బాసర ట్రిపుల్‌ ఐటీలో ఆరేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును అధికారులు పొడిగించారు. నోటిఫికేషన్‌లో ప్రకటించిన గడువు జూన్‌ 19 ముగియడంతో అధికారులు ఆ గడువును జూన్‌ 22 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అర్హులైన మరికొందరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనేందుకు వీలుపడనుంది. అలాగే, దివ్యాంగులు/ సీఏపీ/ ఎన్‌సీసీ/ స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులు జూన్ 27వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. ఆరేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను జులై 3న విడుదల చేసే అవకాశం ఉంది.  


Website


దరఖాస్తు ఫీజుగా ఓసీ, ఓబీసీ విద్యార్థులు రూ. 500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 450 చెల్లించాలి. పదోతరగతిలో వచ్చే మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయించనున్నారు. 18 సంవత్సరాలు మించిన విద్యార్థులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు. ట్రిపుల్‌ ఐటీలోని 85 శాతం సీట్లు లోకల్‌ వాళ్లకు, మిగిలిన 15 శాతం సీట్లు తెలంగాణ, ఏపీకి కేటాయించనున్నారు.


వివరాలు..


బాసర ట్రిపుల్‌ ఐటీ 2023-24 ప్రవేశాలు


సీట్ల సంఖ్య: మొత్తం 1650 ఇంటిగ్రెటెడ్‌ బీటెక్‌(ఇంటర్‌+బీటెక్‌) సీట్లు భర్తీ కానున్నాయి. యూనివర్శిటీలో 1500 సీట్లు ఉండగా.. 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద, మరో 150 అదనంగా భర్తీ చేస్తారు. మొత్తం సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు రాష్ట్రంతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడతారు.


అర్హత: ఈ సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులైన వారు మాత్రమే ప్రవేశాలకు అర్హులు. ఈ ఏడాది డిసెంబర్‌ 31 నాటికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 21 ఏళ్లు, మిగిలిన వారి వయసు 18 ఏళ్ల లోపు ఉండాలి.


దరఖాస్తు ఫీజు: ఓసీ, ఓబీసీ విద్యార్థులు రూ. 500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 450 చెల్లించాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ఎంపిక విధానం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి పదో తరగతి గ్రేడ్‌కు 0.40 స్కోర్‌ కలుపుతారు. ఒకవేళ ఇద్దరు విద్యార్థుల స్కోర్‌ సమానంగా ఉంటే.. ఏడు కొలమానాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొదట గణితంలో, తర్వాత సైన్స్, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ప్రథమ భాషలో గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు ఇస్తారు. అవీ సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు ఉన్న వారికి సీటు కేటాయిస్తారు. అది కూడా సమానంగా ఉంటే హాల్‌టికెట్‌ ర్యాండమ్‌ నంబరు విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.


ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.06.2023.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 19.06.2023. (22.06.2023 వరకు పొడిగించారు) 


➥  ప్రాథమిక జాబితా వెల్లడి: 03.07.2023.


ALSO READ:


నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..