గృహమే కదా స్వర్గసీమ అంటారు..అలాంటి ఇంటి వల్ల అంతా మంచే జరగాలి కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ఆందోళన కలగకూడదు, తరచూ సమస్యలు రాకూడదు. కష్టాలు,సమస్యలకు కారణం వాస్తుమాత్రమేనా అంటే ఇది కూడా ఓ భాగం అని చెబుతారు వాస్తుపండితులు. అయితే వాస్తు పట్టింపు లేనివారికి ఎలాంటి బాధాలేదు కానీ...'వాస్తు' పట్టింపు ఉండేవారికి మాత్రం పునాది రాయి మొదలు ఇంటినిర్మాణం...ఆ తర్వాత ఇంట్లో అణువణువూ సెంటిమెంటే.  మరి...


వాస్తుపట్టింపు ఉండేవారు ఇవి పాటిస్తున్నారో లేదో చెక్ చేసుకోండి



  • ఇంటి ముఖ ద్వారానికి ఎదురుగా మరణించిన పెద్దల ఫొటోలు అమర్చరాదు. కేవలం దేవుళ్ల ఫొటోస్ మాత్రమే అమర్చాలి. వినాయకుడి ఫొటో పెడితే ఇంకామంచిది.

  • ఇంటి గోడలు కట్టేట్టపుడు తాపీ మేస్త్రీలు,పై పనులు చేయటం కోసం సపోర్టు కర్రలు వేసే సమయంలో గోడలకు కన్నాలు వేస్తుంటారు. వాటిని అవసరం తీరిన వెంటనే ఆ కన్నాలు తప్పనిసరిగా మూసేయ్యాలి.

  • వాయువ్యం పెరిగినా,మూతపడినా ఇంకా వాయువ్యంలో ఇంకా దోషాలేమైనా ఉంటే వాయుపుత్రుడైన హనుమంతుడిని ఆ ప్లేస్ లో ఉంచి పూజిస్తే ఆ దోషాల తీవ్రత తగ్గుతుంది.

  • తూర్పు ఈశాన్యం,ఉత్తర ఈశాన్యం,పడమర వాయువ్యం,దక్షిణ ఆగ్నేయం ఈ నాలుగు వైపులా వీధి పోట్లు మంచిది. తూర్పు ఆగ్నేయం,ఉత్తర వాయువ్యం,పడమర నైరుతి,దక్షిణ నైరుతి వీధి పోట్లు మంచివి కావు .

  • బీరువాలు నైరుతి వైపు ఉంచి ఉత్తరానికి తెరిచినట్టుండాలి

  • తూర్పు, ఉత్తర ప్రహరి గోడలపై పూల చెట్లు పెంచరాదు

  • మూడు పసుపు కొమ్ములు,పసుపు దారంతో గుమ్మానికి కడితే దృష్టిదోషం తొలగిపోతుంది.

  • పడమట వైపు స్థలం కొనుక్కుంటే భార్యకు అనారోగ్యం, నష్టం

  • ఈశాన్యంలో బరువు ఉంచరాదు...పడమర, దక్షిణం వైపు బరువులు ఉంచొచ్చు

  • దేవాలయాల నీడ, ధ్వజ స్థంభం నీడ పడే స్థలంలో ఇల్లు నిర్మించకూడదు

  • పాముల పుట్ట ఉన్న స్థలం కొనకూడదు. తక్కువ ధరకు వచ్చింది కదా అని పుట్టను తవ్వి ఇల్లు కట్టినా, ఇంట్లో నాగుపాముని చంపినా ..ఆ ఇంటి యజమాని కుటుంబానికి తరతరాలుగా నాగదోషం వెంటాడుతుంది.ఈ ఇంట పుట్టే పిల్లలు అంగవైకల్యంతో కానీ అనారోగ్యంతో కానీ పుడతారు. మళ్లీ పరిహారాలు చేసుకుంటే కానీ ఫలితం ఉండదు.


గమనిక: కొందరు వాస్తుపండితుల సలహాలు, కొన్ని పుస్తకాలు ఫాలో అయి రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...


Also Read: మీ ఇంట్లో ద్వారాలెన్ని, ఈ నంబర్ ఉంటే మాత్రం గండం తప్పదు


Also Read: వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది 


Also Read: ఏం చేసినా కలిసిరావట్లేదా? వాస్తు దోషం ఉందేమో ఇలా చెక్ చేయండి