లాస్య టార్చర్ తట్టుకోలేక నందు కాళ్ళ బేరానికి వెళతాడు. ఇంతకముందులాగా మనం భార్యాభర్తలుగా కలిసి ఉండాలి ఇదే మాట కోర్టులో కూడా చెప్పాలి. కోర్టు ప్రొసీజర్ పూర్తయిన వెంటనే మనం ఇద్దరం వేరుగా కాపురం పెట్టాలని కండిషన్ పెడుతుంది. నందు దానికి ఒప్పుకోడు. మనం కలిసి ఉండటం మీ అమ్మానాన్నకి ఇష్టం లేదు నేను వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకూడదు అనుకుంటే విడిగా ఉండాలని చెప్తుంది. దీంతో నందు సరేనని అంటాడు. లాస్య తెగ సంబరపడిపోతుంది. విక్రమ్ ఆవేశంగా గదిలోకి వచ్చి అసలు మీ అమ్మ నా గురించి ఏమనుకుంటుందని అరుస్తాడు. మంచివాడని అనుకుంటుందని వెటకారంగా చెప్తుంది.


విక్రమ్: నువ్వు నా గురించి మీ అమ్మకి ఏం చెప్పావ్


దివ్య: నువ్వు నన్ను పట్టించుకోవడం మానేశావ్ అందుకే నేను వదిలేశాను


విక్రమ్: నువ్వు చెప్పకుండానే మీ అమ్మ నన్ను కలిసి నా కూతుర్ని బాగా చూసుకో కన్నీళ్ళు పెట్టించకు అనేసి డ్రామాలు ఆడుతుందా. అత్త అని మర్యాద ఇచ్చి మాట్లాడాను లేదంటేనా


ALso Read: మురారీ డైరీ చదివిన ముకుంద- కృష్ణ ప్రేమకి విలన్ గా మారబోతుందా?


దివ్య: ఇంకోసారి మా అమ్మ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు


విక్రమ్: ఓహో అమ్మ గురించి అంటే ఇప్పుడు బాధ తెలుస్తుందా? నిన్ను రాచి రంపాన పెడుతున్నట్టు అందరి ముందు నా చేతులు పట్టుకుని బతిమలాడుతూ ఓవర్ యాక్షన్ చేసింది కాబట్టి నచ్చలేదని అన్నాను


దివ్య: నేను మీ అమ్మ పద్ధతి నచ్చలేదు కాబట్టి అన్నాను ఆడేందుకు నువ్వు తీసుకోలేకపోతున్నావ్. అమ్మ ఎవరికైనా దేవత. నీ ఒక్కడికే దేవత కాదు


ఇద్దరూ ఎవరి అమ్మల గురించి పోట్లాడుకుంటారు. ఇంకోసారి ఇలా ప్రవర్తిస్తే బాగోదని మీ అమ్మకి చెప్పమని విక్రమ్ వార్నింగ్ ఇస్తాడు. అయితే నువ్వు కూడా మీ అమ్మకి చెప్పమని దివ్య గట్టిగానే బదులిస్తుంది. దీంతో విక్రమ్ కోపంగా వెళ్ళిపోతాడు. అనసూయ, పరంధామయ్య వాళ్ళు నందు పరిస్థితి తలుచుకుని దిగులు పడుతుంటే తులసి వస్తుంది. అప్పుడే నందు లాస్య వస్తారు. ఇద్దరం కలిసి కేఫ్ కి వెళ్తున్నామని చెప్పేసి లాస్య నందుని తీసుకుని వెళ్లిపోయే సరికి తులసి వాళ్ళు షాక్ అవుతారు. అన్నీ ఆలోచించుకుని ఈ నిర్ణయానికి వచ్చావా అని పరంధామయ్య అడుగుతాడు. చెప్పాను కదా మీ వాళ్ళు మనల్ని కలిసి ఉండనివ్వరు. అందుకే మనం చిలకా గోరింకల్లాగా కలిసి వేరుగా ఉందామని అనుకున్నాం కదా ఆ విషయం కూడా చెప్పేయమని చెప్తుంది.


ALso Read: శైలేంద్ర చెంప పగలగొట్టిన జగతి- తల్లీకొడుకులకి వార్నింగ్ ఇచ్చిన ఫణీంద్ర, నిజం తెలుసుకున్న దేవయాని


మేము ఇద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నామని నందు అనేసరికి అనసూయ బిత్తరపోతుంది. మధ్యలో రాములమ్మ కల్పించుకుని వాళ్ళిద్దరూ మంచి నిర్ణయం తీసుకున్నారని మెచ్చుకుంటుంది. మంచి నిర్ణయం తీసుకున్నారని తులసి చెప్తుంది. లాస్య వెనుకాలే నందు తోక ఊపుకుంటూ వెళ్ళిపోతాడు. అలా చేసేసరికి అనసూయ ఏడుపు మొదలు పెడుతుంది. మీ అబ్బాయి లాస్యకి లొంగిపోయారు అన్నీ తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు మాజీ భార్యగా నేను తల దూరిస్తే ఎలా ఉంటుందని తులసి చెప్తుంది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial