గృహమే కదా స్వర్గసీమ అంటారు..అలాంటి ఇంటి వల్ల అంతా మంచే జరగాలి కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ఆందోళన కలగకూడదు, తరచూ సమస్యలు రాకూడదు. కష్టాలు,సమస్యలకు కారణం వాస్తుమాత్రమేనా అంటే ఇది కూడా ఓ భాగం అని చెబుతారు వాస్తుపండితులు. అయితే వాస్తు పట్టింపు లేనివారికి ఎలాంటి బాధాలేదు కానీ...'వాస్తు' పట్టింపు ఉండేవారికి మాత్రం పునాది రాయి మొదలు ఇంటినిర్మాణం...ఆ తర్వాత ఇంట్లో అణువణువూ సెంటిమెంటే.  ఇలా ఇల్లాంతా ఓకేలే అని అనుకుంటే సరిపోదు చివరకి తలుపులు కూడా వాస్తులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. 


Also Read: వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది 


ద్వారాలు అంటే కేవలం గదులకు రక్షణకోసం మాత్రమే కాదు..ఇంట్లో నివసించేవారి వివిధ స్థితిగతులను మారుస్తుందని విశ్వసిస్తారు. సాధారణంగా ద్వారాలు, కిటికీలు సరిసంఖ్యలో ఉండాలి. అయితే  కిటికీలు, ద్వారాలు లెక్కిస్తే మళ్లీ 10 రాకూడదు, బేసి సంఖ్య రాకూడదు. పది సరిసంఖ్యే కదా అని అమాయకంగా అడగకూడదు..ఎందుకంటే సరిసంఖ్య రావాలి కానీ చివర్లో సున్నా( శూన్యం) ఉండకూడదని చెబుతారు వాస్తు పండితులు. 


ఎన్ని ద్వారాలున్న ఇంట్లో ఎలాంటి ఫలితాలుంటాయి



  • రెండు ద్వారాలు- చాలా శ్రేష్టమైనది. ఈ ఇంట్లో నివాసం ఉండేవారు అభివృద్ధి చెందుతారు

  • మూడు ద్వారాలు -ఎప్పుడూ గొడవలు సాగుతూనే ఉంటాయి. ఇంట్లో గొడవలు చాలవన్నట్టు కొత్త శత్రువులు పెరుగుతూ ఉంటారు.

  • నాలుగు ద్వారాలు- ఈ ఇంట్లో ఉండేవారి ఆయుష్షు పెరుగుతుంది

  • ఐదు ద్వారాలు- నిత్యం  అనారోగ్య సమస్యలు

  • ఆరు ద్వారాలు - ఇంట్లో ఉండేవారికి సంతాన వృద్ధి, ఐశ్వర్యం  ఉంటుంది

  • ఏడు ద్వారాలు - ఈ ఇంట్లో నివాసం ఉండేవారిని అపాయాలు వెతుక్కుంటూ వస్తాయి

  • ఎనిమిది ద్వారాలు -ఇంటివారికి పట్టిందల్లా బంగారమే. ఐశ్వర్యం, సౌభాగ్యంతో తులతూగుతారు

  • తొమ్మిది ద్వారాలు- రోగాలు పట్టి పీడిస్తాయట

  • పది ద్వారాలు-ఇంట్లో దొంగలు పడే అవకాశం ఉందని వాస్తుశాస్త్రం చెబుతోంది.

  • పదకొండు ద్వారాలు- ఇంట్లో అష్టకష్టాలు అనుభవించ తప్పదు

  • పన్నెండు ద్వారాలు- ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధిని, కీర్తిని కలిగిస్తుంది.

  • పదమూడు ద్వారాలు - మరణ ప్రమాదం, ఎడతెరిపి లేని కష్టాలు అనుభవిస్తారు

  • పద్నాలుగు ద్వారాలు- ధన సంపద, కుటుంబ వృద్ధిని కలిగిస్తుంది.

  • పదిహేను ద్వారాలు - ఎన్నో కష్టాలు,బాధలు,అశాంతి,అధిక ఖర్చులు

  • పదహారు ద్వారాలు- ఏ పని తలపెట్టినా లాభం, అధికార యోగం


Also Read: ఏం చేసినా కలిసిరావట్లేదా? వాస్తు దోషం ఉందేమో ఇలా చెక్ చేయండి


వాస్తురీత్యా సూచించిన గుమ్మాల సంఖ్యం సరిగ్గా ఉన్నట్టైతే ఆ ఇంట్లో నివశించే వారు ఆరోగ్యంగా, అన్యోన్యంగా ఉంటారు. వాస్తు శాస్త్రానికి భిన్నంగా గుమ్మాల సంఖ్య ఉన్నట్టైతే ఆ కుటంబంలో కలతలు, కలహాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. 


గమనిక: కొందరు వాస్తుపండితుల సలహాలు, కొన్ని పుస్తకాలు ఫాలో అయి రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...