో ఉన్నట్టేనని దివ్య రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. లాస్యని అపాయింట్ చేసే దాకా వదిలి పెట్టే ప్రసక్తే లేదని రాజ్యలక్ష్మి మనసులో అనుకుంటుంది. తులసి దివ్యకి ఫోన్ చేసి లాస్య మా అత్తతో కలిసి కొత్త ప్లాన్ వేసిందని చెప్తుంది. అక్కడ ఆశ్రయం కోల్పోయిన లాస్య మా అత్త సపోర్ట్ తో ఇక్కడ చేరాలని చూస్తుందని అంటుంది. అదే జరిగితే నీ జీవితం రిస్క్ లో పడుతుందని తులసి జాగ్రత్త చెప్తుంది. విక్రమ్ వద్దని చెప్పాడని అంటుంది.
Also Read: తప్పు తెలుసుకుని రిషి కాళ్ళ మీద పడిన కేడీ బ్యాచ్- కాలేజ్ లో మహేంద్రని చూసి దాక్కున్న వసు
ఈ విషయం మీ అత్తకి అసలు మింగుడు పడదు. ఏదో ఒక విధంగా సాధిస్తుందని తులసి హెచ్చరిస్తుంది. తులసి విషయం చెప్పేసరికి నందు ఆగ్రహంతో ఊగిపోతాడు. లాస్య జరిగింది తలుచుకుని రగిలిపోతుంది. అప్పుడే నందు ఆవేశంగా తన దగ్గరకి వస్తాడు. కూర్చో కలిసి డ్రింక్ చేసి చాలా కాలం అయిపోయిందని అంటుంది. మాజీ పెళ్ళాం ట్రాప్ లో పడి నన్ను మోసం చేశావని అంటుంది. నందు ఆవేశంగా లాస్య గొంతు పట్టుకుని నా కూతురి జోలికి వెళ్లొద్దని చెప్తే మళ్ళీ అదే తప్పు చేస్తున్నావ్. నిన్ను పైకి పంపాలని డిసైడ్ అయ్యి వచ్చానని తోసేస్తాడు. నాకూతురి జోలికి వెళ్లకు.. ఇంకోసారి ఇదే తప్పు జరిగితే నిన్ను నిజంగానే చంపి జైలుకి వెళ్తాను. నాకు నా కూతురి జీవితం ముఖ్యమని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు ఒక లెక్క లాస్య నిన్ను నిద్రపోనివ్వదు అనుకుని ఎవరికో ఫోన్ చేసి నందు ఇంటికి వెంటనే వెళ్ళమని చెప్తుంది. దివ్య తన మావయ్యని గదిలో నుంచి కిందకి తీసుకొస్తుంది. అది చూసి రాజ్యలక్ష్మి కోపంగా ఎందుకు తీసుకొచ్చావని అరుస్తుంది.