‘అసని’ ( Asani Typhoon ) తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కుటుంబానికి రూ. రెండు వేలు ఇవ్వాలని సీఎం జగన్ ( CM Jagan ) ఆదేశించారు.  ‘అసని’ తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమన్నారు.  తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమీక్ష ( CM Review )  నిర్వహించారు. ఈసందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ‘‘తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి.. ఇప్పటికే నిధులు ఇచ్చాం. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి. అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలి. సహాయ శిబిరాలకు తరలించిన వ్యక్తికి 1,000, కుటుంబానికి 2వేలు చొప్పున ఇవ్వండి’’ అని జగన్‌ ఆదేశించారు.


మరింత బలహీన పడిన అసని- రేపటికి వాయుగుండంగా మారిపోనున్న తుపాను


తుపాను ( Cyclone ) బలహీనపడినప్పటికీ  కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదు. ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలని జగన్ స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ( Safe Places ) తరలించండి. అవసరమైన చోట సహాయపునరావాస శిబిరాలను తెరవాలన్నారు.  సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసి.. జనరేటర్లు, జేసీబీలు.. ఇవన్నీ కూడా సిద్ధంచేసుకోండి. కమ్యూనికేషన్‌ వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని’’ సీఎం అధికారులను ఆదేశించారు. 


రైళ్ల రాకపోకలపై అసని తుపాను ఎఫెక్ట్! కొన్ని రద్దు, రీషెడ్యూల్ చేసిన ట్రైన్స్ ఇవే


‘‘తుపాను బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించండి. వారికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవాలి. పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దన్నారు.  సెంట్రల్‌ హెల్ప్‌ లైన్‌తో పాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లు సమర్థవంతగా పనిచేసేలా చూడాలి. వచ్చే కాల్స్‌ పట్ల వెంటనే స్పందించండి. ఈ నంబర్లకు బాగా ప్రచారం కల్పించాలని’’ సీఎం ఆదేశించారు. 


బెజ‌వాడకు డ్రగ్స్ అలా వ‌చ్చాయి, విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు


అసని తుపాను ప్రభావంతో విశాఖ ( Visaka ) , తుర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు ( Guntur ) , కృష్ణా జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. విశాఖపై అసని తుపాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంది.  


తీవ్రతుపాను నుంచి తుపానుగా బలహీనపడిన 'అసని'- అధికార యంత్రాగం అప్రమత్తం