ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( AP Governament  ) వ్యవసాయ , అనుబంధ శాఖల బడ్జెట్‌ను రూ. 43, 052. 78 కోట్లను ప్రతిపాదించారు మంత్రి కురసాల కన్నబాబు ( Minister Kannababu ) . ఇందులో వ్యవసాయ రంగానికి ( Agriculture )  రూ. 11,387.69 కోట్లను ప్రతిపాదించారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు శాసనసభలో(  Assembly )  ప్రవేశపెట్టారు.  మార్కెటింగ్ యార్డుల్లో నాడు-నేడు, మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి 614.23 కోట్లు కేటాయించినట్లు కన్నబాబు  వెల్లడించారు. అలాగే సహకార శాఖకు రూ. 248.45 కోట్లు, ఆహార శుద్ధి విభాగానికి 146.41 కోట్లు, ఉద్యానశాఖకు 554 కోట్లు, పట్టు పరిశ్రమకు 98.99 కోట్లు కేటాయించారు.  


2,56,257 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌, నాలుగు కీలకాంశాలపైనే దృష్టి పెట్టామన్న ఆర్థిక మంత్రి


ఆచార్య ఎంజీ రంగా ( NG Ranga ) వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 421.15 కోట్లు, వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 59.91 కోట్లు, వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి 122.50 కోట్లు కేటాయించారు.  పశు సంవర్ధక శాఖకు 1027.82 కోట్లు, మత్స్య శాఖ అభివృద్ధి కోసం రూ. 337.23 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 5000 కోట్లు. వైఎస్సార్ జలకళకు 50 కోట్ల కేటాయింపులతో పాటు నీటి పారుదల రంగానికి 11450.94 కోట్ల ప్రతిపాదన ఉంచింది ఏపీ ప్రభుత్వం.


పోలవరం పూర్తిపై బడ్జెట్‌లో కీలక ప్రకటన, ప్రాజెక్టు పూర్తిపై క్లారిటీ


  రైతుల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్‌ జగన్‌ ( YS Jagan ) ప్రభుత్వం ముందుకెళ్తోందన్న మంత్రి కన్నబాబు.. రాయితీలతో పాటు నాణ్యత అందించే విషయంలో ఎక్కడా తగ్గకుండా ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని జల కళ ( Jala kala ) వంటి పథకాలను సీఎం జగన్ ప్రారంభించారని వచ్చే ఆర్థిక సంవత్సరంలో యాభై వేల బోర్లను ఉచితంగా వేయడంతో పాటు మోటార్లను కూడా అందిస్తామన్న కన్నబాబు ప్రకటించారు.


నగరిలో ఈ సారి స్టార్ వార్ - రోజాపై పోటీకి వాణీ విశ్వనాథ్ సై !


వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుబంధం చేస్తామని మంత్రి కన్న బాబు తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఉపాధి హామీ ద్వారా అరవై శాతం ఉపాధిహామీ పనులు చేసే అవకాశం ఉందని కన్నబాబు తెలిపారు.  డాక్టర్, ఇంజినీర్ల వంటి వారి అవసరం ఎప్పుడో ఓ సారి వస్తుందని కానీ రైతు అవసరం మాత్రం ప్రతీ రోజూ మూడు పూటలా ఉందని కన్నబాబు అన్నారు.. అందుకే రైతు దేవోభవ అంటూ ప్రసంగాన్ని ముగించారు.