మురారీ కృష్ణ బ్యాగ్ కోసం వెతుకుతూ ఉంటాడు. డైరీ తన బ్యాగ్ లోనే పెట్టుకుని ఉటుందని మొత్తం వెతుకుతాడు. బ్యాగ్ లో కృష్ణ తన అమ్మానాన్న ఫోటోలు పెట్టుకుని ఉండటం చూస్తాడు. బంగారు బొమ్మ అగ్రిమెంట్ తో నా జీవితంలోకి వచ్చింది. అగ్రిమెంట్ అయిపోతే వెళ్లిపోతానని అంటుంది. కానీ తను వెళ్లిపోకూడదు. తను వెళ్తే నేను బతకలేను. ఎప్పటికీ తను నాకు కావాలి ఆశీర్వదించమని అడుగుతాడు. ఎంత వెతికినా కూడా డైరీ కనిపించకపోయేసరికి మరి డాన్ని ఏవరు తీసి ఉంటారని ఆలోచిస్తాడు. ఒకవేళ ముకుంద తీసి ఉంటే వామ్మో దాన్ని చదివితే.. చదివితే చదవనివ్వు కృష్ణని ప్రేమిస్తున్నానని తెలుస్తుంది. మమ్మల్ని విడదీయాలని ట్రై చేస్తుంది. అలా జరగకూడదని రేవతికి ఫోన్ చేస్తాడు. కోడలు ఎక్కడ ఉందని అడుగుతుంది. పక్కన లేదని చెప్పేసరికి తిట్టేసి వెంటనే కృష్ణకి ఫోన్ చేస్తాను నువ్వు పక్కన లేకపోతే అప్పుడు చెప్తా నీ సంగతని అంటుంది. వెంటనే కృష్ణ దగ్గరకి వెళతాడు. అప్పుడే రేవతి ఫోన్ చేసి మురారీ పక్కనే ఉన్నాడా? అని అడుగుతుంది.


Also Read: తప్పు తెలుసుకుని రిషి కాళ్ళ మీద పడిన కేడీ బ్యాచ్- కాలేజ్ లో మహేంద్రని చూసి దాక్కున్న వసు


ఇద్దరూ కలిసి ఫామ్ హౌస్ లో తిరుగుతూ సరదాగా మాట్లాడుకుంటారు. మురారీ తన మనసులో మాట చెప్పాలనుకుంటాడు. అప్పుడే రాజ్ నర్స్ వచ్చేసరికి గొప్ప అవకాశం మిస్ అయ్యిందని ఫీల్అవుతాడు. ముకుంద ఎందుకు చెప్పొద్దని అంటుంది. తోడి కోడలు అంటే పడదా ఏంటని రాజ్ నరస అనుకుంటుంది. కృష్ణ నడుస్తూ ఎదురుగా కట్టెల పొయ్యి చూసి దాని మీద వంట చేసుకుందామని చెప్తుంది. ముకుంద వచ్చి వాళ్ళు ఎందుకు వచ్చారని అడుగుతుంది. కిచెన్ లో కత్తి కనిపించలేదని చెప్తుంది. ఇద్దరూ కలిసి వంట చేసుకుని దగ్గర అవుదామని అనుకుంటున్నావా మురారీ చాలా పెద్ద తప్పు చేస్తున్నావని మనసులో అనుకుంటుంది. కిచెన్ సెటప్ మొత్తం కృష్ణ బయటకి తెచ్చేస్తుంది. వంట చేయాలి కట్టెలు కొట్టమని అడుగుతుంది. పల్లెటూరిలో వండుకున్నట్టు పొయ్యి మీద వంట మొదలు పెడుతుంది. వాళ్ళని దూరం నుంచి ముకుంద చూస్తూనే ఉంటుంది.


Also Read: రాహుల్ చెంప పగలగొట్టిన రుద్రాణి- పెళ్ళాం కొంగు చాటున దాక్కున్న రాజ్, నవ్వులే నవ్వులు


మురారీ కట్టెలు కొట్టి అలిసిపోయాడని కృష్ణ తన చీర కొంగుతో చెమట తుడుస్తుంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ ప్రేమ టాపిక్ దగ్గరకి వస్తారు. అబ్బాయిలకు అందరి కంటే అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టమని అంటాడు. కానీ నాకు అమ్మ ఎంత ఇష్టమో నువ్వు అంతే ఇష్టం కృష్ణ. ఒకరకంగా చెప్పాలంటే అమ్మ కంటే నువ్వే ఎక్కువ ఇష్టమని మనసులో అనుకుంటాడు. మరి అమ్మాయిలు ఎక్కువగా ఎవరిని ఇష్టపడుతారో తెలుసా అని కృష్ణ అడిగితే తెలుసు నాన్న అని చెప్తాడు. కానీ నాకు అమ్మ, నాన్న అయినా మీరే మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతున్నానని మనసులో అనుకుంటుంది. మురారీ తన ప్రేమ విషయం చెప్పడం కోసం ఉల్లిపాయలు కట్ చేసి హార్ట్ సింబల్ లో వాటిని పెడతాడు. డైరెక్ట్ గా ప్రేమ విషయం చెప్పలేకపోతున్నా అందుకే ఇలా అనుకుంటాడు.