గీతిక ఇంటికి వస్తే కృష్ణ పలకరిస్తుంది. మురారీ ప్రేమించి అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు కృష్ణ ట్రై చేస్తుంది. మురారీ ఎప్పటి నుంచి తెలుసని అడుగుతుంది. ఆదర్శ్, ముకుంద పెళ్లి అయినప్పటి నుంచి తెలుసని చెప్తుంది. తను అబద్ధం చెప్తుందని అర్థమైపోతుంది అత్తయ్య వాళ్ళే కాదు ముకుంద కూడ నా దగ్గర ఏదో నిజం దాస్తుందని కృష్ణ అనుకుంటుంది. ఇక తను ముకుంద గదిలోకి వెళ్తుంది. తనకోక హెల్ఫ్ కావాలని అందుకు మీ నాన్న సపోర్ట్ కావాలని ముకుంద గీతికని అడుగుతుంది. అది ఏంటో మ్యూజిక్ వేసి వినిపించకుండా చేస్తారు. ఇంత డ్రామా అవసరమా అని గీతిక అంటే తప్పదని చెప్తుంది. కృష్ణ కలిసి మురారీ గురించి అడిగిందని గీతిక అంటుంది. అబద్ధం చెప్పానని అంటే ఈసారి కృష్ణ కనిపిస్తే మా ప్రేమ సంగతి మొత్తం చెప్పేసేయ్ తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకోవాలని ఉందని ముకుంద సలహా ఇస్తుంది.
Also Read: రాహుల్ కి వార్నింగ్, రుద్రాణికి చీవాట్లు- కావ్య మీద ప్రేమ చూపించిన రాజ్
కృష్ణ బోర్డు మీద వారసుడు, మెట్టెలు, హోమం, దిష్టి తీసింది అని రాస్తుంది. అత్తయ్య ఇవన్నీ ఎందుకు చేసిందని కృష్ణ మురారీని అడుగుతుంది. దీని గురించి ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. అవన్నీ ఎందుకు చేసిందో తనకి తెలుసని మురారీ అంటాడు. అమ్మ ఇవన్నీ ఎందుకు చేయిస్తుందంటే అని ఊరించి ఊరించి తనకి కూడా తెలియదని అనేసరికి కృష్ణ కోపంగా తనని కొడుతుంది. అప్పుడే గదిలోకి రేవతి వస్తుంది. బోర్డు మీద రాసి ఉన్నవి చూసి వీటన్నింటికి ఆన్సర్ కావాలి అంతే కదా అని అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటే దాన్ని లవ్ సింబల్ గా చేస్తుంది. నువ్వు అడిగిన వాటికి ఇదే సమాధానమని చెప్పేసరికి ఆశ్చర్యపోతుంది. నేను ఏసీపీ సర్ ని ప్రేమిస్తున్న విషయం అత్తయ్యకి చెప్పేస్తే ఎలా ఉంటుందని కృష్ణ మనసులో అనుకుంటుంది. వాళ్ళ మాటలు అలేఖ్య చాటుగా వింటుంది.
ఇద్దరినీ మెయిల్స్ చెక్ చేసుకోమని చెప్తుంది. ఇద్దరికీ వారం రోజుల పాటు లీవ్ అని మెయిల్స్ చూసుకుని ఆశ్చర్యపోతారు. రేపటి నుంచి మీ ఇద్దరినీ వన్ వీక్ వేలేస్తున్నామని చెప్తుంది.
రేవతి: ఈ ఇంటికి వారసుడు కావాలని అడుగుతుంటే సమాధానం చెప్పారా మీరు
కృష్ణ: దీనికే ఇంట్లో నుంచి గెంటేస్తారా
రేవతి: అందుకే రేపటి నుంచి వారం రోజుల పాటు ఫామ్ హౌస్ లో ఉండాలి అది మన ఆచారం. రేపే మీ ప్రయాణం సిద్ధంగా ఉండండి. కావాలని మిమ్మల్ని పంపిస్తున్నా ఏం వెళ్లారా?
మురారీ: ఇప్పుడే వెళ్లిపోతాం మమ్మీ అని ఓవర్ యాక్షన్ చేస్తాడు
Also Read: యుద్ధం మొదలుపెట్టిన ముకుంద- ప్రేమ Vs పెళ్లి ఏది గెలుస్తుంది
గీతిక తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. తనకోక హెల్ప్ కావాలని అడిగితే చేద్దామని మాట ఇస్తాడు. అలేఖ్య వాళ్ళు కృష్ణ వెకేషన్ గురించి మాట్లాడుకోవడం ముకుంద వింటుంది. మీరు చాలా తెలివిగా వాళ్ళని పంపించేస్తున్నారు కానీ నేను మురారీని దక్కించుకుంటానని అనుకుంటుంది. ఫామ్ హౌస్ అని చెప్పి మినీ హనీ మూన్ ప్లాన్ చేశారా? ఇప్పుడు నేను మీకు బదులిస్తాను. మీరు నాకు సాయం చేస్తారని చెప్పి నిజాయితీగా మా ప్రేమ సంగతి చెప్పాను కానీ మీరు ఇలా చేస్తారా అని ఆలోచనలో పడుతుంది.