బుల్లితెర బాహుబలి అనిపించుకున్న కార్తీకదీపం సీరియల్ కి దక్కుతున్న ఆదరణగురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనాలేమో.  విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఈ సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబు గా నటించిన కార్తీక్, దీప పాత్రలను చంపేశాడు డైరెక్టర్. దీంతో ఈ సీరియల్ కి శుభం కార్డు పడుతుందేమో అనుకున్నారు అభిమానులు. అయితే అవును కార్తీకదీపం ఈ జనరేషన్ అయిపోతుందంటూ క్లారిటీ ఇచ్చేసింది మోనితగా నటిస్తోన్న శోభాశెట్టి. ఈ రోజు తనకు కార్తీకదీపం షూటింగ్ ఆఖరి రోజు అని చెబుతూ ఇంట్లోంచి బయలు దేరినప్పటి నుంచీ సెట్ కి వెళ్లడం, మేకప్ వేసుకోడం, ఆ తర్వాత  సెట్లో ఒక్కొక్కరితో మాట్లాడుతున్న వీడియో పోస్ట్ చేసింది. 



ఈ సీరియల్లో వంటలక్క డాక్టర్ బాబు పాత్రలకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో..విలన్ గా నటిస్తోన్న మోనిత పాత్రకి కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. ఈ సీరియల్ చూస్తున్నంత సేపూ కొందరు అభిమానంతో మరికొందరు ఎప్పడైపోతుందో అన్నట్టు చూశారు. మోనితగా నటించిన శోభాశెట్టికి గతంలో ఏ సీరియల్ లోనూ దక్కనంత ఆదరణ దక్కింది. ఏ రేంజ్ లో అంటే అదొక సీరియల్ అన్నమాట మరిచిపోయి కూడా వంటలక్క-డాక్టర్ బాబు మధ్యనుంచి తప్పుకో అని వార్నింగ్ వచ్చేంతలా. అటు తాను కూడా చాలా కనెక్ట్ అయిపోయానంది మోనిత. ఏదేమైనా ఈ జనరేషన్ కార్తీకదీపం సీరియల్ కు త్వరలోనే శుభం కార్డు పడబోతుందని ఇదే లాస్ట్ డే షూటింగ్ అంటూ మోనిత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేసింది. 






మోనిత షేర్ చేసిన వీడియోతో కార్తీకదీపం అభిమానులకు క్లారిటీ వచ్చింది. గత ఆరేళ్లుగా కొనసాగుతున్న సీరియల్ లో శోభాశెట్టి క్యారెక్టర్ కి శుభం కార్డ్ పడింది సీరియల్ కి కాదని. హిమ క్యారెక్టర్ మెయిన్ అని వీడియో ఆఖర్లో చెప్పిన మోనిత మాటలు గమనిస్తే...పెద్దనై హిమ  క్యారెక్టర్లో దీప( ప్రేమీ విశ్వనాథ్) ఎంట్రీ ఇస్తుందన్నమాట. ఆరేళ్లుగా ఈ సీరియల్ లో ఏ క్యారెక్టర్ ఆర్టిస్టు, టెక్నీషియన్ కూడా  మారకుండా అందరూ ఒక కుటుంబంలా పనిచేసాము అలాంటి సీరియల్ నుంచి తను వెళ్లిపోవడం  బాధగా ఉందంది మోనిత. షూటింగ్ లొకేషన్లో ప్రతి ఒక్క ఆర్టిస్టుతో మాట్లాడి షూటింగ్ పూర్తిచేసుకున్న తర్వాత కేక్ కట్ చేసి అందరికీ బైబై చెప్పేసింది.  


Also Read: వంటలక్క-డాక్టర్ బాబు పాత్రలకి శుభం కార్డ్, హిమపై పగబట్టిన శౌర్య, రేపటి నుంచి సరికొత్త కార్తీక దీపం
Also Read: కాలి బూడిదైన డాక్టర్ బాబు, వంటలక్క- బావా మరదళ్లుగా దీప, కార్తీక్ రీఎంట్రీ ఉండబోతోందా