వేద అభి వాళ్ళ కారుని ఛేజ్ చేస్తుంది. కిడ్నాప్ చేసిన ప్లేస్ లో వాచ్ పడిపోయి ఉండటం యష్ చూస్తాడు. ఇది ఎవరిది అని ఆలోచిస్తూ ఉండగా చిత్ర దాన్ని తీసుకుని ఇది అభిమన్యుది, వాడి ఫేవరెట్ వాచ్ అని చెప్తుంది. దీంతో యష్ ఆవేశంగా బయల్దేరతాడు. కారులో ఖైలాష్, అభి వాళ్ళు ఖుషిని కిడ్నాప్ చేసినందుకు సంతోషపడతారు. చిత్రని పెళ్లి చేసుకుని హాయిగా ఉందామనుకుంటే నా జీవితాన్ని నాశనం చేస్తారా? నాది అదృష్టమో దురదృష్టమో తేల్చుకోలేని ఆడదాన్ని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తారా? ఇప్పుడు వాడి కూతురు ఎక్కడ ఉందో తెలియక పిచ్చివాడిలా తిరగాలని అనుకుంటారు. అసలు ఎవరు వాళ్ళు ఖుషిని ఎందుకు కిడ్నాప్ చేశారని వేద ఆలోచిస్తూ ఉంటుంది. యష్ ఆవేశంగా ఇంటికి వచ్చి గన్ తీసుకుని బయల్దేరతాడు. ఖుషిని తీసుకొచ్చిన ఇంటి దగ్గరకి వేద వస్తుంది.
అభి ఖుషిని ఒక చోటుకి తీసుకొచ్చి రౌడీలకు అప్పగిస్తారు. తప్పించుకునే అవకాశం ఇవ్వొద్దని చెప్తాడు. ఏం చేయాలో చెప్పే వరకు పాపని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి వెళ్లిపోతారు. యష్ గన్ పట్టుకుని అభిమన్యు ఇంటికి వచ్చి అరుస్తాడు. గన్ తీసుకొస్తే బెదిరిపోతామా? బయటకి వెళ్ళమని అభి నీలాంబరి చెప్తుంది. నా కూతుర్ని అభిమన్యు కిడ్నాప్ చేశాడని యష్ చెప్తాడు. బర్త్ డే వేడుకల్లో నుంచి జోకర్ వేషం వేసుకుని వచ్చి నా కూతుర్ని కిడ్నాప్ చేశాడని చెప్పేసారికి నీలాంబరి షాక్ అవుతుంది. మీ కూతురు ఇక్కడ లేదని అంటుంది. మీ మాజీ భార్యని అక్కర్లేదని పంపించేశాడు ఇక మీ కూతురితో పని ఏంటని అడుగుతుంది. అటు వేద రౌడీలను డైవర్ట్ చేసి ఖుషిని కాపాడాలని ట్రై చేస్తుంది. అభి గదిలో నుంచి కిందకి రాగానే యష్ లాగిపెట్టి ఒకటి పీకుతాడు. తలకి గన్ గురి పెట్టి నా కూతుర్ని కిడ్నాప్ చేస్తావా చంపేస్తానని అంటాడు.
ALso Read: తులసి ప్లాన్ అదుర్స్- నందు, లాస్యకి విడాకులు
నీలాంబరి: చంపేస్తారా ఏది చంపండి చూద్దాం
యష్: ఇంతవరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించాను కానీ నా కూతురి విషయంలో తప్పు చేస్తే క్షమించను
అభి: అసలు ఈరోజు నేను ఇంట్లో నుంచి బయటకి రాలేదు
నీలాంబరి: అసలు నా భర్త జోకర్ గెటప్ వేసుకుని అక్కడికి వచ్చాడని అనేందుకు సాక్ష్యం ఏంటి
యష్: వాచ్ తీసి ఇది నీ భర్తదే కదా
నీలాంబరి: అవును ఇది ఆయనదే మీ దగ్గరకి ఎలా వచ్చింది
యష్: ఫంక్షన్ దగ్గర దొరికింది ఖుషిని తీసుకెళ్తున్న టైమ్ లో కిందపడింది. నా కూతురు ఎక్కడ ఉంది చెప్పు లేదంటే పుచ్చ పేలిపోతుంది
Also Read: కొడుకు, కోడల్ని హనీమూన్ కి పంపించిన రేవతి- ముకుంద ఏం చేయబోతోంది?
అభి: ఈ వాచ్ దొరికినంత మాత్రాన నేను కిడ్నాప్ చేసినట్టు కాదు. ఇది నా వాచ్ కాదు నాది లాంటిది. ఇదిగో నా వాచ్ నా దగ్గరే ఉంది చూడు. ఒక వాచ్ ని పట్టుకుని నా దగ్గరకి వచ్చి టైమ్ వెస్ట్ చేసుకునే బదులు వేరే చోట వెతికితే దొరికేదేమో
ఆ మాటలకు యష్ డైలమాలో పడతాడు. వేద ఖుషి మొహం మీద నీళ్ళు కొట్టి తనని స్పృహలోకి తీసుకొస్తుంది. తనని తీసుకుని బయటకి వెళ్ళే టైమ్ కి రౌడీలు వచ్చేస్తారు. ఒకడిని కొట్టేసి కిందకి వచ్చేసరికి అందరు రౌడీలు చుట్టుముడతారు. వాళ్ళని చితక్కొట్టి వేద ఖుషిని కాపాడుకుంటుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial