వేసవి ఎంతో రుచికరమైన పండ్లు అందిస్తుంది. మామిడి, పుచ్చకాయ మాత్రమే కాదు సమ్మర్ లో లభించే మరొక జ్యూసీ ఫ్రూట్ పీచెస్. జ్యూసీ ఉండటం మాత్రమే కాదు ఆరోగ్యకర ప్రయోజనాల పవర్ హౌస్ గా దీన్ని చెప్పవచ్చు. పొటాషియం, ఫాస్పరస్, ఐరన్ వంటి అనేక మినరల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కేలరీలు తక్కువ. శాచురేటెడ్ ఫ్యాట్ అసలు ఉండవు. అంతే కాదు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ గొప్ప మూలం. క్యాన్సర్ కి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుచి తొలగించడంలో పీచ్ సహాయపడుతుంది. రేగు, ఆప్రికాట్లు, చెర్రీలు, బాదంతో పాటు పీచెస్ కూడా ఒకే కుటుంబానికి చెందినవి. పీచ్ ఫ్రూట్ అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. డెజర్ట్ లో దీన్ని తప్పకుండా వినియోగిస్తారు. చూసేందుకు ఎర్రటి యాపిల్ పండులాగా కనిపిస్తుంది. పీచ్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..
జీర్ణక్రియ
ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు పీచెస్ చాలా ఉపయోగపడతాయి. ఇందులో కరిగే ఫైబర్ ఉండి. జీర్ణక్రియ సాఫీగా సాగేలా చూస్తుంది. మలబద్ధకం సమస్యని తొలగిస్తుంది. ఇదే కాదు.. జీర్ణ రుగ్మతల లక్షణాలని తగ్గించడంలో సహాయపడుతుంది. క్రోన్ స్ వ్యాధి, ఐబీఎస్, పెద్ద పేగులో మంట వంటి సమస్యల్ని తొలగిస్తుంది.
గుండెకి మేలు
గుండెకి మేలు చేసే అత్యుత్తమ పండ్లలో పీచెస్ ఒకటి. గుండెకి హాని కలిగించే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యల్ని తగ్గిస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
క్యాన్సర్ నుంచి రక్షణ
వివిధ రకాల క్యాన్సర్ల నుంచి రక్షణని అందించే మొక్కల సమ్మేళనాలు ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉండే కెరొటీనాయిడ్స్, కెఫిక్ యాసిడ్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాలను చంపేస్తాయి. వాటి పురోగతిని అడ్డుకుంటాయి.
అలర్జీలు తగ్గిస్తుంది
పీచెస్ అలర్జీ వ్యాప్తిని నివారిస్తుంది. శరీరం అలర్జీకి గురైనప్పుడు దానికి సంబంధించిన కారకాలని తొలగించడంలో సహాయపడే రోగనిరోధక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేసే హిస్టామిన్ అనే రసాయనాలని విడుదల చేస్తుంది. రక్తంలోకి హిస్టామిన్ విడుదలను నిరోధించడం ద్వారా అలర్జీ లక్షణాలు తగ్గిపోతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. అలర్జీ వల్ల కలిగే మంటని తగ్గించడంలో పీచెస్ లోని సమ్మేళనాలు ప్రభావవంతంగా పని చేస్తాయి.
స్కిన్ కి రక్షణ
పీచెస్ రక్షణ ప్రభావాలని కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. తేమగా ఉంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. అతినీలలోహిత్ కిరణాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో ఈ పండు సహాయపడుతుంది.
పీచెస్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. జీర్ణ సమస్యలు, పేగు వ్యాధి ఉన్న వాళ్ళు దీన్ని తినకపోవడమే మంచిది. దీని వల్ల వ్యాధుల తీవ్రత మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: హీట్ వేవ్ నుంచి శరీరాన్ని ఇలా రక్షించుకోండి