తెలుగుదేశం పార్టీ నేతల బృందం నేడు నరసరావుపేటకు రానుంది. ఏరియా ఆసుపత్రిలో మృతుడు, టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ వర్గీయుల దాడిలో గాయపడి నరసరావుపేట ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎల్లయ్య, బక్కయ్య లను టీడీపీ నేతల బృందం పరామర్శించనుంది. దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో టీడీపీ నాయకుడు జల్లయ్య అంత్యక్రియలకు పార్టీ నేతలు హాజరు కానున్నారు. నేతల బృందం నరసరావుపేట రానున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంచార్జి చదలవాడ అరవింద బాబు ఇంటి వద్ద పోలీసుల మొహరించారు. నరసరావుపేటకు రాకుండా పోలీసులు తేలుకుంట్లలో మాజీ ఎమ్మెల్యే యరపతినేనిని శ్రీనివాసరావు గృహనిర్బంధం చేశారు.
నరసరావుపేట ఏరియా వైద్యశాల ఉద్రిక్తత.
పల్నాడు జిల్లా నరసరావుపేట ఏరియా వైద్యశాల ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు సంబంధం లేకుండా టీడీపీ నేత కంచర్ల జల్లయ్య మృతదేహానికి పోస్ట్ మార్టం చేశారంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పార్టీ నేతలు వచ్చే వరకూ పోస్ట్ మార్టం చేయొద్దంటూ మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన కు దిగారు. తమ మాట వినాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు జల్లయ్య కుటుంబసభ్యులు. కుటుంబసభ్యులు, బంధువులు మార్చురీ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, బంధువుల మధ్య తీవ్ర తోపులాట జరిగడంతో ఉద్రికత్తకు దారి తీసింది.
బంధువులను నెట్టివేసి పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని వైద్యశాల నుండి అంబులెన్స్ లో బొల్లాపల్లి మండలం రావులాపురానికి తరలించారు పోలీసులు. మృతదేహాన్ని తరలించకుండా జల్లయ్య కుటుంబసభ్యులు, బంధువులు అడ్డుపడ్డా ప్రయోజనం లేకపోయింది. వారిని నిర్దాక్షిణ్యంగా నెట్టివేసి జల్లయ్య డెడ్‌బాడీని అక్కడి నుంచి తరలించారు. సరసరావు పేట ఏరియా ఆస్పత్రి వద్ద బైఠాయించి మృతుడు కంచర్ల జల్లయ్య బంధువులు ఆందోళనకు దిగారు.
భగ్గుమన్న పాతకక్షలు
పల్నాడు జిల్లా మాచర్ల పాత కక్షలు భగ్గుమన్నాయి. ఓ వర్గం వారిపై ప్రత్యర్థులు దారికాచి గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు. దుర్గి మండలం మించాలపాడు వద్ద ఓ పార్టీ కార్యకర్తలపై మరో పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఐదు లక్షల రూపాయల అపహరించినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ముగ్గురికి గాయలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో గతంలో గొడవల కారణంగా గ్రామాన్ని వదిలి పెట్టి మాడుగులలో ఉంటున్నారు బాధితులు. వివాహం నిమిత్తం బంధువులను పిలిచేందుకు జంగమహేశ్వరపాడు వచ్చి వెళ్తున్నప్పు ప్రత్యర్థులు కాపు కాచి దాడి చేశారు నిందితులు. ఈ దాడిలో జాలయ్య అనే వ్యక్తి మృతి చెందారు.
Also Read: Palnadu Crime : పల్నాడులో భగ్గుమన్న పాత కక్షలు, ప్రత్యర్థుల దాడిలో వ్యక్తి మృతి