అతివల చేతికి అందం, అలంకరణ గోరింట. యుగాలు మారినా, తరాలు మారినా ఎవ్వర్ గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ గోరింట. అందుకే శుభకార్యం అనగానే పిల్లల నుంచి మగువల వరకూ అందరి చేతిపైనా అందంగా ఒదిగిపోతుంది. రెగ్యులర్ గా పెట్టుకునే వారున్నప్పటికీ... ఆషాడం మాసం మరింత ప్రత్యేకం. ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవ‌డం వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్యం కారణాలెన్నో ఉన్నాయి. 


Also Read:  ఇళ్లు, షాపుల ఎంట్రన్స్ లో నిమ్మకాయ, మిరపకాయ ఎందుకు కడతారు


గౌరీదేవి పుట్టించిన గోరింట
గౌరీ దేవి బాల్యంలో త‌న చెలిక‌త్తెల‌తో క‌లిసి వ‌నంలో ఆడుకుంటుండగా ర‌జ‌స్వ‌ల అవుతుంది. ఆ స‌మ‌యంలో గౌరీ దేవి ర‌క్త‌పు చుక్క నేల‌ను తాకగానే ఓ మొక్క ఉద్భవించింది. ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం చెబుతారు. పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు ఆ చెట్టు ఇలా అంది... పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను...నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోయగానే వేళ్లు ఎర్రబడతాయి. అది చూసిన ప‌ర్వ‌త‌రాజు దంప‌తులు చెయ్యి ఇలా కందిపోయిందేంటని కంగారు పడతారు. ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే...ఈ రంగు చాలా బావుంది అంటుంది.  అప్పటి నుంచీ స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింట ఉంటుందని వరం ఇస్తాడు. అప్పటి నుంచీ స్త్రీలకు గోరింట అంతే మక్కువ మొదలైందట. 


Also Read:  ఇంటి ద్వారాన్ని 16 విధాలుగా నిర్మించవచ్చు... ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి


ఆరోగ్యాన్నిచ్చే గోరింటాకు



  • ఆషాడమాసం అంటే వర్షాకాలం ఆరంభం. దీంతో క్రిమి కీటకాలు, అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా పనుల్లో మునిగితేలే మహిళల చేతులు, కాళ్లు ఎప్పుడూ తడిగానే ఉంటాయి. దీంతో త్వరగా వ్యాధుల బారిన పడుతుంటారు.  గోరంటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరవంటారు ఆయుర్వేద నిపుణులు.

  • స్త్రీ అర‌చేతి మ‌ధ్య‌లో గ‌ర్భాశ‌యానికి ర‌క్తం చేర‌వేసే ప్ర‌ధాన నాడులు ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవ‌డం వ‌ల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. దీనివ‌ల్ల గ‌ర్భాశ‌య దోషాలు తొల‌గి ఆరోగ్యంగా ఉంటారు.

  • శరీరంలో ఉన్న అధిక మైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది. శరీర తత్త్వాన్ననుసరించి లేత నారింజ రంగు, ముదురు ఎరుపు  రంగు లో పండుతుంది.
    గోరింటాకులో ఉన్న ఔషధగుణం పిప్పిగోళ్ళని గోరుచుట్టుని రాకుండా నివారిస్తుంది. కాలి వేళ్ళ గోళ్ళ మొదళ్ళలో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే క్లియర్ అవుతుంది.

  • గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెబుతారు

  • గోళ్ళకి లాగానే జుట్టుకి కూడా రంగునిస్తుంది గోరింటాకు. సహజమైన  మంచి కండిషనర్ గా పని చేస్తుంది. 


Also Read: మీ నక్షత్రం ప్రకారం ఇంటి ఆవరణలో పెంచాల్సినవి .. ఆవరణలో ఉండకూడని చెట్లు ఇవే..