మురారీ కృష్ణని ప్రేమిస్తున్నాడని తెలియడంతో ముకుంద ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. కొండ మీద నుంచి దూకబోతుంటే ముకుంద అంతరాత్మ వచ్చి మురారీ నీకే దక్కుతాడని అనేసరికి వెనుదిరుగుతుంది. కృష్ణ వాళ్ళు రెస్టారెంట్ నుంచి బయటకి వచ్చేసరికి మీడియా వాళ్ళు ఉంటారు. లవ్ అండ్ మ్యారేజ్ గురించి మీ అభిప్రాయం ఏంటని అందరినీ అడుగుతూ కృష్ణ దగ్గరకి వెళ్ళి అడుగుతారు. ప్రేమ, పెళ్ళిలో ఏది గొప్పదని కృష్ణని అడుగుతారు. ప్రేమ గొప్పదని చెప్తుంది. ప్రేమించిన అతన్ని వెనక తిప్పించుకుని చివరకి ఒకే చెప్తాం. అన్నీ బాగుంటే వాడితోనే జీవితం పంచుకుంటాం కానీ అలా జరగదు కదా ప్రేమ పుట్టడం స్వచ్చంగా పుడుతుంది. మనం చచ్చేవరకు అలాగే ఉంటుంది. కానీ ప్రేమించిన వ్యక్తిని మనం కులం కాదని అమ్మాయి మనసు చిదిమేసి బలవంతంగా పెళ్లి చేస్తారని అంటుంది. అంటే కృష్ణ వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట కోసం నాతో బలవంతపు పెళ్లికి ఒప్పుకుందా అని మురారీ అప్పుగా అర్థం చేసుకుంటాడు. యాంకర్ మురారీని అడుగుతుంది.
ALso Read: శైలేంద్ర చెంప పగలగొట్టిన జగతి- తల్లీకొడుకులకి వార్నింగ్ ఇచ్చిన ఫణీంద్ర, నిజం తెలుసుకున్న దేవయాని
మురారీ: నా దృష్టిలో పెళ్లి గొప్పది. ప్రేమ గొప్పది కాదనను కానీ కొన్ని సార్లు ప్రేమ బయటకి చెప్పలేని పరిస్థితి వస్తుంది. పెళ్లి పవిత్రమైనది ప్రేమకి రెండు మనసులు కలిస్తే చాలు. పెళ్లికి రెండు కుటుంబాలు కలవాలి. పెళ్లి దైవ నిర్ణయం అందుకే పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయించబడుతున్నాయి. పెళ్లికి ప్రేమ, ప్రేమకి పెళ్లి అవసరం అందుకే ఆ రెండింటినీ వేరుగా చూడలేం
కృష్ణ: అంటే ఏంటి డైరీ అమ్మాయిని మర్చిపోయారా? మనసులో డైరీ అమ్మాయిని పెట్టుకుని పెళ్లి గురించి ఇంత గొప్పగా చెప్తున్నారని మనసులో అనుకుంటుంది.
ఇద్దరూ ఒకరినొకరు మెచ్చుకుంటారు. బలవంతపు పెళ్లి అన్నావ్ మన పెళ్లి గురించి చెప్పావా అని మురారీ అడుగుతాడు. కాదు మన పెళ్లి గురించి కాదని చెప్తుంది. అయినా అలా మనసు చంపుకుని పెళ్లి చేసుకోవడం తప్పు కదా అంటుంది. అంటే ఆదర్శ్ ని పెళ్లి చేసుకోమనీ ముకుందని బలవంతం చేసి తప్పు చేశానా అని మురారీ ఆలోచిస్తాడు. ముకుంద ఇంటికి వచ్చి సోఫా కింద ఉన్న డైరీ చూస్తుంది. అది తీసి చదువుతుంది. మొదట్లో మురారీ తన గురించి రాసినవి చదివి మురిసిపోతుంది. ఇది మాకోసమే రాసుకున్నాడు. మా ప్రేమ జ్ఞాపకాలని అనుకుంటుంది.
Also Read: ఆదిత్య కిడ్నాప్ కి స్కెచ్- అభిమన్యుకి చుక్కలు చూపించిన రత్నం, శర్మ
ఇంత ప్రేమ నామీద పెట్టుకుని అలా ఎలా మర్చిపోయావు ఎందుకు ఇలా మారిపోయావు. మన ప్రేమని ఎందుకు సమాధి చేశావని బాధపడుతుంది. డైరీలో కొన్ని పేజీలు ఖాళీగా ఉంటాయి. పేజీలు తిరగేస్తూ ఉండగా డైరీ చివర్లో కృష్ణ గురించి రాసి ఉంటుంది. కృష్ణ వెళ్లిపోతే ఈ ఖాళీ పేజిల్లాగే నా జీవితం శూన్యం అవుతుందని భయంగా ఉందని రాసుకుంటాడు. అది చూసి ముకుంద కుప్పకూలిపోతుంది. గతంలో కృష్ణకి మురారీ ప్రపోజ్ చేసింది గుర్తు చేసుకుంటుంది. కృష్ణ మీద ప్రేమ ఉన్న సంగతి చదివి నువ్వు మోసగాడివి. నాకు మాట ఇచ్చి తప్పావు. ఇప్పటి వరకు నిన్ను ప్రేమతో గెలవాలని అనుకున్నా. కానీ ఇప్పుడు మన ప్రేమని ఎలాగైనా బతికించుకుంటానని శపథం చేస్తుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial