గుప్పెడంతమనసు జూన్ 21 ఎపిసోడ్
ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్లిపోవడంతో శైలేంద్ర నిజం చెప్పేస్తాననంటాడు. ఏం నిజం చెబుతావ్ అని దేవయాని నిలదీస్తుంది. అప్పుడు శైలేంద్ర.. రిషిని తాను చంపించేశానని చెప్పేస్తాడు. దేవయాని షాక్ అవుతుంది. రిషి లేడంటేనే జగతి కొట్టింది అలాంటిది రిషి చనిపోయాడని తెలిస్తేఇంకేమైనా ఉందా అంటుంది. ఇన్ని రోజులు నువ్వు ఏం చేయాలి అనుకున్నావో చేశావ్, ఇప్పుడు పరిస్థితులు మన చేతులు దాటేలా ఉన్నాయి అందుకే నేను చెప్పినట్టు విను, ఎలాగైనా నిన్ను ఎండీ సీటులో నేను కూర్చోబెడతాను నువ్వు ఆవేశంలో నిజం బయటపెట్టకు నా బాధ అర్థం చేసుకో అని శైలంద్రకి నచ్చచెబుతుంది.
ALso Read: శైలేంద్ర చెంప పగలగొట్టిన జగతి- తల్లీకొడుకులకి వార్నింగ్ ఇచ్చిన ఫణీంద్ర, నిజం తెలుసుకున్న దేవయాని
ఈ రోజు వసుతో కాలేజీకి వెళ్లి రిషి సార్ ని కలవాలని అనుకుంటాడు చక్రపాణి. నేను కూడా నీతో వస్తానన్న చక్రపాణి కాలేజీ వరకూ నీతో వచ్చి అక్కడో చిన్నపని ఉందిచూసుకుంటాను అంటాడు. ఏంపనో చెప్పండి నేను చేస్తానుకదా అని వసు అంటే ఆ పనయ్యాక నేనే నీకు చెబుతాను ఆ వివరాలేవీ అడగొద్దు వస్తానంటాడు. తండ్రి కూడా వసుతో పాటూ వెళతాడు. వసుధార కాలేజీ దగ్గర దిగి వెళ్లిపోయిన తర్వాత రిషి కారు ఎదురుపడడంతో ఆటోని ఆపమని చెప్పి ఆ కారు వెనుకే వెళతాడు. తండ్రిని చూసిన వసుధార నాన్నెందుకు వస్తున్నారని అనుకుంటుంది. ఇంతలోనే తండ్రి రిషిని కలుస్తాడు.
రిషి-చక్రపాణి
మీతో మాట్లాడాలి బాబు అని చక్రపాణి అంటే రాయబారానికి వచ్చారా మీరే వచ్చారా ఇంకెవరైనా పంపించారా అని అడుగుతాడు. గతాన్ని ఎప్పుడో వదిలేశాను ఇది ప్రస్తుతం అన్న రిషి..మీకు గతాన్ని గుర్తుచేసే ప్రయత్నం చేయొద్దని స్ట్రాంగ్ గా చెబుతాడు.మీ అమ్మాయి ఇప్పుడు మిమ్మల్ని పంపించింది ఆ తర్వాత రాయబారానికి వాళ్లమ్మని పంపిస్తుందేమో అందుకే ముందే చెబుతున్నా అనగానే తను రాదులెండి బాబు అని బాధగా అంటాడు చక్రపాణి. ఇక్కడ నన్ను చూసిన విషయం ఎవ్వరికీ చెప్పొద్దు నాకు ఈ ఒక్క సాయం చేయండి అనేసి రిషి కోపంగా వెళ్లిపోతాడు.
రిషి-వసుధార
తండ్రితో మాట్లాడి కోపంగా వెళ్లిపోతున్న రిషిని పిలుస్తుంది వసుధార. ఆయనతో కొంచెం మామూలుగా మాట్లాడితే ఏమైంది సార్. మీ దృష్టిలో తప్పు చేసింది నేను మరి ఆయనేం చేశారని అడిగితే...నీకు తండ్రి కావడమే అని రిప్లై ఇస్తాడు. వసు ఏమోషన్ అవుతుంది.
వసు: కూతురి కష్టాన్ని కడుపులో దాచుకోలకే మీదగ్గరకు రావడమే ఆయన చేసిన తప్పు, మీరు ఇలా స్పందిస్తారని తెలియక ప్రాధేయపడాలి అనుకోవడమే ఆ పిచ్చితండ్రి చేసిన తప్పు. ఆశతో మీ దగ్గరకు వచ్చిన వ్యక్తికి కన్నీళ్లు కానుకగా ఇచ్చి పంపించారు థ్యాంక్యూ సోమచ్..అసలు ఆయన మిమ్మల్ని కలుస్తారని కూడా నాకు తెలియదు లేదంటే వద్దని చెప్పేదాన్ని కాదు, మా అమ్మ కూడా మిమ్మల్ని కలిసే అదృష్టం లేదులెండి ఆ విషయంలో మీరు ఎలాంటి ఆందోళన పడాల్సిన లేదు
రిషి: ఇన్నాళ్లుగా నేను కార్చిన కన్నీటి విలువెంత, నా ఆవేదన విలువెంతో అన్నీ ఆ భగవంతుడికి తెలియాలి
చక్రపాణి ఇంటికి నడిచి వెళుతూ రిషి మాటలు తలుచుకుని కుమిలిపోతాడు. మీరుకూడా ఇంకోసారి రావొద్దన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. రాయి తగిలి కింద పడతాడు. కళ్లజోడుని ఏదో వెహికల్ తొక్కుకుని వెళ్లిపోతుంది. నా బిడ్డ భవిష్యత్ లా నా కంటిచూపు కూడా పోయిందని కుమిలిపోతాడు.
కాలేజీలో రిషి మెట్లపై ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు...చక్రపాణిని అన్న మాటలు తలుచుకుంటాడు. మరోవైపు మెట్లపై వసుధార కూర్చుని బాధపడుతుంటుంది. ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుంటారు. జరిగినదంతా తలుచుకుంటారు. మనసులోనే మాట్లాడుకుంటారు. ఎవరికోసం ఇదంతా చేస్తున్నావ్ నీ సంతోషం కోసమా, నన్ను వేధించడం కోసమా అని రిషి...నా సంతోషం మీరే సార్ అర్థం చేసుకోవడం లేదని వసు.. నన్ను ఒంటరివాడిని చేశారు నా కలను చిదిమేశారని రిషి.. మీరెప్పుడూ ఒంటరివాడు కాలేరు సార్ అని వసు లోలోపలే మాట్లాడుకుంటారు.
Also Read: జూన్ 21 రాశిఫలాలు, ఈ రాశివారికి మనసులో ఆందోళన ఉన్నా బయటకు ఆనందంగా కనిపిస్తారు
ఇంతలో రిషికి కాల్ చేస్తుంది ఏంజెల్. క్లాసులు అయిపోయాయా పనేమైనా ఉందా ఇంటికి ఎన్నిగంటలకు వస్తున్నావ్ అని అడుగుతుంది. మనం షాపింగ్ కివెళదాం తొందరగా రాఅని ఏంజెల్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదంటాడు. ఎప్పుడూ జీవితాన్ని కోల్పోయినట్టుంటావ్ అని చిరాకుపడిన ఏంజెల్ సరే నేను ఒక్కదాన్నే షాపింగ్ కి వెళుతున్నా వచ్చాక విశ్వాన్ని పలకరించు అనేసి కాల్ కట్ చేస్తుంది.
మరోవైపు ఫణీంద్ర, జగతి మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఫణీంద్ర దేవయాని వస్తారు. రిషి గురించి తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించండి అని డ్రామాలు ఆడుతుంటారు. ఇంతలో మహేంద్ర రావడంతో సారీ చెబుతాడు ఫణీంద్ర. దేవయాని కూడా డ్రామా ఆడుతుంది. ఇదంతా విన్న ధరణి..ఎందుకండీ ఇన్ని డ్రామాలాడుతారు అనుకుంటుంది మనసులో. మిషన్ ఎడ్యుకేషన్ ని ముందుకు తీసుకెళ్లాలని ఫణీంద్ర చెబుతాడు. నేను కూడా ఈ ప్రాజెక్టులోకి వస్తాను, రిషి ప్లేస్ రీప్లేస్ చేస్తానని శైలేంద్ర అనడంతో అది అసాధ్యం అని ఫైర్ అవుతుంది జగతి..
ఎపిసోడ్ ముగిసింది..