Stock Market Today, 20 June 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.50 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 74 పాయింట్లు లేదా 0.39 శాతం రెడ్‌ కలర్‌లో 18,800 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


HDFC AMC: ప్రమోటర్‌ కంపెనీ అయిన Abrdn ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, ఈరోజు (20 జూన్‌ 2023) బ్లాక్ డీల్స్ ద్వారా HDFC AMCలో తన మొత్తం వాటాను విక్రయించే అవకాశం ఉంది.


శ్రీరామ్ ఫైనాన్స్: ప్రైవేట్ ఈక్విటీ సంస్థ TPG ఇన్వెస్ట్‌మెంట్స్, తన భారతదేశ అనుబంధ సంస్థ ద్వారా, శ్రీరామ్ ఫైనాన్స్‌లో (Shriram Finance) తనకు ఉన్న టోటల్‌ స్టేక్‌ను సోమవారం ఓపెన్‌ మార్కెట్ లావాదేవీల ద్వారా అమ్మేసింది.


IIFL సెక్యూరిటీస్: స్టాక్ బ్రోకర్ల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిందన్న కారణంతో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI), ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్‌పై చర్యలు తీసుకుంది. మరో రెండు సంవత్సరాల పాటు కొత్త క్లయింట్స్‌ను చేర్చుకోకుండా నిషేధం విధించింది.


ఇండిగో: 500 ఎయిర్‌బస్ A320 ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం భారీ ఆర్డర్ చేసినట్లు ఇండిగో ‍‌(IndiGo) తెలిపింది. అవన్నీ ఈ ఎయిర్‌లైన్స్‌ కంపెనీకి 2030 - 2035 మధ్య కాలంలో అందుతాయి. ఈ 500 ఎయిర్‌క్రాఫ్ట్ ఆర్డర్ ఇండిగోకు మాత్రమే అతి పెద్ద ఆర్డర్ కాదు, ఒకే తరహా విమానాల కోసం ఏ ఎయిర్‌లైన్స్‌ నుంచైనా ఎయిర్‌బస్‌కు (Airbus) వచ్చిన అతి పెద్ద ఆర్డర్‌ కూడా ఇదే.


రాయల్ ఆర్కిడ్ హోటల్స్: కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఫిలిప్ లోగన్‌ను ‍‌(Philip Logan) నియమించినట్లు రాయల్ ఆర్చిడ్ హోటల్స్ ప్రకటించింది.


కెన్‌ ఫిన్ హోమ్స్‌: రూ. 4,000 కోట్లకు మించకుండా ఆన్-షోర్, ఆఫ్-షోర్ డెట్ ఇన్‌స్ట్రుమెంట్‌ల జారీకి కెన్ ఫిన్ హోమ్స్ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించింది.


టిమ్‌కెన్ ఇండియా: టిమ్‌కెన్ సింగపూర్ (Timken Singapore) టిమ్‌కెన్ ఇండియాలో దాదాపు 63 లక్షల షేర్లను బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించనుంది. ఫ్లోర్ ధరను ఒక్కో షేరుకు రూ. 3,000గా నిర్ణయించింది. ఇది ప్రస్తుత స్థాయిల కంటే 14% డిస్కౌంట్‌.


ఈథర్ ఇండస్ట్రీస్: క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్ ప్లేస్‌మెంట్ (QIP) ద్వారా ఈక్విటీ షేర్లను జారీ చేసి నిధులను సమీకరించడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.


ఇది కూడా చదవండి: టాక్స్‌ పేమెంట్‌లో మరిన్ని ఆప్షన్లు, ఈ-పే టాక్స్‌ సర్వీస్‌ అందిస్తున్న 25 బ్యాంక్‌లు 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.