ఆకస్మికంగా చనిపోయిన మంత్రి మేకపాటి గౌతం రెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి ( Mekapati Vikram Reddy ) తెరపైకి వచ్చారు. "గడప గడపకి మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని ఆత్మకూరు ( Atmakur ) నియోజకవర్గ ఇంచార్జ్ హోదాలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పథకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలకు అలవాటు పడవద్దని.. తీసుకున్న డబ్బులు ప్రభుత్వానికి చెల్లించాలని సూచించారు. అప్పుడే మరికొందరికి ఆ పథకాల ద్వారా డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు.   ఉచిత పథకాలకు ప్రజలు అలవాటు పడొద్దని, వాటిని స్కీమ్ లుగా అస్సలు భావించ వద్దని, అవకాశాలుగా భావించాలన్నారు.


అప్పు తిరిగివ్వమన్నందుకు దాడులు చేయిస్తున్నారు - మహిళా మంత్రిపై సొంత పార్టీ నేతల ఆరోపణలు !


గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలి.  విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే కాకపోయినా అధికారులు కూడా ఆయన ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పథకాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు. కొంత మంది పథకాలు అందుతున్నాయని చెప్పగా.. మరికొంత మంది అందడం లేదని వివరించారు. తమకు అర్హత ేదని తీసేశారని.. మరొకటని చెప్పడం ప్రారంభించారు. దీంతో పథకాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలనుకున్న విక్రమ్ రెడ్డి... ఉచిత పథకాలకు ప్రజలు అలవాటు పడొద్దని సూచించారు. వాటిని స్కీమ్ లుగా భావించ వద్దన్నారు. తిరిగి ట్యాక్స్ ల రూపంలో ప్రభుత్వానికి డబ్బులిస్తే.. అప్పుడందరూ పైకొస్తారని హితబోధ చేశారు. 


రుషికొండలో తవ్వకాలపై ఎన్జీటీ స్టే - ఇప్పటి వరకూ జరగిన తవ్వకాలపైనా అధ్యయనం !


ఆయన మాటల్ని ప్రజలు కాస్త వింతగా విన్నారు. పథకాల పేరుతో డబ్బులిచ్చి ఆ మొత్తాన్ని మళ్లీ పన్నులుగా కట్టడం ఎందుకని వారి డౌట్. ఆ డౌట్ అందరికీ వస్తుంది.. కానీ సమాధానం ఎవరూ చెప్పరు. మేకపాటి రాజమోహన్ రెడ్డి ( Rajamohan Reddy ) కుమారుడిగా విక్రమ్ రెడ్డికి రాజకీయాలతో సంబంధం ఉంది. అయితే ఆయన ఎక్కువగా విదేశాల్లో చదువులు.. తర్వాత వ్యాపార వ్యవహారాలతో బిజీగా ఉండేవారు. జనంలోకి వచ్చి రాజకీయం చేసింది తక్కువ . ఇప్పుడిప్పుడే వస్తున్నారు. అందుకే మరింత మెరుగైన అవగాహనతో ముందు ముందు గౌతంరెడ్డిని మరిచేలా రాజకీయం చేస్తారని వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు అనుకుంటున్నారు. 


రూ. వెయ్యి, రూ. 2 వేలు - వరద బాధితులకు పంచాలని సీఎం జగన్ ఆదేశం !