మురారీ, కృష్ణ కారులో వెళ్తూ సరదాగా పోట్లాడుకుంటారు. ఇద్దరూ నిజమైన మొగుడు పెళ్ళాలు మాదిరిగా అరుసుకుంటారు. కారు డ్రైవింగ్ ఎలా చేయాలని కృష్ణ అడుగుతుంది. ముకుంద బాధగా వస్తుంటే రేవతి చూస్తుంది. వస్తున్నావా అత్త రా మా ప్రేమ విషయం తెలిసి కొడుకు మనసు అర్థం చేసుకుంటారని ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని కృష్ణని పంపించేసి మా ఇద్దరినీ కలిపే వారధి అవుతారని అనుకున్నా. కానీ మా ఇద్దరినీ వేరు చేసే వారధి మీరు అవుతారని అనుకోలేదు. ఇక ముసుగులో గుద్దులాట వద్దు మీ పంతమో నా ప్రేమ అనేది తేల్చుకుంటానని అనుకుంటుంది. ఇద్దరి మధ్య వాదన మొదలవుతుంది.
ముకుంద: ఎవరు ఏమనుకున్నా నాకు నచ్చిందే చేస్తాను నచ్చినట్టే ఉంటాను ఎవరి గురించి పట్టించుకోను
రేవతి: కానీ నేను మాత్రం నీ ఆటలు చూస్తూ నేను ఊరుకొను
ముకుంద: ఏం చేస్తారు మహా అయితే మరో హోమం చేయిస్తారు అంతే కానీ బలవంతంగా కాపురం చేయించలేరు కదా
రేవతి: నోర్ముయ్
Also Read: వడ్డీ వ్యాపారిని కిడ్నాప్ చేసిన కనకం -స్వప్న కడుపు డ్రామా రుద్రాణి కనిపెట్టేస్తుందా?
ముకుంద: ఇన్నాళ్ళూ నేను చేసింది అదే కదా మీ కొడుకు కోసం, కుటుంబం పరువు కోసం నా ప్రేమని చంపుకున్నా అదే నేను చేసిన తప్పు. ఇక మీదట త్యాగాలు లేవు నాకు కావలసింది లాక్కుంటాను అది ప్రేమ అయినా ప్రేమించిన వాడు అయినా. నాది అని నేను అనుకుంటే అది ఇంకొకరి సొంతం అవుతుంటే చూస్తూ ఊరుకోను
రేవతి: పెళ్లి పవిత్రమైనది
ముకుంద: నాకు నా ప్రేమే ముఖ్యం. అది సాధించుకోవడమే నా లక్ష్యం. ఎప్పటికైనా మీ కోడలు కృష్ణ కాదు నేనే. మీతో ఇలా మాట్లాడటం తప్పని తెలిసినా తప్పడం లేదు
ఇన్నాళ్ళూ ముకుంద మారుతుందని అనుకున్నా కానీ తను చాలా క్లారిటీతో ఉంది. తన ప్రేమో నా కొడుకు కోడలు దాంపత్యమో తేల్చుకోవాలని రేవతి అనుకుంటుంది. అప్పుడే మురారీ వాళ్ళు వస్తే వాళ్ళకి రేవతి దిష్టి తీస్తుంది. తర్వాత ముకుందని హారతి ఇచ్చి దిష్టి తీయమని చెప్తుంది. మీరు కావాలని ఇలా చేస్తున్నారు ఇంకెన్నాళ్ళు కొన్నాళ్ళే కదా మీ ముచ్చటి ఎందుకు కాదనాలని ముకుంద హారతి ఇస్తుంది. ఏ నర దిష్టి తగలకుండా నువ్వే చూడమని రేవతి కావాలని గట్టిగా నొక్కి మరీ చెప్తుంది. మేము దూరప్రాంతం ఏమి వెళ్లలేదు కదా ఎందుకు దిష్టి తీశారని అడుగుతుంది. రేవతి అత్తయ్యకి ముకుంద, మురారీ ప్రేమ సంగతి తెలిసినట్టు ఉందని అలేఖ్య వాళ్ళు అనుకుంటారు.
Also Read: మాళవికని పంపించేయాలని డిసైడ్ అయిన యష్ - ఖుషిని కిడ్నాప్ చేసిన అభిమన్యు, వేద కాపాడుకుంటుందా?
నా కొడుకు నాకు ఎప్పుడు చిన్నపిల్లోడే అంటుంది రేవతి. అవును నాకు కూడా మా ఆయన ఏబీసీడీ అబ్బాయివే అనేసరికి మురారీ కృష్ణ వెంట పడతాడు. ఇద్దరూ సంతోషంగా ఇల్లంతా తిరుగుతారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత బలవంతంగా కాపురం చేయించలేమని చెప్పావు నిజమే కానీ ఇద్దరూ కలిసి ఉంటే వాళ్ళు వీళ్ళు అవుతారని రేవతి చెప్తుంది. కాలం కలిసి వస్తే నువ్వు పెద్దమ్మవి అవుతావని అనేసరికి ముకుంద షాక్ అవుతుంది. కలలు కంటున్నారు జాగ్రత్త అవి నిజం కాలేవని ముకుంద బదులిస్తుంది. కృష్ణ వాళ్ళు కాపురమే చేయడం లేదని పెద్దత్తయ్యకి తెలిస్తే తనని మెడ పట్టుకుని బయటకి పంపించేస్తుందని అనేసరికి రేవతి భయపడుతుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial