Radhe Shyam Audience Review | ప్రభాస్(Prabhas), పూజా హెగ్డే(Pooja Hegde) నటించిన ‘రాధేశ్యామ్’(Radhe Shyam) సినిమా శుక్రవారం (మార్చి 11న) థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో ప్రభాస్ భవిష్యత్తును ముందుగానే తెలుసుకునే  విక్రమాదిత్య పాత్రలో నటించాడు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మించారు. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు సమకూర్చారు. తమన్ నేపథ్య సంగీతం అందించారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.


ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ‘రాధే శ్యామ్’కు గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ ధరల విషయంలో నిర్మాణ సంస్థకు వెసులుబాటు కల్పించింది. ఈ సినిమా ప్రీమియం టికెట్‌ ధరపై రూ.25 అదనంగా పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ‘రాధేశ్యామ్’ సినిమా బడ్జెట్‌ రూ.170 కోట్లు కాగా, జీఎస్టీ, ఇతర బిల్స్‌ను నిర్మాణ సంస్థ ఏపీ ప్రభుత్వానికి అందించింది. నటుల రెమ్యునరేషన్‌తో సంబంధం లేకుండా సినిమా తీయడానికి రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేస్తే టికెట్‌ ధర పెంచుకునే వెసులుబాటు కల్పిస్తామని సీఎం జగన్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి, ఇప్పటికే ‘రాధేశ్యామ్’ను వీక్షించిన ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూసేద్దామా!


Also Read: ‘రాధే శ్యామ్’ రివ్యూ: ఇదో విజువల్ వండర్, కానీ..


చాలా కొత్తగా ఉంది. అన్నీ అద్భుతంగా ఉన్నాయి.






అంత గొప్పగా లేదు.






పాత కథే.. లో-బడ్జెట్ టైటానిక్.






తమన్ బీజీఎం కిర్రాక్.






ఫస్ట్ ఆఫ్ కేక. లోకేషన్స్, వీఎఫ్ఎక్స్ అదిరాయి.






ఫస్ట్ ఆఫ్ స్లోగా ఉంది. సెకండ్‌ ఆఫ్‌లో చాలా ఆసక్తికర సీన్స్ ఉన్నాయి. అమెరికా తెలుగు వెర్షన్‌లో కృష్ణం రాజు లేరు.






2.5/5, సాంగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్, సెకండ్ ఆఫ్ బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్, అనవసర కామెడీ సీన్స్ మైనస్. 






అరాచకంగా ఉంది మూవీ. ఏమ్ మూవీ తీసావ్ డార్లింగ్. 






ఫ్యామిలీస్‌తో కలిసి హ్యాపీగా చూడవచ్చు. 






బాగుంది, ఒకసారి చూడవచ్చు.






సెకండ్ ఆఫ్ స్లో, స్టోరీ నరేషన్, పూర్ కామెడీ మైనస్‌లు. పూజా లవ్ సీన్స్, ఫస్ట్ 20 ని. విజువల్స్ బాగున్నాయి. 






ఫస్ట్ ఆఫ్ సూపర్ అన్నవాడిని చెట్టుకు కట్టేసి కొట్టాలి.






ఒకటి రెండు సీన్స్ అతిగా ఉన్నాయ్, మిగతాది అంతా గుడ్.






విజువల్ ట్రీట్. అంచనాలు లేకుండా వెళ్లండి. తప్పకుండా లవ్ స్టోరీ నచ్చుతుంది. క్లైమాక్స్ అదుర్స్.






ఫస్ట్ ఆఫ్ అద్భుతం - ప్రభాస్, పూజా హెగ్డేలు స్క్రీన్‌పై మ్యాజిక్ చేశారు. 






వన్ మ్యాన్ షో.






టైటానిక్ స్థాయిలో ఉంది. 






హాలీవుడ్ మూవీ ఫీల్ కలిగింది.






గమనిక: ఆడియన్స్ అభిప్రాయాలను యథావిధిగా అందించాం. వారు పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదు.