యష్ వేదకి ఉంగరం తొడగడం, ఖుషికి ముద్దు పెట్టడం తలుచుకుని మాళవిక రగిలిపోతుంది. నా కూతుర్ని ఎంత మాయ చేయకపోతే తన గురించి అంత గొప్పగా పొగుడుతుంది. ఇక నా కూతురు నా మాట ఏం వింటుంది. ఖుషితో పాటు అందరినీ మాయ చేసేసింది. ఏదో ఒకటి చేయాలి లేదంటే ఈ ఇంట్లో నేను అనుకున్నది ఏది జరగదని అనుకుంటుంది. మాళవిక ఒంటరిగా కూర్చుంటే వేద చూసి ఫంక్షన్ లోకి రమ్మని పిలుస్తుంది. రాకుండా ఉండేసరికి వేదనే తన చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తుంది. అది చూసి అమ్మలక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటారు. వదిలేసిన భార్యని తీసుకొచ్చి మాళవికని ఎలా తెచ్చిపెట్టుకున్నారో ఏంటో? అంటే ఇప్పుడు యశోధర్ మాళవికని మళ్ళీ ఏలుకుంటాడా? వదిలేసిన మొగుడి దగ్గరకి వచ్చిందంటే ఏదో ఒక సంబంధం పెట్టుకోకుండా ఉంటుందా ఏంటి? అయినా ఇద్దరు సవతులు ఒకే ఇంట్లో ఉంటున్నారంటే వేదకి గడ్డు కాలమే. వేదని చూసి అయ్యో పాపం అనుకోవడం తప్ప ఏమి చేయలేమని మాట్లాడుకుంటారు. అవన్నీ యష్ వింటాడు.


ఈ మాళవికని ఇంటికి రానివ్వడం వల్ల వినకూడని మాటలు వినాల్సి వస్తుందని చిరాకు పడతాడు. వీళ్ళే ఇలా మాట్లాడుతున్నారంటే మిగిలిన వాళ్ళు ఇంక ఎంత అసభ్యంగా మాట్లాడుకుంటున్నారో. తప్పు నాది వేద మాటకి ఆరోజే అడ్డు చెప్పినట్టు అయితే ఇలా జరిగేది కాదు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఎలాగోకలా మాళవికని బయటకి పంపించాలని యష్ డిసైడ్ అవుతాడు. వసంత్ దగ్గరకి వచ్చి మాళవిక గురించి మాట్లాడతాడు.


Also Read: మాజీ పెళ్ళాం కోసం తాజా పెళ్ళాంతో రాజీ- లాస్యతో వేరు కాపురానికి వెళ్తున్న నందు


యష్: తను ఏ పరిస్థితిలో ఇంట్లో నుంచి వెళ్లిపోయిందో నీకు తెలుసు కదా అందులో నా తప్పు ఇంట్లో వాళ్ళది లేదు. తన తప్పు తను తెలుసుకోవడం మనకి ముప్పుగా మారుతుంది.


చిత్ర: ఇప్పుడు ఏమైంది బావ


యష్: వదిలేసి వెళ్ళిపోయిన భార్యని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడని చాలా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు నేను పడిన బాధలు మళ్ళీ పడటానికి సిద్ధంగా లేను


వసంత్: అసలు మీ ఇంట్లో తనని ఎలా రానిచ్చారా అనిపించింది


యష్: తన పరిస్థితి చూసి వేద రానిచ్చింది. కానీ చేసిన సాయం సమస్యలు తీసుకురాకూడదు కదా. జాలితో ఇంట్లో చోటు ఇచ్చాడని ఎవరూ అనుకోరు. రెండో భార్య ఉండగా మొదటి భార్యని తెచ్చుకున్నాడు. రెండో భార్యతో కలిసి ఉంటాడా లేదా అని అంటున్నారు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను మాళవికని తీసుకెళ్ళి మీ ఇంట్లో ఉంచుకో తను మీ అక్క కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ రావు. వేద కోరుకున్నట్టు హెల్ప్ చేస్తాను. కానీ మాళవిక ఇంట్లో మాత్రం వద్దు


వసంత్: ఈ మాట చెప్పడానికి ఎంత ఇబ్బంది పడుతున్నావో అర్థం చేసుకోగలను. నేను అక్కని ఎలాగైనా తీసుకుని వెళ్తాను.


ALso Read: మురారీ డైరీ చదివిన ముకుంద- కృష్ణ ప్రేమకి విలన్ గా మారబోతుందా?


ఖుషి కేక్ కట్ చేసే టైమ్ కి వేద తనని ఒక మాట పని చేయమని అడుగుతుంది. మాళవిక అమ్మ కూడా నీకు అమ్మ కదా నువ్వు కేక్ కట్ చేశాక అందరి కంటే ముందు మాళవిక అమ్మకి తినిపించాలని వేద చెప్తుంది. నీకే తినిపిస్తానని ఖుషి అంటుంది. కానీ వేద నచ్చజెపుతుంది. ఎందుకు వేద మాళవిక మీద లేనిప్రేమ ఖుషి మనసులో కలగాలని చూస్తున్నావని యష్ అడుగుతాడు. మాళవిక ప్రేమ ఖుషికి కావాలి అలాగే ఖుషి ప్రేమని పొందే హక్కు మాళవికకి ఉందని చెప్తుంది. ఇదంతా అభి వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఖుషి కేక్ కట్ చేసి మాళవికకి తినిపించడం కోసం చెయ్యి చాచుతుంది కానీ సరిగ్గా తను తీసుకునే టైమ్ కి వేద నోట్లో పెట్టేస్తుంది. నువ్వు తప్ప నాకు ఎవరూ అమ్మలా కనిపించడం లేదు నువ్వు చెప్పింది చేయలేకపోతున్నానని ఖుషి సోరి చెప్తుంది. మాళవిక బాధగా వెళ్ళిపోతుంది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial