స్వప్న తలపొగరుగా బిహేవ్ చేస్తుంది. బ్రేక్ ఫాస్ట్ కి తనని ఎందుకు పిలవలేదని స్వప్న కావ్య మీద అరుస్తుంది. ఈ ఇంట్లో టిఫిన్ చేయడానికి ఎవరూ పిలవరని అపర్ణ గడ్డి పెడుతుంది. టిఫిన్ ఇడ్లీగా పెడుతుంటే ఇంత కేలరీస్ తింటే లావు అయిపోతారని స్వప్న అంటుంది. ఈ టిఫిన్ తింటే తన ఫిజిక్ పాడైపోతుందని చెప్పి బ్రెడ్ టోస్ట్ గదికి తీసుకురమ్మని కావ్యకి చెప్పేసి వెళ్ళిపోతుంది. అత్తకి తగ్గ కోడలు దొరికిందని ధాన్యలక్ష్మి దెప్పి పొడుస్తుంది. అనుకున్న దాని ప్రకారం మీనాక్షి వడ్డీ వ్యాపారిని తీసుకొస్తుంది. కనకం చీపురు పట్టుకుని వచ్చేసరికి మీనాక్షి ఆశ్చర్యంగా డబ్బు కడతానని చెప్పి ఇలా వచ్చావ్ ఏంటని అంటుంది. డబ్బు వచ్చిందని విన్నాను కడితే ఇంటి పత్రాలు ఇచ్చేసి వెళ్లిపోతానని వడ్డీ వ్యాపారి అంటాడు. ఒక ఐదారు నెలలు తర్వాత కడతానని కనకం అనేసరికి షాక్ అవుతాడు.
Also Read: మాళవికని పంపించేయాలని డిసైడ్ అయిన యష్ - ఖుషిని కిడ్నాప్ చేసిన అభిమన్యు, వేద కాపాడుకుంటుందా?
పిల్ల పెళ్లి చేసి కాస్త ఇబ్బందుల్లో ఉన్నాను కొంచెం టైమ్ ఇస్తే కట్టేస్తానని బతిమలాడుతుంది. డబ్బు కట్టేస్తే కట్టండి లేదంటే మిమ్మల్ని గెంటేసి ఇంట్లో ఉంటానని అంటాడు. ఇప్పటికిప్పుడు డబ్బులు కడితే ఇంట్లో ఉంచుతా లేదంటే మీ ఆయనకి చెప్పేస్తానని ఖరాఖండీగా చెప్తాడు. దీంతో కనకం రోకలితో వాడి నెత్తి మీద కొట్టేస్తుంది. బాబోయ్ అని మీనాక్షి అరుస్తూ పరుగులు పెట్టేస్తుంది. కనకం వ్యాపారిని కిడ్నాప్ చేసి గదిలో తాళ్ళు పెట్టి కట్టేస్తుంది. తను కోరుకున్న లైఫ్ దొరికిందని స్వప్న తెగ సంబరపడిపోతుంది. పని మనిషి మొక్కలకు నీళ్ళు పోస్తూ పొరపాటున స్వప్న మీద పడతాయి. దీంతో తన మీద అరుస్తుంది. అదంతా రాజ్ చూస్తూనే ఉంటాడు. కావ్య వచ్చి వాళ్ళు చేసిన పనికి మర్యాద ఇవ్వడం నేర్చుకోమని సలహా ఇస్తుంది. కానీ స్వప్న మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడి కావ్య మీద అరిచేసి వెళ్ళిపోతుంది. దీంతో కావ్య ఆమెకి సోరి చెప్తుంది.
Also Read: మాజీ పెళ్ళాం కోసం తాజా పెళ్ళాంతో రాజీ- లాస్యతో వేరు కాపురానికి వెళ్తున్న నందు
రాజ్ కోపంగా వెళ్ళిపోవడం చూసి కావ్య మళ్ళీ టెన్షన్ పడుతుంది. అక్కకి కడుపు లేదని నిజం తెలిసిందా ఏంటి? తెలియకపోతే తనే నిజం చెప్పాలని డిసైడ్ అవుతుంది. భయం భయంగా రాజ్ దగ్గరకి వెళ్తుంది. మీకోక విషయం చెప్పాలి అది చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారోనని ఆలోచిస్తున్నానని అంటుంది. అంత ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు ఇందాకే తెలిసిందని చెప్పే సరికి కంగారుపడుతుంది. మీ అక్క ఇప్పుడు ఇలాగే ఉందా లేదంటే చిన్నప్పటి నుంచి ఇలాగే ఉందా అని అడుగుతాడు. అమ్మ గారాబం చేసి పెంచుతుంది అందుకే అలా మాట్లాడిందని చెప్తుంది. అంటే తన ప్రవర్తన ఇష్టాలు పూర్తిగా వేరు అన్నీ అబద్ధాలు చెప్పిందని రాజ్ సీరియస్ అవుతాడు. ప్రస్తుతానికి నిజం బయట పడలేదని కావ్య టెన్షన్ పడుతుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial