వాస్తు పట్టింపు ఉన్నవారికి ఇంట్లో ప్రతి అడుగూ సెంటిమెంటే. ఏ దిక్కున ఏం పెట్టాలి, అసలు ఇంట్లో ఏం ఉండొచ్చు, ఏ ఉండకూడదనే సందేహాలు చాలా ఉంటాయి.వీటిలో భాగమే అక్వేరియం. ఇంట్లో ఉండొచ్చని కొందరు..ఉండకూడదని కొందరు చెబుతారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే....



  • హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి 9 అవతారాల్లో మత్స్యావతారం ఒకటి. అంటే భూమండలపై ఉన్న సకలచరాచర జీవులన్నీ పూజకు అర్హులే అని పురాణాల ఉద్దేశం. 

  • సైన్స్ పరంగా చూస్తే చేపలు....నెగెటివ్ తరంగాలను తమలో ఇముడ్చుకుని చాలా చక్కటి అనుకూల  తరంగాలను బయటికి విడుదల చేస్తుందట

  • ఇంట్లో అక్వేరియం ఉంటే ప్రతికూల ఆలోచనలు, నెగిటివ్ ఎనర్జీని తరిమికొడుతుంది

  • ఆర్థిక ఇబ్బందులు, సంతానలేమి సమస్యలకు చెక్ పెట్టి అదృష్టాన్ని అందిస్తుందట అక్వేరియం

  • ఒక్కమాటలో చెప్పాలంటే అదృష్టానికి, ఇంట్లో ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్ అక్వేరియం


Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే


ఎన్ని చేపలు ఉండాలి



  • అక్వేరియంలో 9 చేపలు  ఉండేలా చూసుకుంటే మంచిది

  • వాటిలో 8 డ్రాగన్ చేపలు కాని, 8 గోల్డ్ ఫిష్‌లు కాని ఉండాలి. మిగిలిన ఒకటి కచ్చితంగా నల్లచేప ఉండాలి

  • డ్రాగన్ చేపలు, గోల్డ్ ఫిష్‌లు ఇంటి నుంచి దూరమైన అదృష్టాన్ని తిరిగి తీసుకొస్తాయి

  • నల్ల చేప... ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తరిమికొడుతుంది

  • అక్వేరియంలోని ఓ చేప చనిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు..మరో చేపను తీసుకొచ్చి వేయండి

  • చనిపోయిన చేపని ఇంటి బయట మట్టిలో పాతేయండి, అలాంటి చేపనే తిరిగి అక్వేరియంలో చేర్చండి

  • ఎప్పటికప్పుడు లెక్క తొమ్మిదికి తగ్గకుండా చూసుకుంటే ఇంట్లో అంతా శుభమే


Also Read: వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది 


పంచభూతాలు ఉండాలి



  • పంచభూతాలైన.. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం ఇవన్నీ అక్వేరియంలో ఉండేలా చూడాలి

  • అక్వేరియంని స్వచ్ఛమైన నీటితో తగినంత పరిమాణంలో నింపాలి

  • అక్వేరియం లోపలి భాగంలో చిన్నచిన్న మొక్కలు ఏర్పాటు చేయాలి

  • అక్వేరియం లోపల ఏదైనా లోహంతో ఓ ఆకృతి ఉంచాలి

  • రాళ్లు, గులకరాళ్లను లోపల అడుగుభాగాన ఏర్పాటు చేయాలి

  • ఐదవది ముఖ్యమైనది అగ్ని. ఇందుకోసం లోపల లైట్ వెలుగు పడేలా ఏర్పాటు చేయాలి


Also Read: ఏం చేసినా కలిసిరావట్లేదా? వాస్తు దోషం ఉందేమో ఇలా చెక్ చేయండి


అక్వేరియం ఏ ప్రదేశంలో ఉంచాలి 



  • అక్వేరియం పెడితే మంచిది..అందుకే పెట్టాం అంటే సరిపోదు. ఏ దిశగా ఉంచాలన్నది కూడా చూసుకోవాలి. వాస్తుకు తగ్గట్టుగా సరైన ప్రదేశంలో ఉంచాలి

  • సొంతిల్లు కదా అని అక్వేరియం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మీ ఇల్లు గుల్లైపోతుంది

  • అక్వేరియం ఉంచాల్సిన సరైన ప్రదేశం డ్రాయింగ్ రూమ్...అక్కడ కూడా వాస్తు ప్రకారం తూర్పు దిశగా కాని, ఉత్తర దిశగా కాని ఉండాలి

  • రాత్రిళ్లు అందంగా కనిపిస్తుంది కదా అని బెడ్ రూమ్ లో ఉంచితే దంపతుల మధ్య , కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి

  • వంటింట్లో ఉంచితే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది

  • అక్వేరియం ఎదురుగా దుష్ట జంతువుల బొమ్మలు అస్సలు ఉంచొద్దు. డ్రాగన్, పులి, అనకొండ, సింహం వగైరా వగైరా బొమ్మలు.  

  • సమయానికి తగ్గట్టుగా అక్వేరియంలోని పాత నీరును తీసేసి కొత్త నీరును నింపుతుండాలి

  • ఇంట్లో కానీ, కార్యాలయంలో కానీ సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు ఆ ప్రదేశాల్లో వాస్తు నిబంధనల ప్రకారం అక్వేరియం ఉంచండి.


Also Read: మీ ఇంట్లో ద్వారాలెన్ని, ఈ నంబర్ ఉంటే మాత్రం గండం తప్పదు