Krishnamma kalipindi iddarini June 24th: ఆదిత్య వచ్చి తన తల్లితో ఒక మాట చెప్పాలి అనగా.. అప్పుడే సునంద ఆదిత్యతో నీతో కూడా మాట్లాడాలి అని అంటుంది. దాంతో ఆదిత్య తన తల్లి మూడు నెలల తర్వాత మాట్లాడతాను అనడంతో సంతోషపడతాడు. వెంటనే సునంద నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అనడంతో.. ఆదిత్య కాదు అమ్మ నువ్వే చెప్పాలి అని అంటాడు.


ఇక సునంద విషయంలోకి వెళుతుంది. అన్నయ్య, గౌరీ పెళ్లి కావాలి అంటే నువ్వు అఖిలను పెళ్లి చేసుకోవాలి అని అంటుంది. దాంతో ఆదిత్య షాక్ అవుతాడు. ఇది గౌరీ తల్లి దుర్గ భవాని నిర్ణయం అని.. నీతో అఖిల పెళ్లి జరుగుతేనే గౌరీ, ఈశ్వర్ లో పెళ్లి జరుగుతుందని కండిషన్ పెట్టిందని చెబుతుంది. లేదంటే గౌరిని ఇచ్చేది లేదు అని అన్నది.


అన్నయ్య కోసం ఈ విషయంలో నిన్ను ఒప్పించాల్సి వస్తుంది అని.. లేదంటే అన్నయ్య గౌరీ లేకుంటే తట్టుకోలేడు అని.. గతంలో డాక్టర్ ఈశ్వర్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పిన విషయాన్ని చెబుతుంది. ఎలాగైనా ఈ పెళ్లికి ఒప్పుకో అని అంటుంది. దాంతో ఆదిత్య అన్నయ్య సంతోష కోసం ఏమైనా చేస్తాను అని అనటంతో సునంద సంతోషపడుతుంది.


కానీ ప్రేమించిన అమ్మాయిని వదిలేసుకుంటున్నందుకు చాలా బాధపడుతూ ఉంటాడు ఆదిత్య. నా వల్ల అన్నయ్య కళ్ళు పోయినందుకు పెళ్లి విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాడని.. కాబట్టి ఆయన పెళ్లి జరగాలి అంటే నేను అఖిలను పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అవుతాడు. అమృతను వదులుకుంటున్నందుకు చాలా బాధపడతాడు.


మరోవైపు కేక్ కటింగ్ చేస్తుంటారు. అందరికీ కేక్ తినిపించిన తర్వాత సునంద గౌరీ, ఈశ్వర్ ల పెళ్లి గురించి చెబుతుంది. ఇక ఆదిత్య పక్కన ఉన్న అమృత మన విషయం కూడా ఇప్పుడే చెప్పు అనటంతో ఆదిత్య ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అప్పుడే సునంద అఖిల, ఆదిత్య ల పెళ్లి గురించి అనౌన్స్ చేయడంతో అందరూ సంతోషపడగా.. అమృత షాక్ అవుతుంది.


ఇక సౌదామిని వాళ్లు కూడా కోపంతో రగిలిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దుర్గ భవాని సంతోషంగా కనిపిస్తుంది. ఇక పార్టీ ముగిసిన తర్వాత ఆదిత్య అమృతను తలుచుకొని బాధపడుతూ ఉండగా అక్కడికి ఈశ్వర్ వచ్చి ఎందుకు అమ్మకి నీ ప్రేమ విషయం చెప్పలేదు అని అంటాడు. దాంతో ఆదిత్య తన అన్నయ్యకి నిజం చెప్పడం ఇష్టం లేక నేను ప్రేమించింది అఖిలనే అని చెబుతాడు. ఇక ఈశ్వర్ ఆశ్చర్యపోతాడు.


Also Read: Madhuranagarilo June 23th: అల్లుడి విషయంలో ఫైరవుతున్న అపర్ణ - రాధ, శ్యామ్ మేడలో పూలదండ వేసిన గన్నవరం గ్యాంగ్?