ITR Filing 2023: మన దేశంలో ఆదాయ పన్ను చెల్లించడం ఇప్పుడు మరింత సులభం & సౌకర్యవంతం. ఆదాయపు పన్ను విభాగం, ఈ-పే టాక్స్ సర్వీస్ (E-Pay Tax Service) ఫెసిలిటీలోకి మొత్తం 25 బ్యాంకులను తీసుకొచ్చింది. దీంతో, ఆదాయ పన్ను చెల్లించడానికి టాక్స్ పేయర్లకు (taxpayers) భారీ సంఖ్యలో ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి.
ఆదాయ పన్ను చెల్లింపుదార్లు, ఈ-పే టాక్స్ సర్వీస్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించవచ్చు. ఆదాయపు పన్ను విభాగం (Income Tax Department) ఈ-పే టాక్స్ సర్వీస్ ద్వారా, మీ నెట్ బ్యాంకింగ్ అకౌంట్‌ను ఉపయోగించి, ఇంటర్నెట్ ద్వారా మీ టాక్స్ పే చేయవచ్చు.
ప్రస్తుతం ఈ-పే టాక్స్ సర్వీస్‌ను అందిస్తున్న 25 బ్యాంకుల లిస్ట్ ఇది:
1. యాక్సిస్ బ్యాంక్
2. బ్యాంక్ ఆఫ్ బరోడా
3. బ్యాంక్ ఆఫ్ ఇండియా
4. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
5. కెనరా బ్యాంక్
6. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
7. సిటీ యూనియన్ బ్యాంక్
8. DCB బ్యాంక్
9. ఫెడరల్ బ్యాంక్
10. HDFC బ్యాంక్
11. ICICI బ్యాంక్
12. IDBI బ్యాంక్
13. ఇండియన్ బ్యాంక్
14. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
15. ఇండస్‌ఇండ్ బ్యాంక్, కొత్త బ్యాంక్
16. జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్
17. కరూర్ వైశ్యా బ్యాంక్
18. కోటక్ మహీంద్రా బ్యాంక్
19. పంజాబ్ నేషనల్ బ్యాంక్
20. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
21. RBL బ్యాంక్
22. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
23. సౌత్ ఇండియన్ బ్యాంక్
24. UCO బ్యాంక్
25. యూనియన్ బ్యాంక్
ఈ-పే సర్వీస్‌ను ఎవరు ఉపయోగించుకోవచ్చు?
A) నెట్-బ్యాంకింగ్ ఫెసిలిటీతో బ్యాంక్ ఖాతా టాక్స్ పేయర్
B) ఈ-పే ఆప్షన్‌ను అందించే ఆర్థిక సంస్థల్లో మీ బ్యాంక్ ఒకటి అయితే, మీరు ఆ సర్వీసును ఉపయోగించుకోవచ్చు.
ఈ 25 బ్యాంకుల లిస్ట్‌లో మీ బ్యాంక్ లేకపోతే మీరు ఏం చేయాలి?
మీ బ్యాంక్ ఆన్‌లైన్ పేమెంట్స్‌ను అంగీకరించకయినా, లేదా ఆథరైజ్డ్ బ్యాంక్ కాకపోయినా ఇబ్బంది లేదు. ఆన్‌లైన్ చెల్లింపులను అంగీకరించే ఆథరైజ్డ్ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న మరో వ్యక్తి ఖాతా నుంచి మీరు మీ పన్నులను ఎలక్ట్రానిక్ రూపంలో చెల్లించవచ్చు. అయితే, ఈ పేమెంట్ చేయడానికి ఉపయోగించే చలాన్‌లో మీ పర్మినెంట్ అకౌంట్ నంబర్‌ను (PAN) రాయడం మాత్రం మర్చిపోవద్దు.
ITR ఫైల్ చేయడానికి చివరి తేదీ
FY 2022-23 (AY 2023-24) కోసం ITR ఫైల్ చేయడానికి గడువు జులై 31, 2023. జరిమానా నుంచి తప్పించుకోవడం, సకాలంలో రీఫండ్‌ను క్లెయిమ్ చేయడం, సరైన ఫైనాన్షియల్ రికార్డ్స్ మెయిన్‌టైన్ చేయడం, ఆర్థిక లావాదేవీలు ఈజీగా సాగడం కోసం గడువు లోగా ITR ఫైల్ చేయడం చాలా ముఖ్యం.
మరో ఆసక్తికర కథనం: లాకర్ ఇవ్వడానికి ఏ బ్యాంక్ ఎంత ఛార్జ్ చేస్తోంది?