Madhuranagarilo June 23th: శ్యామ్.. పూలు అమ్మే ఆవిడ పేరు చెబుతూ మల్లె పూలు ఇస్తుండగా అక్కడ పెట్టు అని అంటుంది రాధ. అక్కడ ఇక్కడ ఎందుకు తలలో పెట్టు అని పండు అనడంతో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటాడు శ్యామ్. కానీ తనకు మాత్రం అభ్యంతరం ఉందని రాధ అనటంతో.. సరే డాడీ అంటాడు పండు.


ఆ పిలుపు విని షాక్ అవుతుంది రాధ. ఎందుకలా పిలుస్తున్నావు అని కోపంతో అనడంతో పిలిస్తే తప్పేముంది అని అంటాడు పండు. ఇక శ్యామ్ బాధపడుతూ తను వాళ్ళ పిలవడానికి కారణం చెబుతాడు. ఇక రాధ మళ్లీ అలా పిలవద్దు అని పండుకు చెబుతుంది. శ్యామ్ అక్కడి నుంచి వెళ్ళిపోగా.. మరి డాడీ అని ఎవరిని పిలవాలని బాధపడుతూ అడగటంతో రాధ బాధపడుతూ నేను చూపించే వరకు ఆగమని అంటుంది.


ఇక పండు అక్కడి నుంచి వెళ్ళిపోగా రాధ బాధ బాధపడుతుంది. మధుర ఇంటికి అపర్ణ ఆవేశంగా వచ్చి శ్యామ్ ను పండు డాడీ అని పిలుస్తున్నాడు అని చెప్పటంతో మధుర దంపతులు షాక్ అవుతారు. అప్పుడే శ్యామ్ రావటంతో కావాలంటే శ్యామ్ ను అడగండి అని అంటుంది. ఇక శ్యామ్ అవును అని.. ఇక పండు అలా పిలవడానికి ఒక కారణం ఉందని జరిగిన విషయం చెబుతాడు.


దాంతో మధుర వాళ్ళు బాధపడతారు. ఆ విషయాన్ని వదిలేయండి మరి సంయుక్త మీద ఎలా చెయ్యి ఎత్తుతాడు అని అనటంతో మధుర షాక్ అవుతుంది. వెంటనే శ్యామ్.. మరి సంయుక్త పండు మీద చెయ్యి ఎత్తిన విషయం చెప్పలేదా అంటే డాడీ అన్నందుకు కోపంతో అలా చేసింది అని అంటుంది అపర్ణ. ఇక మధుర నువ్వెందుకు చెయ్యి ఎత్తావు అని శ్యామ్ అనటంతో.. అనరాని మాట అన్నదని.. ఆ మాట వింటే మీరు ఏకంగా చేయి చేసుకుంటారు అని అంటాడు.


ఇక మధుర అవన్నీ సర్దుకునేలా చేస్తుంది. ఇక ఉదయాన్నే గన్నవరం గ్యాంగ్ మధుర ఇంటికి పార్టీ కోసం వస్తారు. అదే సమయంలో సంయుక్త వాళ్ళు కూడా వస్తారు. శ్యామ్ కూడా కిందికి వస్తాడు. అప్పుడే గెస్ట్ లందరూ రావటంతో అందరినీ పలకరిస్తూ ఉంటారు. శ్యామ్ మాత్రం రాధ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఎవరికోసం అని సంయుక్త అంటుంది.


తన ఫ్రెండ్ కోసం అని చెప్పటంతో అప్పుడే తన ఫ్రెండ్ వస్తాడు. ఇక ఫ్రెండ్ వచ్చిన తర్వాత కూడా అలాగే ఎదురు చూస్తూ ఉండటంతో.. పండు కోసం చూస్తున్నాను అని అంటాడు శ్యామ్. ఇక రాధ వాళ్లు ఇంకా రాలేదని మధుర అడగటంతో అదే ఎదురుచూస్తున్నాను మమ్మీ అంటాడు శ్యామ్. దాంతో అపర్ణ, సంయుక్త లకు బాగా కోపం వస్తుంది.


వెంటనే వెళ్లి తీసుకొస్తాను అని మధుర రాధ ఇంటికి వెళుతుంది. ఇక పండు పార్టీ కోసం రెడీ అవ్వగా రాధ పార్టీకి కాదని తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని చెబుతుంది. అప్పుడే మధుర వచ్చి ఆ మాట విని షాప్ లో జరిగిన దాని గురించి బాధపడి రావట్లేదని అర్థం అవుతుంది అని చెప్పి బ్రతిమాలుతుంది. నేను నిన్ను ఏమైనా అంటే నువ్వు బాధపడాలి కానీ ఎవరో వాళ్ల కోసం నువ్వు ఎందుకు బాధపడతావు అని పార్టీకి ఒప్పిస్తుంది.


తరువాయి భాగంలో గన్నవరం గ్యాంగ్ పెద్ద పూలదండ తీసుకొని రాగా అది శ్యామ్, సంయుక్త మెడలో వేస్తుండగా ఆ సమయంలో సంయుక్త జారి కింద పడుతుండగా రాధ పట్టుకోవడానికి ప్రయత్నించటంతో వెంటనే ఆ దండ రాధ, శ్యామ్ మెడలో పడుతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. కాని శ్యామ్ సంతోషంగా ఫీల్ అవుతాడు. అదే సమయంలో ఒక ఆవిడ వచ్చి సూపర్ జోడి అని అంటుంది.


Also Read: Prema Entha Madhuram June 22th: మాన్సీ పని అవుట్, అను ఇంటికి వెళ్లి షాకైన ఆర్య?