కనకం వాళ్ళు వడ్డీ వ్యాపారిని కిడ్నాప్ చేసి ఇంట్లో ఒక గదిలో కట్టి పడేసి ఉంచుతారు. అప్పు ఇంటికి వస్తే కృష్ణమూర్తి స్వప్నకి పచ్చి మామిడి కాయలు ఇచ్చి రమ్మని పంపిస్తాడు. రాజ్ ఆఫీసు విషయాలు తండ్రితో మాట్లాడుతూ ఉంటాడు. రాహుల్ చూసుకుంటున్న బ్రాంచ్ గొడవ గురించి అడుగుతాడు. అంతా బాగానే ఉందని కవర్ చేస్తాడు. అప్పుడే రాహుల్ బయటకి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. ఎన్నడూ లేనిది కొత్తగా అడుగుతున్నావ్ ఏంటి ఎవరైనా అడగమన్నారా? అని ఎదురు ప్రశ్నిస్తాడు.


రాజ్: ఒకరు చెప్తే వినేరకం కాదు నేను. ఈ ఇంట్లో అందరి కంటే నిన్నే ఎక్కువగా నమ్ముతాను నేను


రాహుల్: నా పెళ్లితో విషయంలో నమ్మకం పోగొట్టుకున్నా కాబట్టి ప్రశ్నిస్తున్నావా


రాజ్: కొత్తగా నిన్ను నమ్ముకుని ఒక అమ్మాయి వచ్చింది అందుకే అన్నీ ఆలోచించి చేయమని చెప్తున్నా. ఇప్పటి వరకు పార్టీలని ఎటు వెళ్ళినా అడగలేదు. ఇప్పుడు పెళ్లి అయ్యింది కాబట్టి మారాలని అంటున్నా


సీతారామయ్య: రాజ్ చెప్పింది నిజమే నువ్వు కూడా ఆఫీసుకి వెళ్ళి పని చెయ్యి


Also Read: యుద్ధం మొదలుపెట్టిన ముకుంద- ప్రేమ Vs పెళ్లి ఏది గెలుస్తుంది


రుద్రాణి: అదేంటి నా కొడుకు బలాదూర్ తిరిగినట్టు మాట్లాడుతున్నారు ఆఫీసు చూసుకున్నాడు కదా


అపర్ణ: ఎంత బాగా చూసుకున్నాడో అందరికీ తెలుసు కదా


రుద్రాణి: కళ్యాణ్ కంటే బాగానే చూసుకుంటున్నాడు


ధాన్యలక్ష్మి: ఎప్పుడు చూసినా నా కొడుకు మీద పడతారు ఏంటి తను అమాయకుడు ఇంకోసారి వాడిని అంటే ఒప్పుకునేది లేదు


రాజ్: ఆఫీసు అలవాటు అయ్యే వరకు నాతో కలిసి నా బ్రాంచ్ లో పని చెయ్యి ఏ డెసిషన్ తీసుకున్నా నాకు చెప్పి చెయ్యి


స్వప్న: ఇదేంటి మొత్తం పనులు చూసుకుంటున్నాడని రాహుల్ నాతో చెప్పాడు ఇప్పుడేంటి రాజ్ ఇలా మాట్లాడుతున్నాడు


రాహుల్ గురించి నిజం చెప్పకుండా వచ్చేసినందుకు రాజ్ ని కావ్య నిలదీస్తుంది. అన్ని మాటలు పడతారు ఎందుకు ఆఫీసు డబ్బులు వాడుకున్నాడని చెప్పొచ్చు కదా. అయినా రాహుల్ ఇలా మారడానికి కారణం మీరేనని కావ్య అంటుంది. కానీ రాజ్ మాత్రం రాహుల్ ని వెనకేసుకుని వస్తాడు. అప్పు దుగ్గిరాల ఇంటికి వస్తుంది. తనని చూసి రుద్రాణి నీచంగా మాట్లాడుతుంది. అప్పు గట్టిగానే బదులిస్తుంది. దీంతో రుద్రాణి తనని కొట్టబోతుంటే ఇంద్రాదేవి ఆపుతుంది. ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇలాగేనా ప్రవర్తించేదని అంటుంది.


ఇంద్రాదేవి: కావ్య ఈ ఇంటి కోడలు స్వప్న నీ కోడలు. ఇంటికి వస్తే ఇలాగేనా మాట్లాడేది


రుద్రాణి: నీ కోడలు కూడా ఒకప్పుడు నన్ను ఇలాగే మాట్లాడింది


అపర్ణ: నేను అన్న మాటల్లో నిజం ఉంది. అయినా దుగ్గిరాల ఇంటికి ఒక సంప్రదాయం ఉంది. శత్రువు ఇంటికి వచ్చినా మర్యాదగా మాట్లాడతాం


స్వప్న: అప్పు నీ రౌడీ వేషాలు నీ ఇంట్లో పెట్టుకో ఇక్కడ కాదు మా అత్తని ఇంకోసారి అంటే ఊరుకునేది లేదు


కావ్య రుద్రాణిని తిడుతుంటే స్వప్న జోక్యం చేసుకుంటుంది. ఆవిడ మా అత్త తనతో ఇలాగేనా బిహేవ్ చేసేదని స్వప్న ఎదురు మాట్లాడుతుంది. అది చిన్నప్పుడు నుంచి మగరాయుడులాగా పెరిగింది మనల్ని కాపాడుకుంటూ వచ్చిందని కావ్య అంటుంది. నువ్వు ఇలా రౌడీలా మాట్లాడితే ఇంకోసారి సెక్యూరిటీతో చెప్పి రానివ్వకుండా చేస్తానని స్వప్న వార్నింగ్ ఇస్తుంది. నాన్న దీని మీద ఇష్టంతో పుల్లటి మామిడి కాయలు పంపించారని అప్పు చెప్తుంది.


Also Read: వడ్డీ వ్యాపారిని కిడ్నాప్ చేసిన కనకం -స్వప్న కడుపు డ్రామా రుద్రాణి కనిపెట్టేస్తుందా?


స్వప్న: ఛీ ఛీ అవి నేనెందుకు తింటాను


ధాన్యలక్ష్మి: అదేంటి అలా మాట్లాడుతున్నావ్ కడుపుతో ఉన్నవాళ్ళకి పుల్లగా తినాలని అనిపిస్తుంది కదా


ఇంద్రాదేవి: ఇది నీకు వేవిళ్ళ సమయం కదా వాంతులు కూడా అవుతున్నట్టు లేవు ఏమైనా ఉంటే చెప్పు వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరకి తీసుకుని వెళ్తాను


స్వప్న: అదేమీ లేదు నాకు 3, 4 సార్లు వాంతులు అవుతున్నాయని మామిడి కాయలు తీసుకుని తిన్నట్టు నటించి బాగున్నాయని అంటుంది.