Ashada Masa 2023: ఆషాఢ మాసం హిందూ క్యాలెండర్‌లో నాల్గవ మాసం. ఆషాఢ మాసాన్ని శుభకార్యాలు చేయడానికి అశుభ మాసంగా భావిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వారికి అంటే కొత్తగా పెళ్లయిన వధూవరులకు, ఆషాఢ మాస నియమాలు చాలా ఉంటాయి. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన జంట పాటించాల్సిన నియ‌మాలు ఏమిటో తెలుసా?

1. ఆషాఢ మాసంలో శుభ కార్యాలు నిషిద్ధం- వివాహ కార్యక్రమం, నిశ్చితార్థాలు, మంచి పనులు- పిల్లలకు సంబంధించిన నామకరణం, శుభ కార్యాలు- కొత్త కార్యాలయాల ప్రారంభం, కొత్త గృహ ప్రవేశం- ఆషాఢమాసంలో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు.

Also Read : ఆషాఢంలో ఈ 3 పనులు చేస్తే అదృష్టం మీ వెంటే!

2. నూతన వధూవరులకు ఆషాఢ మాస నియ‌మాలు- మ‌న సంప్ర‌దాయంలో ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన జంటకు అనేక నియ‌మాలు ఉన్నాయి. ఆషాఢమాసంలో నూతన వధూవరులను పెద్ద‌లు పూర్తిగా దూరంగా ఉంచుతారు. దంపతులు ఒకరినొకరు చూసుకోవడానికి కూడా అనుమతించరు. ఇందులో భాగంగానే దీంతో భార్యను ఆమె పుట్టింటికి పంపిస్తారు.- ఈ సంప్ర‌దాయంపై అనేక అవాస్త‌వ క‌థ‌నాలు ప్రచారంలో ఉన్నప్పటికీ దీని వెనుక కారణం చాలా సుస్ప‌ష్టం. ఆషాఢమాసంలో నూతన వధూవరులు విడిపోవడానికి కారణం ఈ మాసంలో దంపతులు కలిసి ఉంటే చైత్రమాసంలో సంతానం కలుగుతుంది.- చైత్ర మాసం సాధారణంగా వేసవి మధ్యలో వస్తుంది, ఇది సూర్యుని వేడి ఎక్కువ‌గా ఉండే సమయం. వేసవిలో ప్రసవించే సమయంలో త‌ల్లీబిడ్డ‌ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఆషాఢ మాసంలో దంపతులను దూరంగా ఉంచుతారు.- అలాగే ఆషాఢమాసంలో అత్తగారు, కొత్త‌ కోడలు ఒకే ఇంట్లో కలిసి ఉండకూడదు. ఈ కార‌ణంగా కూడా కొత్త కోడ‌లిని ఆమె పుట్టింటికి పంపుతారు.

3. ఆషాఢ మాసంలో పండుగలు- జగన్నాథ రథయాత్ర- సర్వత్ర ఏకాదశి- బక్రీద్- లీపు మాసం ప్రారంభం- గురు పూర్ణిమ- సంకష్ట‌ చతుర్థి- కామికా ఏకాదశి- ఆషాఢ అమావాస్య లేదా భీముని అమావాస్య. అనంత‌రం శ్రావణ మాసం ప్రారంభమవుతుంది.

4. ఆషాఢ మాసం ప్రాముఖ్యత             - శివుడు పార్వతీదేవికి అమరత్వం గురించి చెప్పిన మాసం ఇది.- ఈ మాసంలో గంగామాత భూమికి ఉత్తరం వైపు ప్రవహించింది.- మహా పతివ్రత అనుసూయాదేవి నాలుగు సోమవారాలు శివ వ్రతాన్ని ఆచరించడం వల్ల భర్తకు ఆయురారోగ్యాలు క‌లిగాయి.- అమర్‌నాథ్ హిమలింగ దర్శనం ప్రతి సంవత్సరం ఈ సమయంలోనే ప్రారంభమవుతుంది.- తొలి ఏకాదశి వ్రతం ఆషాఢ మాసంలో జరుపుకొంటారు.- ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం ఇంటి ముందు దీపం పెట్టే సంప్రదాయం ఉంది.

Also Read : గోరింట ఆషాడమాసంలోనే ఎందుకంత ప్రత్యేకం, దీని పుట్టుక వెనుక ఇంత కథ ఉందా!

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.