నందు లాస్యతో కలిసి ఉండటానికి ఒప్పుకుని వేరు కాపురం కూడా పెడుతున్నాడని రాజ్యలక్ష్మి చెప్తుంది. అది విని దివ్య షాక్ అవుతుంది. నిన్ను తీసుకుని కోర్టుకి వెళ్లాలని దివ్య అనుకుంటే ఇలా చేస్తావ్ ఏంటని రాజ్యలక్ష్మి కొడుకు ముందు నటిస్తుంది. అవసరం అయితే తనని వెళ్ళమని నాకు పని ఉందని దివ్యని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. లాస్య దెబ్బతో అక్కడ తులసి, ఇక్కడ దివ్య ఒంటరిగా మిగిలిపోతారని సంబరపడుతుంది. కోర్టు సీన్ స్టార్ట్ అవుతుంది. దివ్య, తులసి కోర్టుకి వస్తారు. నాన్న బుద్ధిగా లాస్యకి సరెండర్ అయిపోయారు, ఇన్ని రోజులు చూపించిన కోపం, ద్వేషం ఏమైపోయాయని దివ్య బాధగా అడుగుతుంది. మరోవైపు లాస్య, రాములమ్మ ఉంటారు. బాధపడుతున్న దివ్యని చూసి లాస్య హ్యాపీగా ఉంటుంది. నందు ఏమి చేయలేక దిగులుగా కూర్చుంటాడు. కోర్టు ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి.
జడ్జి: మీకు ఇచ్చిన నెలరోజులు గడువు పూర్తయింది ఏం నిర్ణయం తీసుకున్నారు ఎవరు మనసు మార్చుకున్నారు
లాస్య: నా మనసు నిర్ణయం మారదు నా ఆఖరి శ్వాస వరకు ఆయనతోనే జీవితం
జడ్జి: నందగోపాల్ మీరేం నిర్ణయించుకున్నారు మనసు మార్చుకుని భార్యతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారా?
Also Read: కొడుకు, కోడల్ని హనీమూన్ కి పంపించిన రేవతి- ముకుంద ఏం చేయబోతోంది?
మాధవ్: నా క్లయింట్ మనసు మార్చుకోలేదు ఇప్పటికీ డివోర్స్ కోరుకుంటున్నారు. తన భార్యతో కలిసి ఉండటానికి నా క్లయింట్ ఒప్పుకుని వచ్చాడు ఇది పైకి చెప్పే నిజం పైకి చెప్పని నిజం ఇంకొకటి ఉంది. నా క్లయింట్ పేరెంట్స్ ని చంపేస్తానని బెదిరించి కలిసి ఉండటానికి ఒప్పుకోమని బ్లాక్ మెయిల్ చేసింది ఈ లాస్య
లాస్య: ఇది ఇంకొక అబద్ధం నిజం కాదు. ఇంట్లో వాళ్ళు అంతా నందు మీద ప్రెజర్ పెట్టారు మేము ఇద్దరం కలవకూడదని నా మీద మాటల దాడి చేశారు అవన్నీ తట్టుకుని కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం. వాళ్ళు మమ్మల్ని విడదీయాలని కుట్ర చేస్తున్నారు అందుకు సాక్ష్యం కూడా ఉంది. కావాలంటే ఆ ఇంటి పని మనిషి రాములమ్మని అడగండి.
మాధవ్: నందు పేరెంట్స్ ని లాస్య చంపేస్తానని బెదిరించడం నిజమా కాదా?
రాములమ్మ: నిజం లాస్య బెదిరించారు. మామూలుగా బెదిరించలేదు నరకం చూపించింది పెద్దవాళ్ళని చంపేస్తానని బెదిరించడానికి వాళ్ళకి ఇచ్చే కాఫీలో నిద్ర మాత్రలు కలిపింది వాళ్ళు చచ్చిబతికారు. అందుకు నేనే సాక్ష్యం
లాస్య: ఇదంతా అబద్ధం
జడ్జి: తను చెప్పింది నిజమని ఎలా నమ్మాలి అనేసరికి తులసి సాక్ష్యం చెప్పేందుకు వస్తుంది.
తులసి: లాస్య బెదిరించింది అనేందుకు నా దగ్గర వీడియో సాక్ష్యం ఉందని చెప్పి లాస్య బెదిరించినది మొత్తం వీడియో చూపిస్తుంది.
Also Read: రాహుల్ కి వార్నింగ్, రుద్రాణికి చీవాట్లు- కావ్య మీద ప్రేమ చూపించిన రాజ్
జడ్జి: మీ ఆయన మీద ఫెక్ గృహహింస కేసు పెట్టి తప్పు చేశావు. ఇప్పుడు మరో తప్పు మరో అబద్ధం చెప్తున్నావ్
లాస్య: నేను ఏం చేసినా నా భర్తతో కలిసి ఉండటానికే, తనని నాకు దూరం చేయవద్దు
నందు: నా భార్యది క్రిమినల్ బ్రెయిన్ అని మరోసారి అర్థం అయ్యింది. నా మీద కోపం వస్తే మా అమ్మానాన్నని చంపదని గ్యారెంటీ ఏంటి
జడ్జి: నీమీద మీ ఆయనకే కాదు కోర్టుకి కూడా నమ్మకం లేదు నువ్వు డేంజరస్. కేసుని పరిశీలించిన తర్వాత డైవర్స్ గ్రాంట్ చేయడం జరిగింది. లాస్యకి యాబై వేలు భరణంగా ఇవ్వాల్సిందిగా ఆర్డర్ వేస్తాడు.
కోర్టు బయట దివ్య చాలా సంతోషంగా మాట్లాడుతుంటే లాస్య కోపంగా వస్తుంది.