ఏంజెల్ కాలు నొప్పిగా ఉండటంతో రిషి తనే చపాతీలు చేస్తానని చెప్తాడు. వసుతో కలిసి చపాతీలు చేసినది గుర్తు చేసుకుని మూడ్ మారిపోతుంది. అది చూసి ఫ్లాష్ బ్యాక్ లో నీకేమైన లవ్ స్టోరీ ఉందా? ఏవో జ్ఞాపకాలు నిన్ను వెంటాడుతున్నాయి కదా. అవి తీపి జ్ఞాపకాలో చేదు జ్ఞాపకాలో త్వరలోనే గెస్ చేస్తానని చెప్తుంది. వసు ఏంజెల్ కి కాల్ చేస్తుంది. తన చేతులకి పిండి ఉందని రిషిని కాల్ లిఫ్ట్ చేయమని చెప్తుంది. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుంది. వసు గొంతు విని రిషి షాక్ అవుతాడు. ఫ్రీగా ఉంటే ఇంటికి రావొచ్చు కదా చపాతీలు చేసుకుంటున్నామని రిషి హెల్ప్ చేస్తున్నాడని చెప్తుంది. నాతో చపాతీలు చేసినట్టు రిషి ఏంజెల్ తో కూడా అని డౌట్ పడి మళ్ళీ ఆలోచించకూడదని వసు అనుకుంటుంది. కాసేపు ఇద్దరూ చపాతీల గోల పెడతారు.


మహేంద్ర హడావుడిగా బయల్దేరుతుంటే ధరణి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది. ముఖ్యమైన పని మీద వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తున్నాడో కనుక్కోమని జగతి చెప్తుంది. నేను అడిగినా చినమావయ్య చెప్పారని అంటుంది. జగతి వెంటనే మాట్లాడకపోయినా పర్వాలేదు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పమని మెసేజ్ చేస్తుంది. వెంటనే ధరణికి ఫోన్ చేసి జగతిని తిడతాడు. ఇప్పుడు పెడుతున్న బాధ సరిపోవడం లేదా ఇంకా బాధపెట్టాలా? నేను ఏ పని మీద వెళ్తున్నానో చెప్పకపోతేనే ఇంత బాధ పడుతున్నావ్ మరి నువ్వు నా కొడుకుని దూరం చేశావు. అసలు ఏం జరిగిందో తెలియక నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా? ఇక ఎప్పుడూ మెసేజ్ చేయకని కోపంగా అరుస్తాడు. ధరణి, జగతి ఆ మాటలకు బాధపడతారు.


Also Read: రాహుల్ చెంప పగలగొట్టిన రుద్రాణి- పెళ్ళాం కొంగు చాటున దాక్కున్న రాజ్, నవ్వులే నవ్వులు


మహేంద్ర వసుధార పని చేసే విష్ కాలేజీకి వస్తాడు. ధరణి చెప్పినట్టు రిషి ఎక్కడున్నాడో వసుకి మాత్రమే తెలుస్తుంది. తనని కలిసి ఖచ్చితంగా నిజం తెలుసుకోవాలని అనుకుంటాడు. అప్పుడే వసు కాలేజ్ కి వచ్చి మహేంద్రని చూసి కనబడకుండా దాక్కుంటుంది. ఖచ్చితంగా రిషి సర్ ఎక్కడ ఉన్నారని అడుగుతారు. నేను అబద్ధం చెప్పినా నమ్మరు. అటు రిషి సర్ మళ్ళీ మా ఇద్దరినీ చూస్తే కోపగించుకుంటారని అనుకుంటుంది. వెంటనే కాలేజ్ ప్యూన్ ని పిలిచి మహేంద్రని పంపించేందుకు ఏదో చెప్తుంది. తను వచ్చి మహేంద్రని పలకరిస్తాడు. వసుధార మేడమ్ కాలేజ్ కి లీవ్ పెట్టారని చెప్తాడు. ఇంటి అడ్రస్ చెప్పమని మహేంద్ర అడిగితే మేడమ్ ఊరులో లేరని అబద్ధం చెప్తాడు. దీంతో మహేంద్ర వెళ్లబోతుంటే సరిగ్గా అదే టైమ్ కి కారులో రిషి ఎంట్రీ ఇస్తాడు. ఇద్దరి కార్లు ఎదురుపడతాయి. రిషి మహేంద్రని చూసి మొహం కనిపించకుండా పక్కకి తిప్పుకుంటాడు. డాడ్ మళ్ళీ ఎందుకు వచ్చారు, వసుధార చెప్పిందా అనుకుని ఆవేశంగా తన దగ్గరకి వెళ్లబోతాడు.


Also Read: క్షేమంగా ఇంటికొచ్చిన ఖుషి- నీలాంబరి వార్నింగ్ కి వణికిపోయిన అభి, ఖైలాష్


అప్పుడే వసు నుంచి వాయిస్ మెసేజ్ వస్తుంది. మహేంద్ర సార్ వచ్చారు నేనేమీ కలవలేదు కాలేజ్ లో లేనని అబద్ధం చెప్పించాను అది మీకోసమేనని చెప్తుంది. అటెండర్ పరుగున వచ్చి కేడీ బ్యాచ్ గురించి చెప్తాడు. కేడీ బ్యాచ్ మోకాళ్ళ మీద నిలబడి రిషితో పాటు అందరికీ సోరి చెప్తారు. ఎంజాయ్ మెంట్ పేరుతో అందరినీ వేధింపులకి గురి చేశాము. కానీ రిషి సర్ చెప్పడం వల్ల రియాలైజ్ అయ్యాము. ఇక నుంచి బుద్ధిగా ఉంటాం, బాగా చదువుకుని మీరు చెప్పినట్టే వింటామని రిషి కాళ్ళ మీద పడతారు. వాళ్ళనిపైకి లేపి మాకు కావలసింది మీలో మార్పు అని మంచి మాటలు చెప్తాడు. మీరు మారిపోయినందుకు సంతోషంగా ఉందని అంటాడు. మిగతా లెక్చరర్స్ కూడా రిషిని మెచ్చుకుంటారు. మహేంద్ర కారు రోడ్డు మీద ఆగిపోతుంది. అప్పుడే చక్రపాణి కనిపిస్తాడు. ఈయన ఊర్లో ఉంటే వసుధార ఊరు వెళ్ళిందని ఎందుకు చెప్పారని ఆలోచనలో పడతాడు.