పెద్దలను అనుసరించి కొన్ని పద్ధతులను ఫాలో అవుతుంటారు. అయితే అవెందుకు చేస్తారో మాత్రం చాలామందికి తెలియదు. ఎందుకిలా చేస్తున్నారని అంటే మా పెద్దోళ్లు చేసేవారు మేం కూడా చేస్తున్నాం అంటారు. సరైన కారణం చెప్పలేకపోవడంతో శాస్త్రీయ కారణం తెలియక కొన్ని మూఢనమ్మకాల జాబితాలోకి వెళ్లిపోయాయి. అలాంటి వాటిలో ఒకటి...ఇంటి ముందు కట్టే నిమ్మకాయ, మిరకాయ గుత్తి. 


నిమ్మ, మిరప ఎందుకు కడతారంటే
హిందూ కుటుంబాల్లో చాలా మంది ఫాలో అవుతారు ఈ పద్ధతి. ఇంటి ముందు నిమ్మకాయ, మిరపకాయలు దారానికి గుచ్చి కడుతుంటారు. ఎందుకు అని అడిగితే దిష్టిపోతుందని కొందరు, ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని మరికొందరు చెబుతారు. గుమ్మానికి నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి వేలాడదీయడం వల్ల దుష్టశక్తులు, ఆత్మలు ఇంట్లోకి రావని మరికొందరి నమ్మకం. అయితే.. దీని వెనుక సైన్స్ కూడా ఉంది.  


Also Read: అక్వేరియం ఇంట్లో ఉండొచ్చా, ఉంటే ఏ దిశగా ఉండాలి, ఎన్ని చేపలుండాలి


శాస్త్రీయ కారణం



  • నిమ్మకాయ, మిరపకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మందపాటి దారంలో నిమ్మకాయ, మిరపకాయలను గుచ్చడం వల్ల నిమ్మకాయ రసం నెమ్మదిగా పత్తిద్వారం ద్వారా మిరపకాయలో చేరి ఆవిరి రూపంలో బయటకు వస్తుంది. ఈ  ఆవిరి గాలిలో కలిసినప్పుడు శ్వాసకోస ఇబ్బందులకు చెక్ పెడుతుంది.

  • పూర్వం చాలామంది మట్టి,పేడతో  అలికిన ఇళ్లో ఉండేవారు. దీంతో చిన్నచిన్న పురుగులు, దోమలు ఈగలు ఇంట్లో ఎక్కువగా ఉండేవి. నిమ్మకాయ, మిరపకాయలు కలిపి ఇంట్లో గుమ్మానికో, దూలానికో కడితే పురుగులు వచ్చేవికాదు.

  • నిమ్మకాయను దారానికి కట్టి గుచ్చడం వల్ల నిమ్మకాయలోని సిట్రస్ యాసిడ్ వాసన బయటకు వీస్తూ క్రిములు రాకుండా అడ్డుకుంటుంది

  • మిరపకాయలోని ఘాటు కూడా పురుగులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అందుకే వాటిని గుమ్మానికి ఎదురుగా కట్టేవారు.


ఆధ్యాత్మిక కారణం
ఇల్లు, ఇంట్లోవారి ఎదుగుదల చూసి ఓర్వలేనివారుంటారు. అలాంటి వారి చూపులు, నిట్టూర్పుల వల్ల దిష్టి తగులుతుందని నమ్ముతారు. నిమ్మకాయ, మిరపకాయలు అలాంటి చెడు దృష్టిని ఆకర్షిస్తాయట. అందుకే ఇంటి ముందు ఇవి కడితే చెడు అనే మాటే మీ దరికి చేరదని చెబుతారు పండితులు. 


Also Read:  వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది 


వాస్తు ప్రకారం
వాస్తు శాస్త్రం ప్రకారం నిమ్మచెట్టు ఉన్న ఇంట్లో సంతోషం, సౌభాగ్యం వెల్లివిరుస్తుందట. పర్యావరణంలో ప్రసారం అయ్యే నెగిటివ్ ఎనర్జీని తీసుకుని పాజిటివ్ ఎనర్జీ విడుదల చేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.


మూఢనమ్మకాలు పేరుతో కొట్టిపడేవారు ఈ విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ... పెద్దలు పాటించి చెప్పిన ప్రతి విషయం వెనుకా ఓ శాస్త్రీయ కారణం ఉందని గ్రహించుకుంటే ఆరోగ్యం, ఆనందం. 


కొందరు పండితులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.  


Also Read:  ఏం చేసినా కలిసిరావట్లేదా? వాస్తు దోషం ఉందేమో ఇలా చెక్ చేయండి